గురువే మార్గదర్శి

ఈనాడు  స్వలాభం వల్ల,  స్వార్థం వల్ల ఉపాధ్యాయులు   విద్యార్థుల  మధ్య ఉండవలసిన సంబంధాల ప్రాముఖ్యత, దాని ఔన్నత్యం క్షీణిస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ  విషయంలో ఉపా ధ్యాయులు గౌరవప్రదమైన తమ స్థానాన్ని, తమ  బాధ్యతలను  అవగాహన చేసు కోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.  మరొకవైపు విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల ఔన్న త్యాన్ని,  వారి   స్థానాన్ని,  వారి  గౌరవాన్ని గ్రహించటంలేదు. దాని కారణంగా విద్యా ర్థులు, ఉపాధ్యాయులను అగౌరవపరిచే వారిని హేళన చేసే వార్తలు తరచూ మన దృష్టికి వస్తున్నాయి.  ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా వారి విద్యా ప్రమాణాలు ప్రభా వితమవుతున్నాయి.  ఇంకా వారికి నైతిక విలువలు  కూడా  ఒంటబట్టటంలేదు. దాని కారణంగా విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న తరువాత కూడా సమాజంలో ప్రబలి ఉన్న  రుగ్మతలలో  కూరుకుపోతు న్నారు. విద్యార్థులు విద్యా సంస్థల  నుంచి ఉన్నతమైన డిగ్రీలు పొంది ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదుగుతున్నారు కాని పూర్వ కాలంలో  విద్య  ద్వారా  ఒక విద్యార్థిలో చోటుచేసుకునే మార్పులు, వారిలో కలిగే సుగుణాలు  ఈనాడు మనకు కనిపిం చటంలేదు.geeturai_weekly_12

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే  బాధ్యత తల్లిదండ్రుల   తరువాత  ఉపాధ్యా యులదే. తల్లిదండ్రులు పిల్లల శరీరానికి ఆహారాన్ని  ప్రసాదిస్తే  గురువులు వారి ఆత్మలకు   ఆహారాన్ని   సమకూరుస్తారు. అందుకోసమే  వారిని ఆధ్యాత్మిక గురు వులు  అని  కూడా  అభివర్ణించటం జరిగింది. పూర్వకాలంలో విద్యార్థులు తమ గురువులను ఎంతగానో గౌరవించేవారు, ప్రేమించేవారు, వారికి సేవ  చెయ్యటం ఒక అమూల్యమైన  విషయంగా భావిం చేవారు. వారి ముందు మాట్లాడటానికి కూడా జంకేవారు.   వారి  అనుమతి లేకుండా బయటకు అడుగుపెట్టేవారు కాదు. అంతేకాదు, గురువుల ఇళ్ళవైపునకు తన కాళ్ళను చాచి పడుకోవటాన్ని కూడా ఇష్టపడేవారు  కాదు.  మహారాజు గారి పిల్లలు సైతం గురువుల చెప్పులు మోయ టానికి పోటీపడేవారు. అప్పటి గురువులు అలాంటి వారన్నమాట. విద్యార్థులు కూడా అటువంటి వారే. కనుకనే అప్పటి విద్యా ర్థులు   తమ  గురువుల వద్ద నేర్చుకున్న జ్ఞానం  పర్వతాలంత గొప్పది, అంత పటిష్ట మైనదీను. ఆ విద్యాబుద్ధులు ఆ  పిల్లల జీవితాల్లో సంచలనాన్ని రేకెత్తించాయి. వారి మనసుల్లో  విద్యా కెరటాలు ఉవ్వెత్తున లేచాయి.  వారి ఆలోచనల్లో విప్లవాన్ని తెచ్చాయి.  వారి  జీవితాలను సమూలంగా మార్చివేశాయి.  విద్యార్థుల  పట్ల  ఆ గురువుల చిత్తశుద్ధి అలాంటిదన్నమాట. ఆ గురువులు తమ విద్యార్థులు తమ కంటే ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవా లని అభిలషించే వారు. వారి మనసుల్లో ధైర్యాన్ని నూరిపోసేవారు. తన విద్యార్థి ఉన్నతమైన స్థానాన్ని అలంకరించటాన్ని చూసి ఆనందంతో  ఉబ్బి  తబ్బిబ్బయ్యే వారు. అందుకోసమే  ఆ  కాలంలోని విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు విన మ్రతా  భావంతో  సలాములు చేసేవారు. వారి కోసం  ఎల్లవేళలా  ప్రార్థించేవారు. అలాంటి ఉపాధ్యాయుల కోసమే వారు మరణించిన  తరువాత  కూడా  సవాబె జారియా లభిస్తుంది.

కాని ఈనాటి సమాజంలో డబ్బును సంపా దించటమే జీవిత లక్ష్యంగా చేసుకున్న ఈ కాలంలో అన్ని  వస్తువుల  నాణ్యత తగ్గినట్లుగా, విద్యాబుద్ధుల నాణ్యత కూడా తగ్గిపోతూ వస్తోంది.  ఉపాధ్యాయుల బోధనా పద్ధతి నాణ్యతా క్షీణిస్తోంది. చిత్తశుద్ధి కూడా  లోపిస్తోంది.  విద్యార్థుల పట్ల ప్రేమ, దయా దాక్షిణ్యాలు కూడా కరువవు తున్నాయి. ఉపాధ్యాయులు ఆ విద్యా ర్థుల భవిష్యత్తు తమ చేతుల్లో ఉన్నదన్న విషయాన్ని కూడా మరచిపోతున్నారు. ఒక్కొక్క మెట్టు అధిగమించటానికి విద్యా ర్థుల వెన్నుదన్నుగా ఉండే బాధ్యత తమపై ఉందనే విషయాన్ని కూడా ఉపాధ్యా యులు విస్మరిస్తున్నారు. కేవలం ఒక ఉద్యోగంగా  తమ  బాధ్యతలను నిర్వహిస్తు న్నారు.  అందుకోసమే  ఉపాధ్యాయుల, విద్యార్థుల మధ్య ఆత్మీయత లోపిస్తోంది. గౌరవాభిమానాలు తగ్గిపోతున్నాయి. ఉపా ధ్యాయులు, విద్యార్థుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి.  విద్యాబుద్ధులు నేర్పటం  కూడా  ఒక ప్రొఫెషన్‌గా మారి పోయింది.

పాత స్కూళ్ళకు వెళ్ళనని మారాం చేస్తున్న తన చిట్టి  తల్లికి  కొత్త స్కూల్‌లో చేర్పిస్తా నమ్మా బయలుదేరు అని ఆమె తల్లి అన్న ప్పుడు అమ్మా ఆ స్కూల్లో కూడా కొడతా రేమో,  దండిస్తారేమో  ముందు తెలుసు కోమ్మా అన్న ఆ చిన్నారి జవాబుకు ఆ తల్లి హృదయం చివుక్కుమన్నది, ఆమె గుండె తరుక్కుపోయింది. ఆమె కళ్ళల్లో సుడి గుండం గిర్రున తిరిగింది. ఒక పసిప్రాణం ఒక సంవత్సరమంతా ఒక ఉపాధ్యాయుని చేతిలో ఉండిన తరువాత ఆ పసి హృద యంలో తన ఉపాధ్యాయురాలి పట్ల ఏర్ప డిన అభిప్రాయం, భయం అన్నమాట.

ఈనాటి మన ఉపాధ్యాయులకు ఎన్ని శిక్షణా తరగతులు నిర్వహించినా ఎక్కడ వేసిన  గొంగళి  అక్కడే అన్న మాదిరిగా        ఉంది మన పరిస్థితి. అంటే పిల్లల్ని దండిర చకూడదు, దెబ్బ కొట్టకూడదు అనేది దాని భావం ఎంతమాత్రం కాదు. ఆ దండన, ఆ భయం  వారిలో  మార్పును తీసుకు రావాలే   కానీ  బడి  నుంచే పారిపోయే విధంగా ఎంతమాత్రం ఉండకూడదు. ఆ చిన్నారి పుష్పాల భవిష్యత్తు మన చేతుల్లో ఉందనే  విషయాన్ని ఉపాధ్యాయులు ఎప్పటికీ  మరువకూడదు. ఒక గురువు తన విద్యార్థిని దండిస్తున్నాడంటే, అది మన మంచికే,  మన సంస్కరణ కోసమే అనే విషయం అర్థమయ్యేలా ఉండాలి ఆ దండన.

ఇంకా ఉపాధ్యాయులకు తాను బోధించే పాఠ్యాంశంపై పూర్తి అవగాహన, పూర్తి పట్టు ఉండాలి. ఆ ఉపాధ్యాయుని కంఠం కఠినంగా ఉండకూడదు. పిల్లల ముందు మృదువుగానూ,తియ్యగానూ మాట్లాడాలి. కనుగుడ్లు తేలేవిధంగా తమ కన్నులను తెరవకూడదు.   పాఠ్యాంశంలోని  నీతిని వారికి అర్థమయ్యే భాషలో  బోధించాలి. దాని సారాన్ని విశదంగా విడమర్చి చెప్పాలి. ఆ విషయాలు విద్యార్థుల జీవితంలో విప్ల వాత్మకమైన మార్పును తేవాలి. పుస్తకం లోని  పాఠాలు  మాత్రమే చెప్పకుండా వారికి నైతిక విషయాలను, జీవిత విధా నాన్ని కూడా నేర్పాలి.   ప్రపంచంలోని        ఉద్యోగాలన్నింటిలోనూ  ఉపాధ్యాయుని ఉద్యోగంలో  ఉన్న  వారి  బాధ్యత  చాలా అధికం. ఎందుకంటే ఇతర మిషన్లలో వస్తు వులు  తయారవుతాయి.  కాని గురువుల మిషన్లలో, వారి చేతుల్లో భావి భారతానికి కావలసిన  పౌరులు  తయారవుతారన్న మాట. మిషన్‌లో  ఒక  వస్తువు చెడిపోతే దాన్ని రీమోల్డ్‌ చేయవచ్చు. లేదా పక్కన పడేయవచ్చు.   కాని  ఉపాధ్యాయుల మిషన్లలో   తయారయ్యే  వస్తువులు (పిల్లలు) చెడిపోతే రీమోల్డ్‌ చెయ్యలేము. పక్కనా పడవెయ్యలేము. కేవలం ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా అతని సంస్కరణ సరైన విధంగా జరగకపోయినా ఆ ఒక విద్యార్థి వల్ల  అతని  కుటుంబానికి, ఆ తరువాత  సమాజానికి  ఘోరమైన నష్టం జరుగుతుందన్నమాట.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *