కొత్త ప్రభుత్వం పాత సమస్యలు

సాధారణ ఎన్నికలు ముగిశాయి. దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గ సహచరులెవరుండాలో కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించింది. మీడియా ద్వారా ప్రధాని తాను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా పనిచేయాలనుకుంటున్నారో ప్రజలకు  వివరించారు. కాని ప్రధాని ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక, చేయదలచిన పనులపై చాలా మంది నిపుణులు విభిన్న విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు భయాలు బయటపెడుతున్నారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించవలసి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను రాజ్యాంగ నిబంధనల నేపధ్యంలో కూడా చూడవలసిన ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించడం సాధారణ ప్రజలకే కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధులందరి కర్తవ్యం కూడాను.

భారతరాజ్యాంగం 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించింది. 1950  జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.  రాజ్యాంగంలోని ప్రారంభంలో ఉన్న అవతారిక రాజ్యాంగం మొత్తానికి ప్రాతిపదిక వంటిది. అవతారికలో ఏమని పేర్కొనడం జరిగిందో ఒకసారి చూద్దాం.

geeturai_weekly_magazine_17

‘‘భారత  ప్రజలమైన  మేము భారత్‌ను సర్వసత్తాక,  సామ్యవాద, లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచా లని, దేశపౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పిం చాము.

సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం
ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ
హోదాలోను,  అవకాశాలలోను సమానత్వం
వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్ర తను కాపాడి సౌభ్రాత్రత్వాన్ని నెలకొల్పు తామని  కూడా   దీక్షా  బద్దులమై ఉన్నాము.’’
భారత రాజ్యాంగాన్ని  రచించిన పెద్దలు ఉన్నతోద్దేశ్యాలతో ఈ మాటలను అవతారి కలో పేర్కొన్నారు. కాబట్టి దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి పీఠంపై  ఎవరు కూర్చున్న ప్పటికీ  వారు  ఈ  ఉన్నతోద్దేశ్యాలకు కట్టుబడి పనిచేయవలసి ఉంటుంది. అందుకే ప్రమాణం చేయిస్తారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేశారు. యావత్తు ప్రపంచం దీన్ని వీక్షించింది.

ఇప్పుడు చూడవలసిన విషయమేమంటే ఎవరు ఎంతగా రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తారన్నది. ఎవరు ఏమన్నారన్నది గమనిస్తే ఎవరు ఎలా వ్యవహరిస్తారన్నన అంచనాలు తేలికవుతాయి. అన్నింటికన్నా ముందుగా  మనం  ఆలోచించవలసిన విషయం భారత పౌరలందరికీ సమానావ కాశాలు సమాన న్యాయం అన్న సూత్రానికి పూర్తిగా కట్టుబడి వ్యవహరిస్తున్నామా? అన్ని వర్గాల వారికి, అన్ని సముదాయాల వారికి సమానావకాశాలు,  సమానహక్కులు, సమాన న్యాయం లభిస్తుందా? అందరికీ సమాన న్యాయం,  సమానావకాశాలు కల్పించడానికి నిజాయితీతో ప్రయత్నాలు జరుగుతున్నాయా? సామాజికంగా గాని, ఆర్ధికంగాగాని,  రాజకీయంగాగాని సమానావకాశాలు దక్కుతున్నాయా?

ఈ ప్రశ్నలకు ప్రత్యేకంగా జవాబు చెప్పనవ సరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసినవే. దేశంలోని బడుగు బలహీనవర్గాల వారికి సమానావకాశాలు దక్కడం లేదని చెప్పే చాలా ఉదాహర ణలు మనముందు ఉన్నాయి. అంతేకాదు, దేశంలో ముస్లిముల పరిస్థితి దళితుల కన్నా దయానీయంగా ఉందని సచర్‌ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్లు చాటి చెప్పాయి. కాని ఇప్పుడు ఎవరేమంటున్నారన్నది కూడా చూడాలి. మైనారిటీ వ్యవహారాల మంత్రిణి గారు స్వయంగా నోరు విప్పి ‘‘సచర్‌ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయవలసిన అవసరం లేదన్నారు’’. ఈ మాటలు ప్రత్యేకంగా గమనించవలసినవి. అంతేకాదు, ‘‘ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని’’ స్పష్టంగా చెప్పిన మాటలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇక సమానావకాశాలు లభించేలా చేయడానికి ఎలాంటి ఆసక్తి చూపించడం జరగదని  తేలిపోయింది. అందరికీ సమానావకాశాలన్న మాట కేవలం కాగితా లపై తప్ప మరెక్కడైనా కనబడే సూచనలు న్నాయా? ఆవిడ గారి వ్యాఖ్య రాజ్యాంగ బద్దమైనదా  కాదా  అన్న మీమాంస అనవసరం. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదని వాదిస్తారు. కాని  అర్ధంకాని  విషయమేమంటే, మతంపేరుతో  రిజర్వేషన్లు  ఇవ్వాలని ముస్లిములు ఎప్పుడు కోరారు? వారెప్పుడు అలా కోరలేదు. వెనుకబాటు ఆధారంగా, సామాజికంగా కాని, ఆర్ధికంగా కాని వెనుక బాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు అడగడం జరుగుతోంది. సచర్‌ కమిటీ తదితర కమిటీలు  ఈ వెనుకబాటును నిరూపిం చాయి. ఒక సముదాయం పూర్తిగా వెనుక వడి ఉంటే వారికి రిజర్వేషన్లు వెనుకబాటు ప్రాతిపదికనే ఇస్తారే కాని వారి మతం ప్రాతి పదికన ఇస్తారా? ముస్లిములకు రిజర్వేషన్లు వెనుకబాటు ప్రాతిపదికన ఇవ్వమని అడుగుతుంటే  అవి  మతప్రాతిపదికన రిజర్వేషన్లు కాబట్టి ఇవ్వలేం అని చెప్పడం నిజాయితీ  రాహిత్యాన్ని సూచిస్తుంది. రాజ్యాంగం ప్రకారం సామాజికంగా, విద్యా పరంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పొందే సౌకర్యం ఉంది. ఈ వర్గాలు ఏదో ఒక మతానికి చెందిఉండడం అన్నది సహజం. కొందరికి రిజర్వేషన్లు కల్పించడంలో వారు ఫలానా మతం వారు కాబట్టి వారు వెనుకబడినా గాని వారికి రిజర్వేషన్లు  ఇస్తే  అది మతప్రాతిపదికన రిజర్వేషన్‌  అయిపోతుందని వాదించే దయితే అసలు ఏ వర్గానికయినా రిజర్వే షన్లు లభించే అవకాశం ఉంటుందా? ప్రతి వర్గం ఏదో ఒక మతానికి చెందినది కాకుండా ఉందా? ఈ పరిస్థితుల నేపథ్యం లో రాజ్యాంగం చెప్పిన సమానావకాశాలు లభించడం అన్నది సాధ్యమా?

దేశంలో యస్‌.సీ, యస్‌.టీ వర్గాలకు లభి స్తున్న రిజర్వేషన్లు వెనుకబాటు ప్రాతిపది కనే లభిస్తున్నాయా? గమనించవలసిన విషయమేమంటే, ఈ రిజర్వేషన్లు హిందు వులు కాని వారికి వర్తించవు. కేవలం హిందు  వులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లు ప్రారంభంలో కేవలం  పది సంవత్సరాల కాలానికి నిర్ణయించారు. తర్వాత పొడిగిస్తూ వస్తున్నారు.  రాజ్యాంగం  దృష్ట్యా ఈ రిజర్వేషన్లు పొడిగించడం సాధ్యం కాదని ప్రకటించే ధైర్యం ఈ మంత్రులకు ఎవరికీ లేదు. ఈ రిజర్వేషన్లను నిరంతరం పొడిగిం   చడం ఇప్పుడు ఒక సంప్రదాయమైంది. దీన్ని కాదనే రాజకీయ ధైర్యం ఎవరికీ లేదు. ఈ రిజర్వేషన్లు మతప్రాతిపదికనే కదా అమలవుతున్నాయి.  కాని దేశంలో అత్యంత వెనుకబడిన ముస్లిముల విషయానికి వచ్చే సరికి మతప్రాతిపదికన రిజర్వేషన్లు సాధ్యం కావని తేల్చి చెప్పే స్తారు. మరోవైపు ముస్లిముల వెనుకబాటు తొలగించాలంటూ బల్లగుద్ది ప్రసంగాలు చేస్తారు. ఇవి రాజకీయ నాటకాలు కాక మరేమిటి?

ఇది సమానావకాశాల గురించిన పరిస్థితి. ఇప్పుడు  మరో  సమస్య గురించి కూడా ఆలోచిద్దాం.  ఇది అధికరణ 370కి సంబంధించినది. కశ్మీరు భారతదేశంలో కలిసినప్పుడు ఆ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపింది కశ్మీరు మహారాజా. ఆయన భారతదేశంలో కశ్మీరు విలీనానికి కొన్ని షరతులు విధించాడు. ఆ షరతులు కశ్మీరు ప్రజల అభీష్టాలను దృష్టిలో పెట్టు కుని ఆయన చేశాడు. అప్పటి నాయకులు ఆ షరతులను ఒప్పుకున్నారు. అధికరణ 370 అలా ఉనికిలోకి వచ్చింది. ఆ షరతు లేమిటి? కశ్మీరుకు ఇచ్చిన మినహాయింపు లేమిటి? అన్న ప్రశ్నల గురించి ఆలోచిస్తే ఈ షరతులకు మతానికి ఎలాంటి సంబం ధమూ లేదని తెలుస్తుంది. ఈ అధికరణ ప్రకారం కశ్మీరేతరులెవ్వరు కశ్మీరులో భూమి కొనుగోలు చేయలేరన్న నిబంధననే చూద్దాం. ఎవరైనా కశ్మీరు మహిళ కశ్మీరేతర పురుషుని వివాహం చేసుకుంటే ఆమె ఆస్తిహక్కు కూడా కోల్పోతుంది. ఇందులో మతప్రసక్తి లేనేలేదు, ముస్లిములైనా, హిందువులైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. కశ్మీరేతరులెవరికీ అక్కడ భూమి కొను గోలు చేసే అవకాశం లేదు. ఈ షరతు విధించడానికి కారణం బహుశా కశ్మీరు ప్రజలకు అక్కడి వనరుల పూర్తి ప్రయోజ నాలు లభించేలా చూడడం కావచ్చు. ఇక్కడ గమనించలసిన విషయమేమంటే ఇలాంటి మినహాయింపులు ఒక్క కశ్మీరుకే కాదు  కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వడం  జరిగింది. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరం, త్రిపుర రాష్ట్రాలకు కూడా ఇలాంటి మినహాయింపులే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో  సాధారణ భారతీయులు ఎవ్వరు పర్మిట్‌ లేకుండా ప్రవేశించడం కూడా సాధ్యం కాదు.  అండమాన్‌ నికోబార్‌ విషయంలోను ఇదే పరిస్థితి ఉంది. అధి కరణ 371లో వీటి గురించి చదవవచ్చు.

ఇక్కడ సమస్య ఏమంటే, ఈ రాష్ట్రాలన్నిం టిని వదిలి కేవలం కశ్మీరు విషయంలో, కశ్మీరుకు సంబంధించిన అధికరణ పైనే ఎందుకు చర్చ జరుగుతోంది?  ఈ ప్రశ్న ఆలోచించవలసిన   ప్రశ్న.  భారత రాజ్యాంగం విభిన్న మతాల సమాహారం. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ విభిన్న పూల వనంలో అన్ని పూలు వికసించడానికి కావలసిన ఏర్పాట్లతో రాజ్యాంగాన్ని రచిం చారు. ఈ ఏర్పాట్లను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

ఉమ్మడి సివిల్‌ కోడ్‌  విషయంలోను ఇలాంటి  వాదనలు, చర్చలే వినిపిస్తు న్నాయి.   పర్సనల్‌ లా అనేది కేవలం ముస్లిములకు  మాత్రమే  ప్రత్యేకంగా ఉందా. భారతదేశంలో ఏ వర్గాలకు ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయో ఒక్కసారి పరిశీలించవలసిన అవసరం ఉంది.  అసలు  ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను కేవలం ముస్లిములు మాత్రమే వ్యతిరే కిస్తున్నారని భావంచడమూ పొరబాటే. కాని ఈ అంశాలపై చర్చల్లో ఇదంతా ముస్లి ముల వ్యవహారంగా, ముస్లిములు వ్యతి రేకిస్తున్న వ్యవహారంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ఫలితంగా ముస్లిముల పట్ల   సమాజంలో  వ్యతిరేకతలను రెచ్చగొడుతున్నారు.

గుజరాత్‌  అల్లర్ల  తర్వాత ప్రముఖ రచయిత, జర్నలిస్టు  కుష్వంత్‌ సింగ్‌ ‘‘ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా’’ పేరుతో రాసిన పుస్తకంలో  ఆయన చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఉంది.  గుజరాత్‌ ఘోరకలిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘‘ముస్లిమ్‌, క్రయిస్తవ, సిఖ్ఖు సోదరుల వైపు  లేస్తున్న త్రిశూలాలను అడ్డుకోనట్లయితే అవి భారత పతాకంపై ఉన్న  మూడు   రంగులను నాశనం చేస్తాయి.  చివరకు  చక్రం మాత్రమే మిగులుతుంది.’’ ఈ  మాటలు చెప్పింది దేశంలో అనేక పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన కుష్వంత్‌ సింగ్‌.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చోటు చేసుకున్న మతపరమైన ఉద్రిక్త తలు, కొన్ని చోట్ల జరిగిన అల్లర్లు, పూణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ముప్‌ాసిన్‌ షేక్‌ దారుణ హత్య… ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి?

కొత్త ప్రభుత్వం ఈ సమస్యల విషయంలో ఏం చేయాలనుకుంటోంది? సమస్యలను మరింత పీటముడిగా మారుస్తుందా? లేక పరిష్కారాలు కనిపెడుతుందా?   కాలమే ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *