దేశమంటే… థాయ్‌లాండ్‌

cityముస్లిం దేశాలతో థాయ్‌లాండ్‌ సత్సంబంధాలు

హలాల్‌ పదార్థాల మార్కెటింగ్‌

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌

` హమీదాబేగం, గోదావరిఖని

థాయ్‌లాండ్‌లో మన దేశవాసులలాగే చేతులు జోడిరచి స్వాగతం పలుకుతారు. భారతీయ, బుద్ధ సంస్కృతి కలగలిసి ఉంటుంది. థాయ్‌వాసులు అతిథిని దైవంగా భావించి సత్కార్యాలు చేస్తారు. వీరి ఆతిథ్యం మనల్ని మన ఇంట్లోనే వున్న భావనను కలిగిస్తుంది. ఇంతగా వీరు అతిథుల్ని ఆదరిస్తారు. పరిచయస్తులే కాక అపరిచితుల్ని సైతం వారు ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. థాయ్‌వాసుల్లో హెల్పింగ్‌ నేచర్‌ (సహాయపడే తత్వం) ఎక్కువ. థాయ్‌లాండ్‌ ఎంత అందమైన దేశమో అక్కడి వారి మనసు అంతకంటే అందమైంది. వారి భాష మనకు అర్థం కాకపోయినా ఇతర దేశాలంత కష్టమైతే కాదు. హావభావాల ద్వారా ఇట్టే అర్థమవుతుంది. మనకక్కడ దారి తెలియకపోయినా దారి తప్పిపోయినవారు మనల్ని సంతోషంగా గమ్యం చేరడంలో సహాయపడ్తారు. షాపింగ్‌ చేయాలన్నా సహాయపడతారు. వారు చేసే అతిథి సత్కార్యాలకు అతిథికి వారిచ్చే అపార గౌరవానికి మళ్ళీ మళ్ళీ థాయ్‌లాండ్‌ వెళ్ళాలనిపిస్తుంది. వారు కూడా మనం మళ్ళీ మళ్ళీ రావాలని కాంక్షిస్తారు. ఈ కారణంగానే విదేశీయులు అధికసంఖ్యలో అక్కడికి వస్తుంటారు. ఇక్కడి మార్కెట్లు ఢల్లీిలోని మన మార్కెట్లను తలపిస్తాయి.

నేడు థాయ్‌లాండ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముస్లిం దేశాలైన మలేషియా, తూర్పు మధ్య ఆసియా దేశాలు సుముఖత వ్యక్తంచేస్తున్నాయి. 9/11 ఘటన తర్వాత యూరప్‌ అమెరికా దేశాలతో ముస్లిం దేశాల సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. వీటి స్థానే థాయ్‌లాండ్‌తో తమ పెట్టుబడులు పెట్టడానికి తూర్పు మధ్య ఆసియాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. మలేషియాలో భౌతిక రాజకీయ మార్పుల కారణంగా పక్క దేశాలు ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నాయి. గతేడాది అరబ్‌వాసులు మలేషియాలో అధికసంఖ్యలో కన్పించారు. అయితే ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ అరేబీయులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ అధికసంఖ్యలో అరేబియన్లున్నారు.

మన దేశంకంటే అరేబియాలో వాతావరణం వేడిగా వుంటుంది. వేసవిలో 50డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత వల్ల చెమటతో తడిసిపోతాము. ఎక్కువ వేడి లేకుంటే వర్షాలెక్కువ. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి. దీంతో కొంత చల్లదనం వస్తుంది. ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఇది వ్యాపారానికి ఎంతో అనుకూలం.అందువల్ల అరేబియా దేశాలన్నీ వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడ వ్యాపార లావాదేవీలు అధికంగా జరుగుతాయని ఈజిప్షియన్లు చెప్తారు. అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హం సౌదీ రియాల్‌, ఖులైజ్‌ కరెన్సీ, థాయ్‌ భట్‌ కంటే బలోపేతమైనది. థాయ్‌ భట్‌ మలేసియా రింగట్‌ సౌది రియాల్‌, యూఏఈ దిర్హంలు, యూరో అమెరికా డాలర్‌ కంటే కూడా అధిక లావాదేవీలు జరుగుతాయి.  దుబాయ్‌ యుఏఈ ముఖ్యపట్టణాల్లో థాయ్‌ భట్‌కు డాలర్‌ కంటే కూడా విలువ ఎక్కువ. థాయ్‌ యూరోలు ఎమిరేట్స్‌, ఎయిర్‌లైన్స్‌లో కూడా ముందుకు సాగుతున్నాయంటే వీటి విలువ తెలుస్తుంది. ఇక్కడి విమానాశ్రయాలన్ని ఎల్లప్పుడు రద్దీగా జనంతో కిటకిటలాడుతుండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

వ్యాపార రంగంలో వృద్ధేకాక ఇంకో ముఖ్యమైన వైద్యరంగంలో కూడా థాయ్‌లాండ్‌ మలేషియాకు ఛాలెంజ్‌గా మారింది. అత్యంత ఖరీదైన నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరకే థాయ్‌లాండ్‌ అందిస్తోంది. అపార వైద్యసదుపాయాలను కల్పిస్తూ అతి స్వల్ప ఖర్చులోనే కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్న థాయ్‌లాండ్‌ ఇతర దేశాల రోగులను ఎంతో ఆకర్షిస్తోంది. బ్యాంకాక్‌ హాస్పిటల్స్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్ళను తలపిస్తాయి. సకల సౌకర్యాలతో వైద్య సదుపాయాలతో అరబీ, హిందీ, ఉర్దూభాషలు మాట్లాడే డాక్టర్లు, నర్సులు ఇక్కడి ఆసుపత్రుల్లో నిత్యం అందుబాటులో వుంటూ స్నేహితుల్లా కలిసిపోతారు. రోగుల సహాయార్థం రహదారుల్లో కూడళ్ళలో అరబీ, థాయ్‌, ఇంగ్లీషు భాషల్లో ఎనౌన్స్‌ చేయబడ్తాయి. ఇంకా ఇక్కడ వున్న పేషంట్లకు వారి బంధువులకు హలాల్‌ (పరిశుభ్రమైన) ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. పేషంట్ల బంధువులకు నమాజ్‌ ఇతర ఆరాధనల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సకల సౌలభ్యాలతో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యసేవలతో థాయ్‌లాండ్‌ ప్రత్యేకంగా ఇతర దేశాలను ఆకర్షిస్తోంది.

థాయ్‌లాండ్‌లో మన పసందైన వంటకాలు దొరకడం కష్టం. కాని థాయ్‌ వంటకాలు కూడా ఎంతో రుచిగా వుంటాయి. థాయ్‌ వ్యాపారాలు ప్రస్తుతం హలాల్‌ ఆహార పదార్థాల మార్కెట్‌పై ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌పై దృష్టి పెట్టాయి. దాదాపు ఒక ట్రిలియన్‌ డాలర్లకంటే కూడా అధిక టర్నోవర్‌ గల హలాల్‌ మార్కెట్‌లో భాగస్వామ్యం కోసం థాయ్‌ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి గాను ప్రపంచంలోనే మొట్టమొదటి హలాల్‌ సైన్స్‌ సెంటర్‌ను బ్యాంకాక్‌ యూనివర్సిటీలో స్థాపించడం జరిగింది. థాయ్‌లాండ్‌ తన్నుతాను ఎప్పుడు కూడా ముస్లిమేతర దేశంగా ప్రకటించుకోలేదు. దీనికి కారణం అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. ఐఓసీలో సభ్యత్వం కల దేశం థాయ్‌లాండ్‌. ఇస్లామ్‌ షరిఅత్‌ చట్టానికనుగుణంగా ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ పేరిట బ్యాంకు స్థాపించనుంది. ఈ బ్యాంకు లావాదేవిలన్నీ ఇస్లామ్‌చట్ట ప్రకారమే జరుగుతాయి. ఇంకా ఈ బ్యాంకు వడ్డీరహిత రుణాల్ని ఇవ్వనుంది.

థాయ్‌ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కార్యాచరణ ప్రణాళికను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి తెల్పుతుంది. ముఖ్యంగా ముస్లిం దేశాల మీడియా ముందు తమ ప్రణాళికను ఉంచుతుంది.

దక్షిణ థాయ్‌లాండ్‌లో ముస్లింలు బుద్ధుల మధ్య కల్లోలాలున్నాయి. ఇక్కడ 1975`1979 మధ్య దాదాపు రెండు లక్షల మంది ముస్లింలను హతమార్చడం జరిగింది. క్రీ.శ. 2004లో ఐదు వందల ముస్లిం యువకులను హతమార్చారు. ఈ చర్యలను యావత్‌ ప్రపంచం ఖండిరచింది. ఈ ప్రాంతం ఒకప్పుడు ముస్లిం రాజు ఆధీనంలో ఉండేది. తర్వాత స్వాతంత్య్రం పొందింది. గతంలో ముస్లింలపై చేసిన దాడులు దౌర్జన్యాలకు థాయ్‌ నాయకులకు ప్రాయశ్చిత్తం ఏర్పడిరది. వీరు ముస్లింలను ఆకట్టుకోవడానికి రకరకాల పథకాలను ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉన్నమూడు రాష్ట్రాల్లో స్థానిక ముస్లిం నాయకులకు గవర్నర్లకు సత్సంబంధాలున్నాయి. ముస్లింల కోసం థాయ్‌ ప్రభుత్వం చేసే సంక్షేమ పనులు వారి మధ్య అపోహలు తొలిగి ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆశిస్తూ…

“““““““““““““““““““““““““““““““““““““““““““““““““““

స్నేహితుడి ఉపాయం

నాదిరా ఫిర్‌దోస్‌

రియాజ్‌, సమీర్‌ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. తరచూ వీరిద్దరు వ్యాపార నిమిత్తం ఎడారి గుండా ప్రయాణిస్తుండేవారు. ఒకసారి వీరిద్దరు వ్యాపారం కోసం వేరే ప్రదేశానికి వెళుతుండగా మార్గమధ్యలో చీకటి పడడంతో ఎడారి ప్రదేశంలో సేద తీర్చుకొనుటకు వెళ్ళవలసి ఉంటుంది. కనుక తన వద్ద ఉన్న బంగారు నాణేలను తన స్నేహితుడైన సమీర్‌కిచ్చి భద్రంగా వుంచమని చెప్పి వెళ్ళాడు. సమీర్‌ ఆ బంగారు నాణేలను గుర్రపు జీనులో భద్రంగా దాచిపెట్టాడు. రాత్రి పలుసార్లు లేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఉదయాన్నే తన మిత్రుడు వచ్చి బంగారు నాణేలు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు గుర్రం జీనులో చూస్తే నాణేలు కనిపించలేదు. స్నేహితులిద్దరికీ ఆశ్చర్యం వేసి చివరకు ఇవి దొంగిలించబడినవి అని అనుకున్నారు. సమీర్‌, దొంగను ఎలాగైనా కనుగొని నీ బంగారు నాణేలను తిరిగి నీకు ఇస్తానని రియాజ్‌కు ధైర్యం చెప్పాడు. సమీర్‌ తన సేవకులందరినీ పిలిచి నేను గుర్రం జీనులో బంగారు నాణేలు పెట్టాను. అవి మీలో ఎవరో ఒకరు దొంగిలించారని నా అనుమానం. నా గుర్రానికి మాటలు రావు కానీ దాని భాష నాకు అర్థమవుతుంది. దాని తోక పట్టినప్పుడు తప్పు చేయనివాడు పట్టినట్లయితే అదిఏదో స్థితిలో వుంటుంది. కానీ ఎవరైతే బంగారు నాణేలు దొంగిలించారో వారు తోక పట్టుకున్నట్లయితే అది తన భాషలో నాకు దొంగ ఎవరో చెప్పడం మొదలుపెడ్తుంది అని సేవకులకు తెలియజేసి ఒకరి తర్వాత ఒకరు మీ నిజాయితీని నిరూపించుకోండి అని సేవకులకు ఆజ్ఞాపించాడు. అలా యజమాని ఆజ్ఞ ప్రకారం సేవకులందరూ గుర్రపుతోకను పట్టి వస్తారు. కానీ ఏమీ జరగదు. గుర్రం మాట్లాడదు. రియాజ్‌ ఇంకా ఆందోళన చెందుతాడు. ఆగు మిత్రమా ఆగు. దొంగ ఎవరో ఇప్పుడే తెలుస్తుంది అని మిత్రుడిని సమీర్‌ ఊరించాడు. సమీర్‌ సేవకుల చేతులను పరిశీలించి చూశాడు. తొమ్మిది మంది సేవకుల చేతులకు ఒకరకమైన సువాసతో కూడిన రంగు తగిలివుంది. కానీ పదవ సేవకుడి చేతులకు ఏమీ తగిలి వుండదు. సమీర్‌ ఆ సేవకుడి ముఖకవళికలను గమనిస్తూ నెమ్మదిగా కరవాలం తీసి గట్టిగా పట్టి బంగారు నాణేలు ఎక్కడ దాచావు. కృతఘ్నుడా! అని గద్దించాడు. ఆ సేవకుడు పారిపోతుండగా మిగతా వారు అతన్ని బంధించి బంగారు నాణేలు స్వాధీనం చేసుకుంటారు. బంగారు నాణేలు రియాజ్‌కు ఇచ్చారు. రియాజ్‌ తన మిత్రుడు దొంగను ఎలా కనుగొన్నావు? అని ప్రశ్నించాడు. నా గుర్రం మాట్లాడదు ఏమీ లేదు. నేను గుర్రం తోకకు ఒక సువాసన వెధజల్లే రంగును పూసి ఉంచాను. ఎవరైతే దాన్ని పట్టకుండా వస్తారో అతనే దొంగగా గుర్తించాను. ఎందుకంటే దొంగ దాన్ని పట్టుకుంటే గుర్రం మాట్లాడుతుందనే భయంతో తోక పట్టడు కదా! రియాజ్‌, సమీర్‌ తెలివికి మెచ్చుకుని ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *