కొత్త రాష్ట్రాలలో ముస్లింల స్థానం ఎక్కడ ..?

సంకల్పం, ఆచరణాత్మక విధానాలు
కొత్త రాష్ట్రాలలో ముస్లింల అభివృద్ధి వీటితోనే సాధ్యం
బహుముఖ చర్యలపై కొత్త ప్రభుత్వాలు దృష్టి సారించాలి

ప్రస్తుత  పరిస్థితుల్లో  ముస్లిం అభివృద్ధి అజెండాపై  చర్చ  సాగాల్సిన అవసర  ముంది.  గత  గుణపాఠాల నుంచైనా ముస్లిం సమాజం వాస్తవాన్ని తెలుసుకొని మసలుకోవాలి. జూన్‌ రెండో తేదీతో ఆంధ్ర  ప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ సర్కారు కొలువుతీరగా,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈనెల 8 నుంచి టీడీపీ సర్కార్‌ ఏర్పాటు అయింది.  అంటే రెండు రాష్ట్రాలలోని బడుగు, బలహీన వర్గాల తలరాతలు మారాలంటే ఆయా రాష్ట్రాలలోని ప్రభు త్వాల విధానపర నిర్ణయాలు కీలకం. మరీ ముఖ్యంగా  దేశ  స్వాతంత్య్రానంతరం భారతదేశంలో  అటు  కేంద్ర సర్కార్‌ ఏలుబడిలో ఇటు ఆంధ్రప్రదేశ్‌ పాలకుల పాలనలో ముస్లింల జీవన స్థితిగతులు దిగ జారాయే  తప్ప  మెరుగుపడని స్థితి. ఇందుకు  కారణం ముస్లింల అభివృద్ధి విషయంలో పాలకుల విధానాలు ఆచ రణాత్మకంగా ఉండకపోవడమే. పథకాల రూపకల్పన మొదలు ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి సంబంధించిన పలు అంశాలలో  వివక్షపూరిత   ధోరణి              ఉండటమేనని   గుర్తించాలి. తెలుగు మాట్లాడే వారికి ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఏర్పడిన  నేపథ్యంలో  తమ  బంగారు భవిష్యత్తుకోసం రాష్ట్రాల వారీగా ముస్లింల ఆలోచనా విధానం  మారాలి.  ఈ  వర్గాల అభివృద్ధికి పాలకుల చర్యలు కూడా అదే కోణంలోసాగాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యరాష్ట్రంలో  పొందుతూ వచ్చిన ప్రయోజనాల  కోసం పోరాడుతూనే ఇరు రాష్ట్రాలలోని  సర్కార్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ముస్లిం సమాజం ఒత్తిడి తెచ్చే శక్తిగా ఎదగాలి. పాలకుల ప్రతి చర్యపై నిశితమైన దృష్టి సారించాలి. తమ వర్గ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే పథకాలు మొదలు తీసుకో బోయే విధానపరమైన నిర్ణయాల వరకు ప్రతిదానిపై సూక్ష్మదృష్టి పరిశీలన ఉండాలి.geeturai_weekly_9

సమైక్య రాష్ట్ర ప్రయోజనాల కొనసాగింపునకు పోరాటం
సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముస్లింల భవిష్యత్తు  ఉజ్వలంగా  ఉండేది అని చెప్పడం ఉద్దేశం  కాకపోయినా రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని ప్రయోజనాలు చేజారే ప్రమాదముంది. వీటిలో ముఖ్య మైంది వెనుకబడిన  పేద ముస్లింలకు అమలవుతున్న  నాలుగు శాతం రిజర్వే షన్లు. తెలంగాణలో కొలువుదీరిన టిఆర్‌ ఎస్‌  సర్కార్‌  ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యా, ఉపాధిలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించింది. ఇక ఆంధ్రా ప్రాంత ముస్లింల రిజర్వేషన్లకు టిడిపి సర్కార్‌ ఎలాంటి అభయం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ముస్లింలు తమకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా ఒత్తిడి పెంచాలి. తెలం గాణ సర్కార్‌పై పన్నెండు శాతం రిజర్వేషన్లు త్వరగా  ఇచ్చేలా  ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశ సమయం ఆసన్నమవుతుంది. ఈ రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా వందలాది పేద ముస్లిం విద్యార్థులు నష్ట పోవాల్సి వస్తుంది. తెలంగాణలో 12 శాతం  రిజర్వేషన్ల అమలుకు తక్షణం కేసీఆర్‌ సర్కార్‌పై ముస్లింలు ఒత్తిడి పెంచాలి. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మహమూద్‌ అలీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఆ దిశగా ఆయనపై సైతం ముస్లిం సంఘాలు ఒత్తిడి తేవాలి. ఇక సీమాంధ్ర ప్రాంత ముస్లింలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిజెపితో జతకట్టిన టిడిపి ప్రభుత్వం పూర్తిగా కాషాయ విధానాలు అవలంభించే పోకడలకు పోతోంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీ తరఫున చట్టసభ లలో  ముస్లింల  ప్రాతినిధ్యం లేకుండా చేసిన టిడిపి నాయకత్వం ఈ వర్గాల వారి ప్రయోజనాల   కోసం  చేపట్టే చర్యలపై కూడా  స్పష్టత   ఇవ్వడం  లేదు. ఈ నేపథ్యంలో సమైక్యరాష్ట్రంలో ఉన్న కాస్తా కూస్తో ప్రయోజనాలను తిరిగి పొందేం దుకు చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాలి. ఆ దిశగా ముస్లిం సమాజంతో పాటు టిడిపిలో ఉన్న మైనార్టీ నేతలు ఆ దిశగా చొరవ చూపాలి.

అన్ని ప్రభుత్వ విభాగాలు సాధించుకోవాలి…?
రాష్ట్ర  విభజన  నేపథ్యంలో ముస్లిం మైనార్టీల కోసం ఉద్దేశించిన అన్ని ప్రభుత్వ శాఖలను విభజన చేపట్టారు. ఈ నేప థ్యంలో ఒకే గొడుగు కింద పాలన పేరుతో ముస్లిం మైనార్టీలకు చెందిన కొన్ని శాఖలు ఒకే శాఖగా లేక ఇంకో శాఖలో విలీనం చేసే ప్రమాదం  కూడా లేకపోలేదు. కాబట్టి ఉర్దూ భాష  మాట్లాడేవారు తెలంగాణతో పాటు సీమాంధ్ర   ప్రాంతంలో  కూడా              ఉన్నందున ఉర్దూ అకాడమీలు ఇరు రాష్ట్రాల్లో  ఏర్పాటయ్యేలా  ఆయా సర్కార్లపై ఒత్తిడి పెంచాలి.  రెండు వక్ఫ్‌బోర్డులు, హజ్‌కమిటీలు, మైనార్టీ కార్పొరేషన్‌, మైనార్టీ కమిషనరేట్‌, మైనార్టీ కమిషన్‌, వక్ఫ్‌ సర్వే సంస్థలు ఇలా అన్ని శాఖలు రెండు రాష్ట్రాలలో ఏర్పడాలి. ఆ దిశగా ముస్లిం సమాజం అప్రమత్తంగా ఉండాలి.

పథకాల స్వరూపంలో దృష్టి సారించాలి
పాలకుల పథకాల రూపకల్పనపై ముస్లిం సమాజం ప్రధానంగా దృష్టి సారించాలి. గత  పాలకులు  టిడిపి అయినా సరే కాంగ్రెస్‌ అయినా సరే అన్ని మోసకారి విధానాలు అవలంభించాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం పరిశీలించినా కొత్త రాష్ట్రాలలోని  సర్కార్లు జిమ్మిక్కులు పసిగట్టవచ్చు.  ఏ పథకమైనా సరే వాటి స్వరూపం,  అది  ఏ  వృత్తుల వారికి ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది, ఆ పథకం నియమ నిబంధనలు ఏమిటి అన్నది మనం పరిశీలించి ముందుకు సాగాలి.   లేకపోతే  చక్కర వ్యాధి ఉన్న రోగిష్టికి మిఠాయి పంచినట్లుగా పథకాలు ఉంటాయి. 2004కు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను   పాలించిన  టిడిపి ప్రభుత్వం  ముస్లింలతోపాటు  ఇతర మైనార్టీ  వర్గాల  కోసం దుకాన్‌` మకాన్‌ పథకం తీసుకొచ్చింది. ఇళ్ళు కట్టి ఇవ్వడం తోపాటు ఆ ఇంటిలోనే వ్యాపార సము దాయాన్ని నిర్మించి ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడటం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ  పథకం  చూసిన వారెవ్వరైనా సరే పాలకుల  మేథస్సుకు నీరాజనం పలుకు తారు. కానీ ఈ పథకంలోని నియమ నిబంధనలు చూస్తే మాత్రం పాలకుల అసలు లోగుట్టు తెలుస్తుంది. ఈ పథకం కింద పేర్కొన్న   నిబంధనలలో  లబ్ది దారుడు సొంత స్థలం కలిగి వుండాలి అన్న నిబంధన కీలకమైంది. పైగా ఆ స్థలం అన్నది జనసముదాయం ఉన్న ప్రాంతాల్లో ఉండాలని స్పష్టంగా పేర్కొనబడిరది. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లోని ముస్లింలకు ఉద్దేశించింది.   నిజానికి  ఈ పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న ముస్లింల శాతం, అది కూడా జన సమూహం ఉన్న చోట చూస్తే కేవలం ఒకటి నుంచి రెండు శాతంలోపే ఉన్నారు. అంటే ఇలా పట్టణ ప్రాంతాల్లో జన సముదాయంలో ఇంటి స్థలం ఉన్నవారు కాస్త ఆర్థికంగా స్థోమత కలిగి ఉన్నట్లు. అంటే దుకాన్‌` మకాన్‌ పథకం సొంత స్థలం ఉన్న స్థితిమంతులకు ఉపయోగపడదు. ఇక పేద ముస్లింలకు పట్టణ ప్రాంతాల్లో స్థలం అన్నది గగనమే. అంటే పేదవాడికి ఈ పథకం దరిచేరదు. పథకం ఇచ్చినట్టే ఉండాలి  గాని వారికి లబ్ది   చేకూరకూడదు  అన్న చందాన దుకాన్‌`  మకాన్‌ పథకం ఉందని మనం పసిగట్టవచ్చు. ఇది ఒక్క టిడిపి ప్రభుత్వం వివక్షగా ఎత్తిచూపలేము. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పేద ముస్లింలతోపాటు ఎస్సి, ఎస్టి, బిసి, వర్గాల ఆర్థిక సహాయం పథకాలను రూపకల్పన చేశారు. వైఎస్‌ ప్రభుత్వం రాకముందు మైనార్టీ, ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు ఆయా కార్పొరేషన్లు ఆర్థిక సహాయం పథకాలకు గ్రాంట్‌గా కొంతమొత్తం ఇచ్చి మిగతాది బ్యాంకుల నుంచి ఇప్పించేది. పథకం స్థాయిని బట్టి గ్రాంట్‌గా ఇచ్చే మొత్తం విలువను పెంచి కార్పొరేషన్లు లబ్దిదారులకు ఊరట ఇచ్చేది. కానీ వైఎస్‌ ప్రభుత్వం ఈ గ్రాంట్‌గా ఇచ్చే మొత్తాన్ని రద్దు చేసి పథకంలో యాభై శాతం సబ్సిడీగా ఇచ్చేలా జీవో జారీచేసింది. ఇలా కార్పొరేషన్‌ నుంచి ఇచ్చే గ్రాంట్‌ను రద్దు చేసింది. పథకంలో యాభై శాతం సబ్సిడీ అంటే మేలే కదా అన్న భావన ఎవరిలోనైనా కలగవచ్చు. కానీ పథకం నియమ నిబంధనలలో పెట్టిన అంశాలు షాక్‌కు గురిచేశాయి. పథకంలో యాభై శాతంగా సబ్సిడీ అని పేర్కొన్నా పథకం విలువ రూ.5లక్షలు ఉంటే రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద లబ్దిదారుడికి ఉచితంగా ఇస్తుంది అనుకొంటే పొరపాటే. పథకం విలువ ఎంత ఎక్కువగా ఉన్నా ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా సబ్సిడీ మాత్రం రూ.30 వేలకు మించి ఇవ్వకూడదన్న నిబంధనను వైఎస్‌ సర్కార్‌ చేర్చింది. అంటే లబ్దిదారుడికి గతంలో అధికంగా వచ్చే గ్రాంటు పోయి తక్కువ మొత్తంలో సబ్సిడీ అందుతుంది. అంటే పెద్ద మొత్తం కోసం లబ్దిదారుడు పూర్తిగా బ్యాంకులపై ఆధారపడాల్సిందే. ముస్లింలకు ఆర్థిక సహాయం అందించకూడదని బ్యాంకర్లు ముస్లిం నివాసిత ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా అనధికారికంగా ప్రకటించాయి. అంటే ముస్లింలకు వైఎస్‌ సర్కార్‌ ఏమాత్రం ప్రయోజనకర పథకాలను ప్రవేశపెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మోసపూరిత పథకాలు తేవడం బడుగు, బలహీన వర్గాలను మోసం చేయడం కొత్తకాదు. కానీ ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ వర్గాలన్నీ తమ కోసం రూపొందిస్తున్న పథక స్వరూపాలపై, వాటి నియమ నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా పథకం ఎలా ఉపయోగకరం
ముస్లిం  సమాజం  పట్ల  పథకాల  రూప కల్పనపై మరో వివక్ష కొనసాగుతోంది. బిసిలలోని వివిధ కులాలు  తమ  తమ వృత్తులను వీడి బయటకు రారో అలాంటి పరిస్థితే కులపరంగా కాకపోయినా జీవనో పాధి కోసం వృత్తులలో ఇమిడి పోయిన ముస్లింలు వాటి నుంచి బయటపడలేక  పోతున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం   లోనూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో  వివిధ వృత్తులలో ముస్లింలు            ఉన్నారు.   ఒక్కో  జిల్లాలో ఒక్కో వృత్తిలో ముస్లింలు కొనసాగుతున్నారు. ఈ పరిస్థి తుల్లో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలందరికీ ఒకే తరహా  పథకాలు  రూపొందిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కావున వివిధ జిల్లా లలో  ముస్లింలు చేపడుతున్న వృత్తుల ఆధారంగా  ఆయా జిల్లా పరిధుల్లో ఒక్కో పథకాన్ని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు రూపొందించాయి. చదువుకున్న ముస్లిం యువత ఉపాధి కోసం  ప్రత్యేక  పథకాల రూపకల్పన సాగాలి. ఈ రకమైన స్వరూపంతో పథకాల రూపకల్పన సాగకపోతే ముస్లింల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారవుతుంది. ముస్లిం సమాజం, మేథా వులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని కొత్త ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో చమ్‌కి వివిధ అల్లికల వృత్తులు కొనసాగు తున్నాయి. ఈ పాతబస్తీలోని వృత్తులను ప్రోత్సహించి,   వారి  ఉత్పత్తులకు స్వయంగా మార్కెట్‌  చేసుకుని అధిక లాభాలు పొందేలా తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి. పాతబస్తీ ముస్లిం యువత, మహిళలు ఎంతో నైపుణ్యం ఉన్న అల్లికలను చేసినా వారికి దొరుకుతున్న కూలీ మాత్రం నామ మాత్రం. ఎందుకంటే ఆ అల్లికల ఉత్పత్తు లకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామాగ్రి సమకూర్చి కొన్ని బడా సంస్థలు లాభపడు తున్నాయి.  వీరి  వృత్తి అభివృద్ధితోపాటు మార్కెట్‌ సౌకర్యం కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తే వారి ఆర్థిక జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఇలా రెండు రాష్ట్రాలలో వివిధ జిల్లాలలోఉన్న వృత్తులను గుర్తించి వాటి అభివృద్ధి,  మార్కెట్‌ సౌకర్యం పెంపొందేలా   పథకాల  రూపకల్పన జరగాలి.

ముస్లింల సబ్‌ప్లాన్‌పై దృష్టి పెట్టాలి?
ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టబద్ధత సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏవిధంగా తీసుకొచ్చిందో అదే తరహాలో సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత ముస్లింలకు రెండు రాష్ట్ర ప్రభు త్వాలు చేపట్టాలి. ఇది ముస్లిం సమాజానికి ఎంతో అవసరం కూడా. వివిధ శాఖల కింద కేటాయించిన బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌ కింద  పేర్కొనబడిన  వర్గాలకు వారి జనాభా దామాష ప్రకారం వారి ప్రయోజ నాల  కోసం  ఖర్చుపెట్టడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఉదాహరణకు రహ దారుల శాఖకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే ముస్లిం సబ్‌ప్లాన్‌ అమలైతే ముస్లిం జనాభా పన్నెండు శాతం ఉంటే ఈ వర్గాల  వారి  కోసం వెయ్యి కోట్లలో పన్నెండు శాతం నిధులను ఖర్చుచేయాలి. అంటే రోడ్డు రవాణ శాఖ కింద ఈ కేటా యింపులు  చేస్తే  ముస్లిం నివాసిత ప్రాంతాల్లో రోడ్ల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ శాఖ కింద కేటాయించిన నిధులకు ముస్లిం జనాభా దామాష ప్రకారం ఆ శాఖ ముస్లిం నివా సిత ప్రాంతాల్లో తాను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముస్లిం సబ్‌ప్లాన్‌ అమలు చేయడం ద్వారా ముస్లింల మురికివాడలు సమసిపోయి ఆ ప్రాంతాల్లో రోడ్లు, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్‌ ఇతరమౌలిక సదుపాయాలు ఆయా శాఖల ఖర్చు చేయడం ద్వారా సమకూరుతాయి. కావున కొత్త సర్కార్లపై ఈ డిమాండ్ల సాధన కోసం ముస్లిం సమాజం ఉద్యమించాలి.

బహుముఖ చర్యలు ప్రారంభం కావాలి
ముస్లిం సమాజం అభ్యున్నతి కోసం తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు బహుముఖ  చర్యలు చేపట్టాలి. ఇందు కోసం  సచార్‌  కమిటీ, రంగనాథ్‌మిశ్రా కమిషన్‌ నివేదికలు అమలుపర్చాలి. తెలం గాణతోపాటు సీమాంధ్రలోనూ ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ తదితర ప్రాంతాల్లో మెజార్టీగా ముస్లింలు ఉన్నారు. కావున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ముస్లింల బహు ముఖాభివృద్ధి బాధ్యత అక్కడి రెండు సర్కార్‌లపై ఉంది. తెలం గాణ రాష్ట్రంలో శాసనమండలిలో మరో పదినెలలలోపు 12 నుంచి 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని  శాసనమండలిలోనూ  ఖాళీలు అయ్యే అవకాశముంది. కావున శాసన మండలిలో ప్రాతినిధ్యం కోసం ముస్లిం సమాజం గళమెత్తాలి. త్వరలో జరిగే నామి నేటెడ్‌ పదవుల కోసం సైతం ఉద్యమిం చాలి. ఆ దిశగా ముస్లింలకు జనాభా ప్రాతి పదికన ప్రాతినిధ్యం కోసం రెండు రాష్ట్రాల లోని అధికార పార్టీలు కృషి చేయాలి.

పాధి కోసం వృత్తులలో ఇమిడి పోయిన ముస్లింలు వాటి నుంచి బయటపడలేక  పోతున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం   లోనూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో  వివిధ వృత్తులలో ముస్లింలు            ఉన్నారు.   ఒక్కో  జిల్లాలో ఒక్కో వృత్తిలో ముస్లింలు కొనసాగుతున్నారు. ఈ పరిస్థి తుల్లో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలందరికీ ఒకే తరహా  పథకాలు  రూపొందిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కావున వివిధ జిల్లా లలో  ముస్లింలు చేపడుతున్న వృత్తుల ఆధారంగా  ఆయా జిల్లా పరిధుల్లో ఒక్కో పథకాన్ని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు రూపొందించాయి. చదువుకున్న ముస్లిం యువత ఉపాధి కోసం  ప్రత్యేక  పథకాల రూపకల్పన సాగాలి. ఈ రకమైన స్వరూపంతో పథకాల రూపకల్పన సాగకపోతే ముస్లింల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారవుతుంది. ముస్లిం సమాజం, మేథా వులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని కొత్త ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో చమ్‌కి వివిధ అల్లికల వృత్తులు కొనసాగు తున్నాయి. ఈ పాతబస్తీలోని వృత్తులను ప్రోత్సహించి,   వారి  ఉత్పత్తులకు స్వయంగా మార్కెట్‌  చేసుకుని అధిక లాభాలు పొందేలా తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి. పాతబస్తీ ముస్లిం యువత, మహిళలు ఎంతో నైపుణ్యం ఉన్న అల్లికలను చేసినా వారికి దొరుకుతున్న కూలీ మాత్రం నామ మాత్రం. ఎందుకంటే ఆ అల్లికల ఉత్పత్తు లకు కావాల్సిన వస్త్రాలు, ఇతర సామాగ్రి సమకూర్చి కొన్ని బడా సంస్థలు లాభపడు తున్నాయి.  వీరి  వృత్తి అభివృద్ధితోపాటు మార్కెట్‌ సౌకర్యం కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తే వారి ఆర్థిక జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఇలా రెండు రాష్ట్రాలలో వివిధ జిల్లాలలోఉన్న వృత్తులను గుర్తించి వాటి అభివృద్ధి,  మార్కెట్‌ సౌకర్యం పెంపొందేలా   పథకాల  రూపకల్పన జరగాలి.

ముస్లింల సబ్‌ప్లాన్‌పై దృష్టి పెట్టాలి?
ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టబద్ధత సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏవిధంగా తీసుకొచ్చిందో అదే తరహాలో సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత ముస్లింలకు రెండు రాష్ట్ర ప్రభు త్వాలు చేపట్టాలి. ఇది ముస్లిం సమాజానికి ఎంతో అవసరం కూడా. వివిధ శాఖల కింద కేటాయించిన బడ్జెట్‌లో సబ్‌ప్లాన్‌ కింద  పేర్కొనబడిన  వర్గాలకు వారి జనాభా దామాష ప్రకారం వారి ప్రయోజ నాల  కోసం  ఖర్చుపెట్టడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఉదాహరణకు రహ దారుల శాఖకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే ముస్లిం సబ్‌ప్లాన్‌ అమలైతే ముస్లిం జనాభా పన్నెండు శాతం ఉంటే ఈ వర్గాల  వారి  కోసం వెయ్యి కోట్లలో పన్నెండు శాతం నిధులను ఖర్చుచేయాలి. అంటే రోడ్డు రవాణ శాఖ కింద ఈ కేటా యింపులు  చేస్తే  ముస్లిం నివాసిత ప్రాంతాల్లో రోడ్ల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ శాఖ కింద కేటాయించిన నిధులకు ముస్లిం జనాభా దామాష ప్రకారం ఆ శాఖ ముస్లిం నివా సిత ప్రాంతాల్లో తాను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముస్లిం సబ్‌ప్లాన్‌ అమలు చేయడం ద్వారా ముస్లింల మురికివాడలు సమసిపోయి ఆ ప్రాంతాల్లో రోడ్లు, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్‌ ఇతరమౌలిక సదుపాయాలు ఆయా శాఖల ఖర్చు చేయడం ద్వారా సమకూరుతాయి. కావున కొత్త సర్కార్లపై ఈ డిమాండ్ల సాధన కోసం ముస్లిం సమాజం ఉద్యమించాలి.
బహుముఖ చర్యలు ప్రారంభం కావాలి

ముస్లిం సమాజం అభ్యున్నతి కోసం తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు బహుముఖ  చర్యలు చేపట్టాలి. ఇందు కోసం  సచార్‌  కమిటీ, రంగనాథ్‌మిశ్రా కమిషన్‌ నివేదికలు అమలుపర్చాలి. తెలం గాణతోపాటు సీమాంధ్రలోనూ ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ తదితర ప్రాంతాల్లో మెజార్టీగా ముస్లింలు ఉన్నారు. కావున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ముస్లింల బహు ముఖాభివృద్ధి బాధ్యత అక్కడి రెండు సర్కార్‌లపై ఉంది. తెలం గాణ రాష్ట్రంలో శాసనమండలిలో మరో పదినెలలలోపు 12 నుంచి 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని  శాసనమండలిలోనూ  ఖాళీలు అయ్యే అవకాశముంది. కావున శాసన మండలిలో ప్రాతినిధ్యం కోసం ముస్లిం సమాజం గళమెత్తాలి. త్వరలో జరిగే నామి నేటెడ్‌ పదవుల కోసం సైతం ఉద్యమిం చాలి. ఆ దిశగా ముస్లింలకు జనాభా ప్రాతి పదికన ప్రాతినిధ్యం కోసం రెండు రాష్ట్రాల లోని అధికార పార్టీలు కృషి చేయాలి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *