ఆవిష్కర్తల అమూల్య అక్షరావిష్కరణ (Health)

health-p18ds0qn2g1sq31jko1ff4mhu1dulడాక్టర్‌ అద్దేపల్లి రామమోహనరావు,

ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు

ఒకే ఊరికి చెందిన ముగ్గురు శిఖరాజమానమైన కవుల్ని తీసుకుని, వారి వ్యక్తిత్వ, కవిత్వాల్ని గూర్చి వివరిస్తూ, వారి భావజాలాల్ని కవితాభివ్యక్తిని విశ్లే షిస్తూ పుస్తకం రాయడమనేది బహుశా ఇదే మొదలు కావచ్చు. ఒక ఊళ్ళో వున్న అందరు కవుల్ని గురించి రాయడం వేరు, ఒకే ఊరిలోని మూడు అత్యంత ప్రధానమైన భావధారలకు ప్రతినిధులైన వారిని గూర్చి రాయడం వేరు. ఈ విధానంలో కవితా ప్రాధాన్యమే కాక, సామాజిక చైతన్య విశిష్టత కూడా సమ్మిళితమై వుంటుంది. సమకాలీనమైన అవగాహనకు సహకరి స్తుంది.

మహాకవి  జాషువా  అద్భుతమైన పద్య రచనలో ప్రజాభ్యుదయ భావాల్ని, దళిత ప్రగతి భావాల్ని అందరి హృదయాలకి హత్తుకునేటట్లు చెప్పి ఒక నూతన యుగాన్ని ప్రారంభించిన మహావ్యక్తి. కామ్రేడ్‌ పులుపుల శివయ్య మార్క్సిస్టు అభ్యుదయ  భావాలు  గల కవియే కాకుండా ఆ  ఉద్యమ ప్రారంభ దశల నుండి  నిర్మాణంలోనూ,  ప్రజా సమీకరణంలోనూ విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన గొప్ప ఉద్యమకారుడు, మహా  త్యాగశీలి.  వారిద్దరిదీ నడిచిన చరిత్ర. షేక్‌  కరీముల్లాది నడుస్తున్న చరిత్ర.  సమకాలీన  మత విద్వేషాల నుండి, సమాజానికి మానవతను, ప్రేమ తత్వాన్నిసందేశంగా ఇస్తూ తెలుగు సాహి త్యంలో ఇస్లాం వాదానికి, ప్రగతిశీల ముస్లిం కవిత్వానికి ప్రారంభకుడై మార్గ దర్శిjైు, అనేకమంది కవుల్ని ఆ పంథాలో నడిపిస్తున్న నిబద్ధ కవి. కరీముల్లాకి జాషువా వారసత్వమూ ఉంది. శివయ్య వారసత్వమూ ఉంది. అందుకే మైనారిటీ గుండె చప్పుడు విన్పించగలుగుతున్నాడు. సామ్రాజ్యవాద  వ్యతిరేకతను రగిలించ గలుగుతున్నాడు.  తమదైన భావధారలతో సాహిత్యాన్ని   ప్రభావితం  చేసిన ఈ ముగ్గురు  కవులు  వినుకొండ వాళ్ళు కావడం విశేషమే.

‘ఆవిష్కర్తలు’ అనే ఈ పుస్తకం ముగ్గురికీ న్యాయం చేసేవిధంగా డాక్టర్‌ వంకాయల పాటి రామకృష్ణ రాయడం ప్రశంసనీయం. వారి వారి జీవిత విశేషాలు, కవితారీతులు రెండిరటినీ సమగ్రంగా వివరించారు. అంతేకాక, ఎవరి గురించి ఏ ప్రధానాం శాలు చెప్పాలో,  ఏ భావధారలకు వారు ప్రాతినిధ్యం  వహిస్తున్నారో   సరైన                    ఉదాహరణల  ద్వారా  నిరూపించారు. వినుకొండలో త్రివేణి రూప భావజాలాల సంగమ స్థలంగా ఈ పుస్తకాన్ని రూపొం దించారు.

డాక్టర్‌ రామకృష్ణ చేసిన ఈ కృషి అందరి మన్ననలు పొందగలదని భావిస్తున్నాను. హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

 

పేజీలు 44,      వెల రూ. 40

ప్రతులకు

డాక్టర్‌ వంకాయలపాటి రామకృష్ణ

జెడ్‌పివిపి స్కూల్‌, కరవడి

ఒంగోలు (మం)` 523 182

ప్రకాశం జిల్లా

ఫోన్‌ : 8897822469

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *