క్లీన్ చిట్ సంబరాలు

Cover story picCover story pic-p18drpe0di1luj1i91oo3b5u1md0గుజరాత్‌ ముఖ్యమంత్రికి క్లీన్‌ చిట్‌ ఇచ్చే శారు.  యస్‌.ఐ.టి.  (సిట్‌) విచారణలో ఆయనకు ఏ పాపం తెలియదని తేల్చే శారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజేపి తర ఫున ప్రధానమంత్రి  పదవికి  పోటీపడు తున్న అభ్యర్థి నరేంద్రమోడీకి గుజరాత్‌ అల్లర్ల  విషయంలో  క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన అర్జీని తిరస్కరిస్తూ ఆమె  ఉన్నత న్యాయ స్థానానికి  వెళ్ళవచ్చని  కోర్టు పేర్కొంది. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఈ తీర్పును న్యాయస్థానంలో   ప్రకటించారు.  ఘోర కలిగా పేరుపడిన గుజరాత్‌ అల్లర్లను దేశం ఎన్నటికీ మరిచిపోలేదు.  ఆ  ఘోరకలిలో గుజరాత్‌ ముఖ్యమంత్రి  నరేంద్రమోడీ వ్యవహారశైలి విషయమై అనేక విమర్శలు వచ్చాయి. ఈ అల్లర్లకు సంబంధించి గుజ రాత్‌ ముఖ్యమంత్రిపై కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో  అని  అనేకమంది ఎదురు చూశారు.  స్వయంగా నరేంద్రమోడీ కూడా ఆ రోజు  కోర్టు  ఏం చెబుతుందా అని ఎదురు చూసినట్లు వార్తలను బట్టి తెలు స్తోంది. ఆ తీర్పు వచ్చిన తర్వాతనే ఆయన గోవా బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ తీర్పు ఒక మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఇచ్చిన తీర్పు. దీని తర్వాత పై న్యాయ స్థానానికి వెళ్ళే  హక్కు  జకియా జాఫ్రీకి               ఉంది.  ఈ విషయాన్ని స్వయంగా మేజి స్ట్రేటు  కూడా సెలవిచ్చారు.  ఈ తీర్పు తర్వాత జకియా జాఫ్రీ పై కోర్టుకు వెళ తారా లేదా  అన్నది ఆమె ఇష్టం.  న్యాయ పోరాటాన్ని  అలుపెరుగకుండా కొనసాగి స్తున్న ఆమె పై కోర్టుకు వెళతారనే చాలా మంది భావిస్తున్నారు. ఆమె ఆ విషయాన్ని ప్రకటించారు కూడా. మేము ప్రభుత్వంతో పోరాడుతున్నాము. నేను ఇంకా ఆశకోల్పో లేదు.  ఈ  కేసును హైకోర్టులో సవాలు చేస్తానని ఆమె అన్నారు.

జకియా జాఫ్రి ఇంకా ఆశవదలలేదు. ఆమె పోరాటాన్ని మానలేదు. మానకూడదు కూడా.  కాని  కోర్టు ఇచ్చిన తీర్పు ఆమెను నిరాశకు గురి చేసినట్లే కనబడిరది. ఆమె ఈ తీర్పును ఊహించలేదనిపించింది. అందుకే ఆమె తీర్పు వినగానే కంట నీరు పెట్టారు. ఆమె ఎవరికి వ్యతిరేకంగా అర్జీ పెట్టారో వారికి  తీర్పు ఈ  విధంగా వస్తుం దని ముందే తెలుసా? ఏమో చెప్పలేము. కాని  తీర్పు వచ్చిన  వెంటనే  క్షణాల్లో ట్విట్టర్‌పై  అసంఖ్యాక ట్వీట్లతో సంబ రాలు జరుపుకోవడాన్ని మనమంతా చూశాము. ‘‘సత్యమేవజయతే’’ అంటూ నరేంద్రమోడీ స్వయంగా అన్నారు. ఈ మాట  చెప్పి  ఆయన గోవా బయలు దేరాడు.

ఈ తీర్పు  రాగానే  సత్యం గెలిచిందని బిజేపి  నాయకులనేక మంది ప్రకటిం చారు. పార్టీ  అధ్యక్షుడు  రాజనాథ్‌ సింగ్‌ అయితే ఇది సత్యం గెలిచిందని చెప్పాడు. అరుణ్‌ జైట్లీ మరింత సంబరంగా సత్యా నికి సాక్ష్యాధారాలు ఎల్లప్పుడు ఒక్కటిగా ఉంటాయని, అసత్యం ఆధారాలు చెల్లా చెదరవుతాయని అన్నాడు. కాని అరుణ్‌ జైట్లీ గతాన్ని మరిచిపోయినట్లు ఉన్నారు. గతంలో బిజేపి నాయకులు చెప్పిన మాట లను  కూడా  మరిచిపోయినట్లున్నారు. స్వయంగా  గుజరాత్‌ ఘోరకలి విషయం లోనే మాజీ  ప్రధాని వాజపేయి మొదలు ఇప్పటి వరకు అనేకమంది నాయకులు ఏమన్నారో  ఒకసారి  పరిశీలించుకోవడం మంచిది. చెప్పిన  మాటలను  తర్వాత మార్చిన సందర్భాలు కూడా  ఉన్నాయి. బహిరంగంగా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి.  స్వయంగా  వాజపేయి రాజ ధర్మాన్ని మోడీకి  బోధించిన  విషయాన్ని మనం ఎలా మరిచిపోతాం. అలాగే వివిధ సమావేశాల్లో ఏం  జరిగిందో  అనేకమంది అధికారులు బట్టబయలు చేశారు. అనేక మంది  అధికారులు  ఆరోపణలు గుప్పిం చారు.

గుజరాత్‌  ఘోరకలికి  సంబంధించి ఈ వ్యవహారాలన్ని ఏదో ఒక రూపంలో కోర్టు ముందుకు  వచ్చాయి.  ఇప్పుడు ఈ తీర్పును కూడా పై న్యాయస్ధానంలో త్వర లోనే సవాలు చేయవచ్చును. కాని రాష్ట్రం లో 2002 ఫిబ్రవరి 27 నుంచి నేటి వరకు జరిగినదంతా  ఏదో  యాధృచ్ఛికంగా జరిగిందని కొట్టి వేయలేము. అలాగే చర్య ప్రతిచర్య  లాంటి సిద్దాంతాలతో సమర్ధిం చనూ లేము.  దోషులను  కాపాడ్డానికి అనేక సందర్భాల్లో  జరిగిన ప్రయత్నాల జాబితా చాలా పెద్దదే ఉంది.  వాటన్నిం టిని పరిశీలించినా  గుజరాత్‌ ఘోరకలికి సంబంధించి  ఆలోచించవలసిన  అనేక విషయాలు మన  ముందుకు  వస్తాయి. రాజకీయ ఎత్తుగడలు,  న్యాయపరమైన లోతుపాతులు, న్యాయప్రక్రియలో ఎదు రయ్యే సవాళ్ళు, సుదీర్ఘకాలం కొనసాగు తున్న విచారణల వల్ల  దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నది వాస్తవమే. కాని చట్టం చేతుల్లో ఇరుక్కుంటామన్న భయం వారిని కూడా వెంటాడుతోంది. కోర్టు తీర్పు కోసం ఎదురుచూసి,  సత్యమేవజయతే అంటూ సంబరాలు జరుపుకోవడం చూస్తే ఈ వాస్తవం అర్ధం అవుతుంది. మరో ముఖ్యమైన విషయమేమంటే, కోర్టు తీర్పు ఇచ్చిన  వెంటనే  క్లీన్‌చిట్‌ వచ్చేసిందని ప్రచారం చేసుకోవడం దేన్ని సూచిస్తోంది. పై కోర్టులు ఉన్నాయి కదా. అయినా క్లీన్‌ చిట్‌  వచ్చిందని  ఇంత  త్వరితంగా ప్రచారం చేసుకోవలసిన అవసరం ఏమొ చ్చింది? రానున్న ఎన్నికల్లో మోడీకి గుజ రాత్‌ ఘోరకలి గుదిబండగా మారకుండా తీసుకోవలసిన  జాగ్రత్తల్లో  భాగంగానే ఇదంతా  జరుగుతోందని   అర్థం  చేసుకో వచ్చును.

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *