కుటిల రాజకీయాలు

రాజధానిలేని ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో తీసుకెళ్ళే సమర్థ నేత చంద్రబాబు అని గత ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా సీమాంధ్ర ప్రాంత  ఓటర్లు   తీర్పు  చెప్పారు.  ప్రజా తీర్పును  ఎవరైనా  గౌరవించాల్సిందే. అందుకు  తగ్గట్టుగానే  చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన  సందర్భంగా ఆయన ప్రసంగం సాగింది. ఈ కార్యక్రమాన్ని మహ త్తర  ఘటనగా  చిత్రీకరించిన మీడియా చంద్రబాబును  ఆకాశానికెత్తింది.  తన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయాన్ని పాటించారని  మీడియా తుది తీర్పు ఇచ్చే సింది. తనకున్న స్వేచ్ఛ వల్ల మీడియా అలా చేసి ఉండొచ్చు. కానీ చంద్రబాబునాయుడి కేబినెట్‌ కూర్పును ఓసారి పరిశీలిస్తే ఆయన సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తు న్నారా లేక  విభజించు  పాలించు సిద్ధాం తంతో సామాజిక న్యాయానికి సమాధి కడు తున్నారా అన్నది స్పష్టమవుతోంది. ముస్లిం, ఎస్టీ వర్గాలకు కేబినెట్‌లో చోటివ్వకుండా చేసిన అన్యాయాన్ని మున్ముందు చంద్ర బాబు బిసి,  కాపు వర్గాల పట్ల కూడా ప్రద ర్శించవచ్చు.  ఆయన విభజించు పాలించు సిద్ధాంతం ఇదే చెబుతోంది. ప్రస్తుతం చంద్ర బాబునాయుడి అడుగులు అన్నీ కాషాయీ కరణ  బాటలోనే  సాగుతున్నాయని చెప్ప వచ్చు.  ఒకప్పుడు మండల్‌  కమిషన్‌కు వ్యతిరేకంగా బిజెపి మాతృ సంస్థ జనసంఫ్‌ు పోరాటం  చేసిన  విషయాన్ని మనం ఓసారి పరిశీలించాలి.  ఇప్పుడు  అదే  బిజెపి బిసి ప్రధాని  నినాదాన్ని  చాపకింద  నీరులా ప్రచారం చేసి లబ్ది పొందిన  తీరును అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా లలో సామాజిక న్యాయం అజెండాను తెర పైకి తీసుకొచ్చిన చంద్రబాబు ఆ తరు వాత అనుసరించిన వైఖరిని పరిశీలిస్తే ఆయన కుటిల  రాజకీయాలు  బట్టబయలు అవు తాయి.geeturai_weekly_11

కేబినెట్‌లో సామాజిక న్యాయం పాటించారా?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రముఖ్యమంత్రిగా చంద్ర బాబునాయుడితోపాటు  మరో  19 మంది రాష్ట్ర కేబినెట్‌ మంత్రులుగా అట్టహాసంగా ప్రమాణస్వీకారం  చేశారు.  ఈ కేబినెట్‌ కూర్పులో  చంద్రబాబు  సామాజిక సమ తుల్యతను  పాటించారని  టిడిపి నేతలు జబ్బలు చర్చుతున్నారు. సామాజిక న్యాయం అన్న అర్థాన్ని చంద్రబాబుతప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బిసి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను ఆంధ్ర ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా చేసి సామాజిక న్యాయం  పాటించినట్లు చంద్రబాబు చెప్పు కొనే  ప్రయత్నం  చేస్తున్నారు. కానీ ఈ కేబినెట్‌లో ముస్లిం,  ఎస్టీకి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఎలా సామాజిక న్యాయం అవుతుందో చంద్రబాబు ఆయన అభిమాన నేతలు చెప్పాలి. టిడిపిలో ముస్లిం మైనార్టీ నేతలు ఎందరో ఉన్నారు. వారిని మంత్రిని చేసి వారిని మున్ముందు ఎమ్మెల్సీగా నామి నెట్‌ చేసే  అవకాశముంది.  ఆ దిశగా ఆయన చర్యలు  ఎందుకు తీసుకోలేదు అన్నది టిడిపి నాయకత్వం స్పష్టత ఇవ్వాలి. బిసిలకు   రాజ్యాధికారంలో  పెద్దపీట వేయడం తప్పులేదు.వారి జనాభా దామాషా ప్రకారం వారికీ చట్టసభలలో స్థానం దక్కా ల్సిందే. అదే తరహాలో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాముఖ్యత దక్కాలి.  అప్పుడే అది సామాజిక న్యాయం అవుతుంది.  కానీ  చంద్రబాబు సామాజిక న్యాయం అజెండా అందుకు భిన్నంగా ఉంది. ఓటు బ్యాంకుగా మెజార్టీగా ఉన్న బిసి లను,  కాపులను  దగ్గరికి తీసుకొని ఇతర వర్గాలతో  తనకు  పని లేదన్న  భావనతో ఆయన ముందుకెళ్తున్నట్లు  రాష్ట్ర కేబినెట్‌ కూర్పుతో స్పష్టమవుతోంది.  చంద్రబాబు వైఖరి మున్ముందు బిసిలలోని పలు కులా లలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. తన తొలి కేబినెట్‌లో ముస్లిం, ఎస్టీ అభ్యర్థులకు ప్రాముఖ్యత   కల్పించలేదు.  ముస్లింలకు టిడిపి తరఫున చట్ట సభలో ప్రాతినిధ్యమే దక్కలేదు. ఈ కారణంచేతనే ముస్లింలకు కేబినెట్‌లో స్థానం దక్కలేదని ఆపార్టీ నేతలు చంద్రబాబును  వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  నారాయణ  విద్యా సంస్థల అధినేత  నారాయణ  మంత్రి  అయ్యారు. ఆయన  ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీకాదు. అయినా  ఆయనకు మంత్రి పదవి వరిం చింది. త్వరలో ఆయన్ని ఎమ్మెల్సీగా నామి నేట్‌ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. అంటే బిసి, కాపు వర్గాలు తమకు చాలు ఇతర వర్గాలతో తమకు పనిలేదన్నట్లు చంద్రబాబు వైఖరి ఉంది. ఈ  విషయాన్ని పరిశీలిస్తే చంద్రబాబు అడుగులు వేస్తున్నది సామాజిక న్యాయం వైపా లేక విభజించు పాలించు రాజకీయాల వైపా అన్నది మనకు ఇట్టే అర్థ మవుతోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా తన విభజించు పాలించు రాజకీయాలను చాపకింద నీరులా పారిస్తున్నారని స్పష్టమవు తోంది.

సంక్షేమం హుష్‌కాకి…?
సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందు అన్ని వర్గాలను  దగ్గరకు  తీసుకొనే వ్యూహాన్ని టిడిపి అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు ప్రారంభించారు.  రాష్ట్ర విభజన ప్రస్తావన నాటికి  బలంగా తెరపైకి రాలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టిడిపి మైనార్టీ సెల్‌ సమావేశం ఏర్పాటు చేసి ముస్లింలకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ బడ్జెట్‌ ఇస్తా నని హామి ఇచ్చారు. రిజర్వేషన్ల అమలు, ఇతర  హామీలు  ముస్లిం సమాజం పట్ల కురిపించారు. రాష్ట్ర విభజన అనంతరం తన ప్రాధమ్యాలను చంద్రబాబు మార్చేసు కున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నచోట్ల ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించలేదు. గుంటూరు` 2లో గత కొన్నేళ్ళ చరిత్రకు భిన్నంగా అక్కడ ముస్లిమేతర అభ్యర్థిని చంద్రబాబు బరిలోకి దించారు.   నంద్యాల  అసెంబ్లీ టికెట్‌ ఎన్‌ఎండి ఫరూక్‌కు ఇవ్వకుండా లోక్‌సభ సీటు ఇచ్చి  అక్కడ ముస్లిం అభ్యర్థి విజ యావకాశాలను చంద్రబాబు దెబ్బతీశారు. ఇదంతా  ఒక  ఎత్తుఅయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింల ఉనికి ప్రమాదంలోపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఎందుకంటే మైనార్టీ సంక్షేమశాఖ  ఎవరి  చేతిలోకి వెళ్త ందన్న ఆందోళన ప్రస్తుతం ఉంది. ఈ శాఖ ముస్లిమేతర మంత్రి చేతుల్లోకి వెళితే ఇక మైనార్టీ  సంక్షేమం  అటకెక్కినట్లే. ఇప్పటి కప్పుడు ముస్లిం వ్యక్తి మైనార్టీ సంక్షేమశాఖ చేపట్టే అవకాశంలేదు. ఎందుకంటే ప్రస్తుతం టిడిపి తరఫున ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు ఒక్కటే. ఆ  ఒక్కస్థానం  నుంచి  మంత్రి కాబడిన  నారాయణకు  చోటు కల్పించ నున్నారని  సమాచారం.  విజయనగరం జిల్లాలో విజయనగరంకు  చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఖాళీ చేసిన శాసనమండలి స్థానంనుండి నారాయణను ఎంపిక చేసేం దుకు చంద్రబాబుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే, విజయనగరంకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి ఇటీవలే శాసనసభ్యుల  కోటా  నుండి శాసనమండ లికి ఎంపికయ్యారు.   అయితే  ఇటీవలే జరిగిన సాధారణ ఎన్నికల్లో  విజయనగరం నియోజకవర్గం   నుంచి  వైఎస్‌ఆర్‌సీపీ తరఫున కోలగట్ల  పోటీ చేశారు.  అందుకు వీలుగా ఆయన తన శాసనమండలి సభ్య త్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం  ఖాళీగా  ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ (సీమాంధ్ర) రాష్ట్రం  నుండి ఇంకా పలు ఖాళీలు న్నప్పటికీ అవన్నీ ఇప్పటికప్పుడు భర్తీ చేసే అవకాశంలేదు. వచ్చే మార్చి వరకు ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నిక కావడానికి అవకాశం లేదు. ఒక కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేసిన స్థానం నుంచి తప్ప. దీనినిబట్టి  మళ్ళీ కేబినెట్‌ విస్తరణలోనూ ముస్లింలకు  అవకాశం దక్కని పరిస్థితి. అంటే కొన్ని  నెలల  పాటు మైనార్టీ సంక్షేమ శాఖ ముస్లిమేతర  వ్యక్తి  చేతిలోఉండే అవకాశాలు ఉన్నాయి.  ముస్లింల సమ స్యలు ముస్లిమేతర  మంత్రికి ఏమాత్రం అవగాహన ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మైనార్టీల సంక్షేమానికి చంద్ర బాబు పాతర వేస్తున్నారు. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ముస్లిం అభ్య ర్థికి చంద్రబాబు అవకాశం కల్పించి మంత్రి పదవి ఇస్తారా  అన్నది  కూడా సందేహంగా మారింది.  తొలి  కేబినెట్‌లో సామాజిక న్యాయం   పాటించని   చంద్రబాబు మున్ముందు  న్యాయం  చేస్తారంటే నమ్మేది ఎలా..?

బలహీనవర్గాల ఉనికికి, ఐక్యతకు సవాల్‌
చంద్రబాబు వైఖరిని  నిశితంగా  గమనిస్తే ఏ బలహీన వర్గానికీ అందలం ఎక్కించడం లేదని, తన అవసరం కోసం ఒక్కో వర్గాన్ని దగ్గరకు తీసుకుంటున్నారన్న వాస్తవం బట్ట బయలవుతోంది.  బాబు  వైఖరి అన్ని బడుగు, బలహీనవర్గాల  మధ్య ఐక్యతకు, వారి ఉనికికి ప్రమాదంగా చెప్పవచ్చు. ఎన్ని కల్లో పార్టీ  గెలుపునకు  కావాల్సిన ఓటింగ్‌ శాతంపైనే  బాబు దృష్టి సారిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ ఓడినా, ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా మూడు, నాలుగు శాతం ఓట్ల తేడాతోనే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన పార్టీ గెలుపునకు అవసరమైన ఓట్ల శాతాన్ని లెక్కకట్టి గత సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక న్యాయం అజెండాను ఎత్తుకొని మెజార్టీ ఓటర్లుగా ఉన్న  బిసి,  కాపులను దగ్గరకు తీసుకున్నారు.  వారిద్దరికి  ఉప ముఖ్య మంత్రి  పదవులు  అని  ప్రకటించి  ఆ మాటను సైతం నిలబెట్టుకొన్నారు.  కానీ ఎస్సి, ఎస్టీ,  ముస్లిం  వర్గాల విషయంలో మాత్రం ఆయన  ఎలాంటి  స్పష్టత ఇవ్వ లేదు. కారణం బిసి,  కాపు  ఓట్లు తమకు పడితే చాలు ఇతర వర్గాల ఓట్లు అవసరం లేదన్న వైఖరికి బాబు వచ్చేశారు. అందుకే టికెట్ల కేటాయింపు మొదలు మంత్రి పద వుల విషయంలోనూ ముస్లిం, ఎస్టీ సామా జిక వర్గానికి  బాబు  అన్యాయం చేశారు. ఇదేరకమైన వైఖరిని తన రాజకీయ అవస రాల కోసం మున్ముందు చంద్రబాబు బిసి, కాపు వర్గాల పట్ల  ప్రదర్శించినా ఆశ్చర్య పోనక్కర్లేదు.  ఇందుకు తాజా ఉదాహరణ కూడా లేకపోలేదు. తెలంగాణ బిసి సీఎం అభ్యర్థిగా ఆర్‌.కృష్ణయ్యను చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రకటించారు. అక్కడ టిడిపి అధికారం చేపట్టే పరిస్థితి లేని కారణంగా ఆ అజెండాను తెరపైకి తీసుకొచ్చి పార్టీ ఉనికిని కాపాడుకున్నారు. రాజకీయ నేతగా ఎవరైనా చేసే పని కూడా ఇదే.  అయితే అవసరం కొద్దీ చంద్రబాబు ఏ  వర్గాన్ని దగ్గరకు తీసుకొంటారు, అలా దగ్గరకు తీసుకొన్న వర్గాన్ని ఎలా దూరం పెడతారు  అన్నది  చంద్రబాబు వైఖరికి నిదర్శనం ఆర్‌.కృష్ణయ్య పట్ల ప్రదర్శించిన వివక్షనే కారణంగా చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో  మెజార్టీ  సాధించిన పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యే వ్యక్తియే సీఎం అవుతాడు.  అంటే  తెలంగాణలో టిడిపి అధికారంలోకి రాలేదు.  కానీ  17 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీగా నిల బడిరది.  అంటే  తెలంగాణ  అసెంబ్లీలో టిడిపి పక్షనేతగా  సీఎం  అభ్యర్థిగా ప్రకటిం చిన ఆర్‌.కృష్ణయ్య  ఎన్నిక కావాలి. కానీ చంద్రబాబు ఎన్నికల అనంతరం చేసింది ఏమిటి? తెలంగాణ అసెంబ్లీలో టిడిపి పక్ష నేతగా ఎర్రబెల్లి దయాకర్‌రావును చేసింది. ఓసీ కులానికి చెందిన వ్యక్తిని ఆ పీఠంపై కూర్చొబెట్టింది. బిసి సీఎంగా ఆర్‌.కృష్ణయ్య ను ప్రకటించి ఎన్నికల అనంతరం ఆయన్ని టిడిపి పక్షనేత చేయకుండా పక్కనబెట్టారు. అంటే  మున్ముందు  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోనూ తన అవసరాల కోసం ఇప్పుడు దగ్గ రకు తీసిన బిసి,  కాపు సామాజికవర్గాలను భవిష్యత్తులో  దూరం చేసి ఇతర వర్గాలను దగ్గరకు తీసుకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇట్టే అర్థమవుతోంది. కావున  రాజ్యాధికారంలో భాగం కోసం  పోరాడే  ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ  వర్గాలను అధికారంలో భాగస్వామ్యం   అయిన ఇతర బడుగు వర్గాలు ద్వేషించుకోకుండా వారి పోరాటా లకు మద్దతు ఇవ్వాలి. లేకపోతే తన తోటి బడుగు, బలహీన వర్గాలకు జరిగిన అన్యా యమే మున్ముందు బిసి, కాపు వర్గాలకు జరగదన్న గ్యారంటీ లేదు.ఈ చర్యల ద్వారా చంద్రబాబు విభజించు పాలించు రాజకీయా లను బడుగు, బలహీనవర్గాలు అర్థం చేసు కొని తమ హక్కుల సాధన కోసం మరింత సంఘటితం కావాలి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *