గతమెంతో ఘనకీర్తి – స్పెయిన్

యూరొపియన్‌ దేశాల్లో స్పెయిన్‌ ఒకటి. నేడు దానికి ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కనీసం ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌ దేశాల్లాంటి గుర్తింపు కూడా దానికి లేదు. యూరప్‌లోని ఇతర అనేక చిన్నాచితక దేశాల్లాగే అదో దేశం. కాని దాని గత చరిత్ర ఎంతో ఘనమైనది. విశిష్టత కలిగింది. క్రీ.శ. 9,10 శతాబ్దంలో అది యూరొప్‌ అంతటిలో ప్రఖ్యాతి గాంచింది. తలమానికంగా నిలిచింది. సభ్యతా సంస్కృతు ల్లోనైతేనేమి, కట్టడాల్లో శిల్పకళా ఖండాల్లోనైతేనేమి, విద్యా విజ్ఞానాల రీత్యా చూసిన, సుస్థిరత సుపరి పాలనరీత్యా చూసినా, అప్పుడది తనకు తానే సాటిగా నిలిచింది.

క్రీ.శ. 9వశతాబ్దంలో స్పెయిన్‌లో అరబ్బుల ప్రభుత్వం ఏర్పడిరది.  ఈ  అరబ్బులు ప్రారంభంలో మొరాకో  నుంచి వచ్చారు. కనుక యూరొపియన్‌ చరిత్రకారులు కొందరు ఈ అరబ్బుల్ని ‘మొర్స్‌’ అని కూడా పేర్కొన్నారు. ఇలా స్పెయిన్‌లో ప్రవేశించిన ఈ అరబ్బులు  ఈ  దేశాన్ని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల వరకు పరి పాలించారు. వారి పరిపాలనా విధానాన్ని ముస్లిం చరిత్రకారులే కాదు, క్రైస్తవ చరిత్రకారులు కూడా కొనియాడారు. జశీఎటశ్రీఱష్‌ దీవ్‌షవవఅ Rవశ్రీఱస్త్రఱశీఅ aఅస ూషఱవఅషవ  గ్రంథ  రచయిత విలియం డ్రీపర్‌ను అనుసరించి వారు (అరబ్బులు) మానసికంగాను, బుద్ధివివేకాల ద్వారాను యూరప్‌ను  ప్రగతి  పథంలో నడిపించ డానికి  అత్యధికంగా  తోడ్పడ్డారు. వీరి సభ్యతా సంస్కృతులు, పరిపాలనా తీరుతో సిసిలీ  మొత్తం  సస్యశ్యామలంగా మారి పోయింది.  అప్పుడక్కడ ఐదు విభిన్న జాతులు  నివసిస్తుండేవి. వారు ఫ్రెంచ్‌, గ్రీక్‌, లాంగోబార్‌, యూదులు, అరబ్బులు. అయితే పరిపాలకులయిన అరబ్బులు తమ పాలనలో చూపిన ఓర్పు, సహన త్వాల కారణంగా ఈ విభిన్నజాతులు తమ స్వంత  చట్టాలనే  అనుసరిస్తుండేవి. గ్రీక్‌ వారు ‘జస్టినేన్‌’ చట్టాన్ని అనుసరించేవారు. లాంగోబార్‌ వారిదో ప్రత్యేక చట్టముండేది. నార్మన్లు ఫ్రెంచి చట్టాన్ని అనుసరించేవారు. అరబ్బులు ఖుర్‌ఆన్‌ ప్రకారం నడుచుకునే వారు.  ఈ  వివిధ జాతుల్ని ఒకే ప్రభుత్వ పాలనలో  ఉంచడానికి మహోన్నతమైన, సిసలైన న్యాయం, అసామాన్యమైన ఓర్పు, సహనాలు అవసరమై ఉండేవి. ఈ విష యాన్ని  అరబ్బులు  బాగా గుర్తించారు. (Aతీaప జబశ్ర్‌ీబతీవ- వీశీశీంఱశీ ూవఱపaఅ- జూaస్త్రవ. 288) నాణేలపై ఉండే వ్రాతలు సగభాగం అరబ్బీలోనూ, సగభాగం లాటిన్‌ భాషలో ఉండేవి.  కొన్ని నాణేలపై శిలువ గుర్తులు,  కొన్నింటిపై  ఇస్లామీయ చిహ్నాలు, ఇంకొన్నింటిపై రెండురకాల చిహ్నాలుండేవి.   (Aతీaప  జబశ్ర్‌ీబతీవ- వీశీశీంఱశీ ూవఱపaఅ- జూaస్త్రవ. 280)

geeturai_weekly_magazine_18_2

సిసిలీని  అరబ్బులు  తీర్చిదిద్దిన తీరును ూ.దీ. ూషశ్‌్‌ీ ఇలా వర్ణించాడు :‘దీని రాజ ధాని నగరమైన ‘పిల్‌రమో’కు ఇతర అన్ని నగరాలపై  ఆధిక్యత  ఉండేది. ఇది అత్యంత  ఐశ్వర్యవంతం,  సౌభాగ్య వంతమైన నగరంగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి  ప్రజలు  అత్యంత సఖ్యత గల వారు, అత్యధిక తెలివితేటలు గలవారై ఉండేవారు. ఇక్కడ ఐదు వందల మస్జిదు లుండేవి. ఇక్కడి ప్రధాన మస్జిద్‌ అయిన ‘జామె మస్జిద్‌’లో ఏకకాలంలో ఏడువేల మంది  అవలీలగా  నమాజు చేసుకునే అవకాశముండేది…  ముస్లింలు సైన్స్‌ను అభివృద్ధి  పరచడానికి  అత్యధికంగా తోడ్పడ్డారు. భూగోళం, రసాయనిక శాస్త్రం, వైద్యశాస్త్రాల్లో వారికి అభిరుచి మెండు……. అరబ్బు భౌతిక శాస్త్రవేత్తలు  ‘పిల్‌రమో’ మస్జిద్‌  గోపురాలపై  కూర్చుండి (దూర దర్శినిల సహాయంతో)  గ్రహాల చలనం, సూర్యచంద్ర  గ్రహణాల సమయాలు, విలీనాకాశంలో  నక్షత్రాల వ్యాప్తి, వాటి స్థానాల గురించి అధ్యయనం చేసేవారు. ముస్లింలు తమ ధార్మిక స్థలాల గోపురా లను సైంటిఫిక్‌ పరిశోధనల కోసం వాడు కుంటున్నప్పుడు, చర్చీల పాదరీలు ఇటు వంటి విషయాల్ని  అత్యంత అసంతృప్తి కరమైన,  ఆగ్రహ  దృష్టితో చూసేవారు. సిసిలోని అరబ్బు వైద్యులు, తమ స్పెయిన్‌ సోదరులలాగే   యూరప్‌  అంతటిలో అత్యంత నిపుణులుగా గుర్తించబడేవారు. వీరికి వైద్యం, సర్జరీలో పరిపూర్ణ సామర్థ్య  ముండేది………  ‘బతలిమోస్‌’ రచించిన వ్యాకరణ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, కాంతి, ధ్వనికి సంబంధించిన  శాస్త్రాలు కేవలం ముస్లింల వల్లనే  కాపాడబడ్డాయి.  వీటిని నాశనం చేయాలని (క్రైస్తవ)  పాదరీలు ఎంతో ప్రయత్నం చేసేవారు. (స్పెయిన్‌ పత్రిక` ఎస్‌.బి. స్కాట్‌, అనువాదం ఎం. ఖలీలుర్రహ్మాన్‌. వా.2, పేజి 67`75)
స్పెయిన్‌ను పరిపాలించిన వారిలో అబ్దుర్ర హ్మాన్‌   అద్దాఖిల్‌  మొదటివాడు.  అతను మొదటిసారిగా స్పెయిన్‌ తీరంపై అడుగిడ గానే అతనికి ‘సారా’ సమర్పించ బడిరది. బుద్ధీజ్ఞానాల్ని  పెంపొందించే  వస్తువు కావాలిగాని  వాటిని  హరించే వస్తువు అవసరం లేదంటూ’ దాన్ని త్రోసిపుచ్చాడు. ఇదేవిధంగా  అత్యంత  సౌందర్యవతి అయిన  ఒక  బానిసగత్తె అతనికోసారి సమర్పించబడిరది. ఈమెను నా కళ్ళలో దాచుకుంటే నా నిజలక్ష్యాన్ని నేను మరిచి పోతాను.  నా  లక్ష్యసాధనలో నేను నిమ గ్నమై ఉంటే  ఈ అమ్మాయిపై దౌర్జన్యం చేసినట్లవుతుంద’ని చెప్పి పంపించివేశాడు. ఇలాంటి ఉన్నత శీలం, అపూర్వ గుణగణా లతో అతను  ఎలాంటి ప్రభుత్వాన్ని స్థాపిం చాడంటే, యూరొపియన్‌ చరిత్రకారుల్ని అనుసరించి  దీనికి  సామెత యూరప్‌ చరిత్రలోనే దొరకదు. ప్రజల కొరకు అబ్దు ర్రహ్మాన్‌  ద్వారాలు  సదా తెరిచి ఉండేవి. అంతేకాక  అతను  స్వయంగా తన రాజ్యంలో పర్యటించి అధికారుల చర్యల్ని నిశితంగా పరిశీలించేవాడు. ప్రజల అవస రాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. విద్యా కళల్ని, పరిశ్రమల్ని, వాణిజ్యాన్ని పురోగమింపజేయడానికి అహర్నిశలు పాటుపడేవాడు. ‘కర్తబ’ నగరాన్ని భవనా లతో, ఉద్యాన వనాలతో ఎలా తీర్చిదిద్దా డంటే వాటిని చూసి తనే గర్వపడేవాడు. అతను  తన  కుమారుడు,  కాబోయే రాజును  సంబోధిస్తూ  చేసిన హితోప దేశాలు సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి. ‘కుమారా! న్యాయ విచారణలో ధనిక, పేద అనే భేదభావాన్ని దరిచేరనీయకు. నీకు  లోబడి  ఉన్నవారి పట్ల అత్యంత దయ,  కనికరాలతో వ్యవహరించు. ఈ ప్రజలంతా  దైవ సృష్టితాలే. నగరాల్ని, రాష్ట్రాల్ని విశ్వాసపాత్రులు, అనుభవజ్ఞులు అయిన వారికే అప్పగించాలి. ప్రజల్ని పీడిరచే అధికారుల్ని నిర్దయతో శిక్షించు. నీ సైనికుల పట్ల  మధ్యస్థ మార్గాన్ని అవలంభించు. వారికి ఆయుధాలు దేశ రక్షణ కోసమేకాని, దేశాన్ని ధ్వంసం చేయ డానికి ఇవ్వబడవనే  విషయాన్ని గుర్తు చెయ్యి. నీ దేశ ప్రజలు  నీపట్ల భయంతో విద్వేషంతో   కాక  ప్రేమతో ఉండేటట్లు వ్యవహరించు. ప్రజలు నీతో భయపడిపోతే చివరికి వారు  అపాయ కారులుగా మారి పోతారు. విద్వేషంతో ఉంటే నిన్ను నాశనం చేయ ప్రయత్నిస్తారు. రైతుల్ని సంపూర్ణంగా రక్షించు.  వారే మనకు ఆహారాన్ని సమ కూరుస్తారు.

అరబ్‌  ముస్లింలు  స్పెయిన్‌లో ఎంతటి సహనత్వం, ఓర్పు,మేలిమితో రాజ్య మేలారో  యూరొపియన్‌ చరిత్రకారులూ అంగీకరిస్తారు.ఈ విషయంగా మోసియోలీ బాన్‌ ఇలా వ్రాశాడు:

‘అరబ్బులు  సిరియా,  ఈజిప్ట్‌లో వ్యవహ రించిన  రీతిలోనే  స్పెయిన్‌ పౌరులతో వ్యవహరించారు. వారి ఆస్తులు, వారి కోటలు,  వారి చట్టాలు వారి స్వజాతి అధికారుల పరిధిలోనే ఉండే హక్కుని చ్చారు. కొన్ని షరతులతో సంవత్సరానికి ఒక  నిర్ణీత  జిజియాను (టాక్సును) విధించారు. ఇది సామాన్యంగా ధనికులపై ఒక దీనారము, పేదలపై అర దీనారము నిర్ణయించబడేది.  ఈ షరతులు ఎంత తేలికగా ఉండేవంటే  ప్రజలు ఎలాంటి వివాదం  లేకుండానే వాటిని అంగీకరిం చారు.  ఫలితంగా  అరబ్బులుపెద్దపెద్ద జాగీర్‌దార్లతో  ఘర్షణపడే  అవకాశం లేకుండా పోయింది. (Aతీaప జబశ్ర్‌ీబతీవ- వీశీశీంఱశీ ూవఱపaఅ- జూaస్త్రవ. 248, 249)

‘అరబ్బుల  ద్వారా  అక్కడ ఏదైతే విప్లవం సంభవించిందో దాని   ఫలితంగా ధనికుల కివ్వబడ్డ  సర్వ  రాయితీలు  తొలగించ బడ్డాయి. చర్చీ ఆధిపత్యం  తగ్గిపోయింది. పెద్దపెద్ద  సుంకాలు తీసివేయబడ్డాయి. ఫలితంగా  పరిశ్రమలు అభివృద్ధి చెంద సాగాయి.  ధార్మిక హింస, అసహనత్వాల కాలం  చెల్లిపోయింది. యూదులు తమ ధార్మిక విషయాల్లో స్వతంత్రులయ్యారు. క్రైస్తవులకు  సైతం   ఎలాంటి (ధార్మిక) అవరోధాలు లేవు.  వారి చట్టాలను అనుస రించే న్యాయ నిర్ణయం కోసం వారి న్యాయ మూర్తులు నియమించబడ్డారు. ఉద్యోగాల్లో ఎలాంటి బేధభావం పాటించ బడేది కాదు. ముస్లింల లాగే యూదులు, క్రైస్తవులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చుకో బడేవారు. అంతకు క్రితం నుండే సాగు చేస్తున్న భూముల్ని (సాగు చేసే) ఆ బానిస లకే ఇవ్వటం జరిగింది. క్రైస్తవ ప్రభువుల అధీనంలో ఉన్న బానిసలు తమ యజమా నుల్ని  విడిచి,  ఇస్లాంను ఆశ్రయించ సాగారు.(నఱర్‌శీతీవ శీట ూaతీంaఎఱవం- ూaస్త్రవ 112- 114)

అరబ్బు ముస్లింలు స్పెయిన్‌ను ఏవిధంగా పురోగమింపజేశారో, తీర్చిదిద్దారో వర్ణిస్తూ స్టీన్‌ లే లీన్‌పోల్‌ ఇలా వ్రాశాడు:
‘ముస్లింలు ‘కర్తబ’లో ఎంతటి అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించారంటే, మధ్యయుగంలో ఇదొక విచిత్రమైన విషయంగా కనబడసాగింది. ఈ కాలంలో యూరప్‌ మొత్తం అనాగరికమైన అజ్ఞానాంధకారంలో, అంతర్యుద్ధాల్లో మునిగి ఉండేది. కేవలం ముస్లింల (పరిపాలనలో ఉన్న) స్పెయిన్‌ దేశమొక్కటే విద్యావిజ్ఞానాల దేదీప్యమాన దివిటీగా పాశ్చాత్య లోకంలో వెలుగొందేది. అరబ్బులకు పూర్వం స్పెయిన్‌లో ప్రవేశించిన అనాగరిక విజేతల్లాగా మనం అరబ్బులను చూడలేము. దీనికి బదులు అరబ్బులు ఎంతటి స్వచ్ఛమైన, న్యాయ ప్రియమైన, విశాల దృష్టి గల ప్రభుత్వాన్ని అందించారంటే, ఇలాంటి ప్రభుత్వం అంతకుపూర్వం అక్కడ ఏర్పడి ఉండలేదు….. దేశ ప్రజలందరూ అరబ్బులతో సంతుష్టులు, సంతృప్తులై ఉండేవారు…. స్పెయిన్‌లో క్రైస్తవులు, అగ్నిని ఆరాధించేవారు సమంగా ఉండేవారు. కాన్సిటంటైన్‌ వారిని క్రైస్తవులుగానైతే మార్చాడు. కాని ఈ ధర్మం వారిపై కొద్ది ప్రభావం మాత్రమే వేయగలిగింది. వారు కేవలం బాహ్యంగానే రోమనులుగా కనబడేవారు. వారు ధర్మాన్ని కోరి ఉండలేదు. శాంతిసుఖాలతో జీవితం గడిపే అవకాశం కల్పించే ఒక శక్తి సహాయం కావాలని మాత్రమే వారు ఆకాంక్షించారు. ఈ వరాన్ని వారి అరబ్బు ప్రభువులు వారికి సమకూర్చారు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *