జ్ఞానార్జన ప్రాముఖ్యత

మానవులను అల్లాప్‌ా తన దాస్యం కొరకే పుట్టించాడు. ‘నేను జిన్నుల్ని, మానవుల్ని నా ఆరాధన చేయడానికి  తప్ప మరే ఉద్దేశ్యంతో సృజించలేదు.’ (దివ్య ఖుర్‌ఆన్‌)
దాస్యం (ఆరాధన) చేస్తే పుణ్యం లభిస్తుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని జ్ఞానం (ఇల్మ్‌) ఆర్జించడం ఇంకా పుణ్య కార్యం. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘జ్ఞాన ప్రాముఖ్యత, ఆరాధనల ప్రాము ఖ్యత కంటే అధికం.’ (వజ్జార్‌) ఇక్కడ ఆరా ధనలు అంటే తప్పనిసరిగా చేయవలసినవి (ఫర్జ్‌) కావు. అదనపు (నఫిల్‌) ఆరాధనలు అని అర్థం చేసుకోవాలి.geeturai_weekly_7
అజ్ఞానంతో చేసే ఆరాధన కన్నా  కొద్దిపాటి జ్ఞానం ఎంతోమేలు. ప్రవక్త  ముహమ్మద్‌ (స) ఇలా ప్రవచించారు :  ‘ఓ అబూజర్‌ (రజి)! ఉదయం పూట అల్లాప్‌ా గ్రంథం నుండి ఒక ఆయత్‌ (వాక్యం) నేర్చుకో. ఇది వెయ్యి  రకాతులు  చదవటంకంటే ఎంతో మేలైనది.’ (ఇబ్నెమాజ) ఒక వాక్యం నేర్చుకోవటం, వెయ్యి రకాతుల నఫిల్‌ నమాజు చదవటం కన్నా మేలైనదని భావం.
జ్ఞానం లేకుండా (అజ్ఞానంతో) ఆరాధన చేసేవారి పోలిక ` ఇద్దరు మిత్రులున్నారు. అందులో ఒకడు అజ్ఞాని. అతడు తన మిత్రుడికి లాభం చేయాలనుకున్నాడు. అతని  సంకల్పం  మంచిదే. కాని తన అజ్ఞానం కారణంగా మిత్రునికి లాభం చేయటానికి బదులు నష్టమే కలిగించాడు. కొన్నిసార్లు లాభం కలిగించవచ్చు, అయితే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. జ్ఞానం  లేని మిత్రుని కన్నా జ్ఞాని అయిన శత్రువు మేలు  అనే  లోకోక్తి మనకు తెలిసిందే. జ్ఞానం లేని ఆచరణ ప్రమాదకరం. ఆచరణలేని జ్ఞానం వ్యర్థం.(నఫిల్‌) ఆచరణ తక్కువగా ఉన్నప్పటికీ, జ్ఞానుల జ్ఞానం వారికి వెలుగునిచ్చి మంచి మార్గం చూపుతుంది. జ్ఞానం చక్కని చుక్కాని వలె పనిచేస్తుంది.
ఆలిమ్‌ (ధార్మిక పండితుడు,జ్ఞాని)కు ఆరాధనలు (ఇబాదత్‌) చేసే వారిపై వెయ్యిరెట్లు ఆధిక్యత ఉందని ఒక ప్రవక్త ప్రవచనం వివరిస్తుంది. ఎందుకంటే షైతాన్‌ ప్రజలలో బిద్‌అత్‌ (ధర్మంలోలేని కొత్త విషయాలు) చేసేందుకు మనుషు లను ఉసిగొల్పుతాడు. ఆలిమ్‌ దానిని అర్థం చేసుకోగలుగుతాడు, చూసి అర్థం చేసుకోగలుగుతాడు. కేవలం ఆరాధనలు చేసే అజ్ఞాని దానిని అర్థం చేసుకోలేడు. అతడు కేవలం తాను చేసే ఆరాధనలపైనే దృష్టి సారించి వాటిని చేసుకొని పోతాడు. దానివల్ల అతను పుణ్యానికి బదులు పాపం మూటగట్టుకుంటాడు. దైవాగ్రహానికి గురవుతాడు.
ధర్మ సందేశ ప్రచారం చేసేవారికి జ్ఞానం చాలా అవసరం.  ఒక ఆలిమ్‌ సందర్భాను సారం రకరకాల ఉదాహరణలు, వివర ణలు   ఇవ్వగలుగుతాడు.   కాఫిర్‌ (అవిశ్వాసి)కు విశ్వాసానికి సంబంధించిన ప్రేరణను   అందించగలుగుతాడు. అధికంగా ఆరాధనలు చేసే అజ్ఞాని అలా చేయడం కష్టం అనేకంటే అసాధ్యం అన వచ్చు. ఒకవేళ ప్రేరణ కలిగించిన అది తాత్కాలికంగా ఉంటుంది.  విశ్వాసి అనే       వాడు ఏది  హలాల్‌,  ఏది హరామ్‌ అనేది తెలుసుకోగలిగినంత  ధార్మిక జ్ఞానం సంపాదించేందుకు  రోజుకు ఒక గంట లేదా కనీసం అరగంట అయినా సరే దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌, ప్రవక్త(స) ప్రవచనాలు, ధార్మిక పుస్తకాలు (ప్రవక్త(స) గారి జీవిత చరిత్ర, సహాబాల గాథలు) తనకు పట్టున్న భాషలో అధ్యయనం చేయాలి.
‘ఇవి కొన్ని ఉపమానాలు. వీటిని మేము ప్రజల కొరకు వివరిస్తూ ఉన్నాము. జ్ఞాన సంపన్నులు మాత్రమే వీటిని గ్రహించ గలుగుతారు.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 29:43)
‘‘ఒక వ్యక్తి  రాత్రి  గడియలలో సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, దైవారాధనలో నిల బడుతున్నాడు. పరలోకానికి భయపడు తున్నాడు, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడు (మరోవ్యక్తి ఇవేమి చేయటం లేదు). చెప్పండి! తెలిసినవారు` తెలియని వారు సమానులు కాగలరా? బుద్ధిమం తులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.’ (దివ్యఖుర్‌ఆన్‌ 39: 9)
అల్లాప్‌ా  మనకు ఇహ,  పరలోక సాఫల్యా నికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఆర్జించే వనరు లను, అవకాశాలను, సౌభాగ్యాన్ని కలుగ జేయుగాక (ఆమీన్‌).

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *