నగ్నసత్యం

special story-p18drpeggi19rr13al11s71rv19p5వారు గ్రామపెద్దను నమ్ముకున్నారు. వారిని కాపాడ తానని అతనన్నాడు. కాని వాడి ఇంట ఆ రాత్రి జరిగింది తెలిస్తే మానవత్వం సిగ్గుతో  తలదించుకుంటుంది.  ఔట్‌లుక్‌ పత్రిక  ముజఫర్‌నగర్‌ పునరావాస శిబిరాల్లో తలదాచు కున్న అనేకమంది ముస్లిమ్‌ స్త్రీలను కలిసి మాట్లాడిరది. అనేకమంది నిర్భయలు….

ఉత్తరప్రదేశ్‌ షామ్లి జిల్లాలోని లఖ్‌బావిడి గ్రామం.  ముజఫర్‌ నగర్‌ పట్టణానికి 20 కి.మీ.దూరంలో  ఉంది. ఊరికి మూడు వైపులా కోతకు సిద్ధంగా ఉన్న చెరకు పంట. మనిషి ఎత్తు ఉన్న చెరకు గడలు. నాలుగవ వైపు ఒక చెరువు ఉంది.ఉత్తర భారతంలో వినిపించే హాస్యోక్తి ఏమంటే, ఎవరినయినా  దాచిపెట్టాలనుకుంటే, కోతకు సిద్ధంగా ఉన్న చెరకు పొలాల కన్నా మంచి స్థలం ఉండదు.

ఇది కూడా కోతకాలమే.  కాని లఖ్‌బావిడి లోని చెరకు  పొలాలు భయానక కధలను వినిపిస్తున్నాయి. ఇటీవల అక్కడ దొరికిన అర్ధనగ్నంగా  పడి  ఉన్న సగం కుళ్ళిన మహిళ మృతదేహం వంటి అనేక కధలు. చెరకు పంట కోత జరిగిన కొద్ది మరిన్ని భయానక వార్తలు వెలుగులోకి రావచ్చు.

ముజఫర్‌  నగర్‌  అల్లర్లకు తీవ్రంగా ప్రభావితమైన గ్రామం లఖ్‌బావిడి. లిసాద్‌, ఫుగానా, కుత్బాకుత్బీ, కిరానా, బుధానా, బాహావ్డి గ్రామాలు కూడా మతహింసకు భగ్గుమన్నాయి.

ఆబిద్‌ఖాన్‌ ఆ దృశ్యాన్ని మరిచిపోలేడు. ‘‘ఉదయం7.30ని.ల సమయం’’ అంటూ జరిగిన బీభత్సాన్ని అతడు వివరించాడు. 35 సంవత్సరాల ఆబిద్‌ఖాన్‌ జరిగిన ఘోరాన్ని వివరిస్తూ ‘‘మా ఇంటి ముందు కొందరు యువకులు వచ్చి బతికి ఉండా లంటే పారిపోవాలని అన్నారు. మేము వెంటనే గ్రామపెద్ద బిల్లూ ప్రధాన్‌ ఇంటికి సహాయం కోసం  వెళ్ళాము’’ అన్నాడు. బిల్లూ ప్రధాన్‌  అంటే గ్రామపెద్ద సుధీర్‌ కుమార్‌. అతడు గ్రామపెద్దగా ఎన్నిక య్యాడు. అతడిని అందరూ బిల్లూ ప్రధాన్‌ అని పిలుస్తున్నారు.

లక్‌బావిడీలో 9500 మంది ఓటర్లున్నారు. ముస్లిముల సంఖ్య 1200. వీరిలో చాలా మంది చెరకు పొలాలకు అవతల నివసి స్తున్నారు. ఆ ప్రాంతాన్ని పల్లీపార్‌ అని పిలుస్తారు. వీరంతా కూలినాలి, వడ్రంగం, చాకలి, కసాయి, దర్జీ, చెరకుసాగు చేసు కుని బతికే బీదబిక్కి జనమే. ఇక్కడ భూమి ఉన్నవారు హిందూ జాట్‌ కుల స్తులు, అతి తక్కువ మంది ముస్లిములు.

బిల్లూ ప్రధాన్‌ ఇల్లు ఒక పెద్ద మహలు. అక్కడికి వెళ్ళడానికి దారి అడిగిన ప్రతిసారి చెప్పే  వ్యక్తులు  పక్కారోడ్డు దిగవద్దని, తిన్నగా రోడ్డు వెంబడి వెళ్ళాలని చెప్పారు. ఆ రోడ్డు తిన్నగా బిల్లూ ప్రధాన్‌ ఇంటికి పోతుంది.

అసలేం జరిగిందో చెప్పాలంటే, కొంత కాలంగా  ఉద్రిక్త  పరిస్థితులు నెలకొని              ఉన్నాయి.  ముఖ్యంగా  ఆగష్టు చివరి నుంచి  పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది.             ఉద్రిక్తతకు  కారణంగా చెప్పేదేమంటే, కవల్‌ గ్రామానికి చెందిన ఒక ముస్లిమ్‌ కుర్రాడు ఒక జాట్‌ అమ్మాయిని వేధించా డంట. కొందరు కారణం అది కాదు, ఒక ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌ కారణమని కూడా అంటున్నారు. వేధింపు కధను నమ్మితే, ఆ అమ్మాయి సోదరుడు, మరో బంధువు కలిసి ముస్లిమ్‌ కుర్రాడిని హతమార్చి పగ తీర్చుకున్నారు.  కాని  అక్కడే ఉన్న ముస్లిమ్‌ గుంపు వారిపై దాడి చేసి చంపే సింది. ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. పుకార్లు వ్యాపించాయి. అబద్దపు వీడియోలు, ఇతర ప్రచారమాధ్యమాలతో అల్లర్లకు కావలసిన వాతావరణం ఏర్పడిరది. రాజ కీయ  నాయకులు గొంతువిప్పి అవసర మైన నిప్పు  పెట్టారు. ప్రసంగాలతో రెచ్చ గొట్టారు.

ముజఫర్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం ముస్లిములు నినాదాలు చేస్తే, సెప్టెంబర్‌ 7న  జాట్‌  మహాపంచాయత్‌  హూంకా రాలు చేసింది.  పుకార్లు చెలరేగాయి. మర్నాడు ఒక వార్త దావానలంలా వ్యాపిం చింది. కత్వాల్‌ నుంచి వస్తున్న కొందరు జాట్‌లపై ముస్లిములు దాడి చేసి చంపే శారని, శవాలను జౌలీ కాలవలో పడేశార న్నది ఆ వార్త.  ఈ  పుకారు లాంటి వార్త లఖ్‌బావిడీ గ్రామం  చేరుకుంది. ఆబిద్‌ ఈ విషయాన్ని  వివరిస్తూ ‘‘మమ్మల్ని కాపాడమని మేం బిల్లూ ప్రధాన్‌ ఇంటికి వెళ్ళాం. భయపడవలసిన అవసరం లేదని అతడు హామీ ఇచ్చాడు. మాలో కొందరు అతడి ఇంటి ఆవరణలో చేరుకున్నారు. కొందరిని వేరేవైపు పారిపొమ్మని చెప్పాడు.’’

బిల్లూ ప్రధాన్‌ ఇంటి ఆవరణలో చక్కగా పెంచిన తోట ఉంది. ఇంటి గుమ్మం వరకు   వరుసగా  గులాబీ మొక్క లున్నాయి. ఎడమవైపు మూడు ట్రాక్టరు ట్రాలీలు, కుడివైపు ఐదు బర్రెలు కట్టేసి ఉంటాయెప్పుడు. అతిధుల కోసం ప్రత్యేక మైనే గది ఉంది. అందులో మంచాలు, హుక్కా  ఏర్పాట్లతో పూర్తి జాట్‌ ఇల్లులా ఉంటుంది.  పెద్ద ఆవరణ ఉంది. అక్క డనే భయంతో చేరుకున్న వారందరూ గుమిగూడారు.

ఆబిద్‌ తల్లి, ఇంకా ఊరికి చెందిన మరో 30 మంది ఆ రోజు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. ఆబిద్‌ తన తాతగారు, పినతండ్రి ఇంకా మరో 50మందితో కలిసి ప్రధాన్‌ చెప్పిన సురక్షిత మార్గంవైపు బయలుదేరారు. కాని వారికి దారిలో ఒక పెద్ద గుంపు కాపుకాసి ఉందని తెలియదు. ‘‘తాతయ్య, పినతండ్రి ఇద్దరిని నా కళ్ళ ముందే చంపేశారు.  నేను, మా నాన్న ఇతరులతో  కలిసి  ప్రాణాలు కాపాడుకో డానికి చెరకుపొలాల్లోకి పరుగెత్తాం. ఆబిద్‌ ఆ అమానుష సంఘటనలను గుర్తు చేసుకుంటూ ‘‘నేను పోలీసులను మొబైల్‌ నుంచి ఫోన్‌ చేసి పిలిచాను. కాని వారు 12.30ని.కు  వచ్చారు.  అంటే పిలిచిన నాలుగు గంటల  తర్వాత అంతా ముగి సిన తర్వాత. అక్కడ మా ఊరికి చెందిన 80 మందిని చంపేశారు.’’ అని తెలిపాడు. ఆబిద్‌  తాతగారి శవం సెప్టెంబర్‌ 8వ తేదీనే  దొరికింది. అతడి తల్లి శవం, దుస్తులు లేకుండా, అత్యంత ఘోరంగా ముక్కలై దొరికింది. పేడకుప్పల మధ్య దొరికింది.  ఆ రోజునే ఆబిద్‌, అతడితో పాటు  మిగిలిన వారు దేశరాజధానికి 40 కి.మీ.దూరంలో, ఘాజియాబాద్‌ జిల్లాలో ఉన్న పునరావాస శిబిరానికి బయలు దేరారు.

ఆబిద్‌ ప్రకారం  ఎంతమంది చనిపోయా రన్నది చెప్పడం కష్టం. షామ్లి, ముజఫర్‌ నగర్‌ జిల్లాల్లోని 16 పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న  బాధితుల  కధనాలు మానవత్వం సిగ్గుపడే అమానుషత్వాన్ని చాటి చెబుతున్నాయి.

కంథాలా గ్రామంలోని ఈద్గా శిబిరానికి మేం చేరుకున్నప్పుడు వర్షం కురుస్తోంది. ఈ ఊరిలో ముస్లిముల జనాభా ఎక్కువ. స్థానికుల విరాళాలతో ఈ శిబిరం నడు స్తోంది. మస్జిదు ఆవరణలో విరాళాలుగా వచ్చిన దుస్తుల గుట్టలు వర్షపునీటిలో తడుస్తున్నాయి.  అల్లర్లకు గురైన గ్రామా ల్లోని దాదాపు 12000 మంది ఇక్కడ ఆశ్రయం  పొందారు. మదరసాలోని గదులు  చాలకపోతే వారి కోసం టెంట్లు వేశారు.  కాని టెంట్ల నుంచి కారుతున్న వర్షపు నీటిలో వారు తడుస్తునే ఉన్నారు.

మొదటి  రెండు అంతస్తుల్లో మహిళ లున్నారు. అక్కడ కొంతమంది ముసలి మహిళలతో కూర్చుని ఉంది షబానా. లక్‌బావిడికి చెందిన 30 ఏళ్ల మహిళ. ఆమెముఖం ఎడమవైపున నల్లగా కమిలి పోయిన పెద్ద గుర్తు. శిబిరంలో డాక్టరు ఇచ్చిన మందులు తీసుకుని అక్కడ కూర్చుని ఉంది. ఆమె చుట్టు ఉన్న మహి ళలు ఆ మందులు తినమని చెబుతు న్నారు. ఆమెకేం జరిగిందో తెలుసా? ఆమె ఇల్లు కాల్చేశారు. మూడు బర్రెలు కాలి పోయాయి. ఇద్దరు కుమారులు ఏమై పోయారో ఆచూకీ లేదు. అలసిపోయిన స్వరం నుంచి మాటలు రావడం లేదు. ఆమె అసలు పేరేమిటి? ఆమె కుమారుల పేర్లేమిటి? అసలేం జరిగింది? ఆమె ఎలా తప్పించుకుంది? ఈ ప్రశ్నలకు ఆమె నుంచి జవాబు లేదు. బీభత్సం ఆమె కళ్ళలో ఇంకా గూడుకట్టుకునే ఉంది. ఒకే మాట నా బర్రెలు కూడా కాలిపోయాయి. గంట సేపు ఆమెను అనునయించి అడి గిన తర్వాత జరిగినదేమిటో వివరించింది.

‘‘వాళ్ళంతా   పొద్దుట  8  గంటలకు వచ్చారు. దాదాపు  20 మంది ఉంటారు. నేను వంట చేసుకుంటున్నాను. నా భర్త చాకలి.  పనికి  వెళ్ళడానికి సిద్ధమవుతు న్నాడు. వాళ్ళు  వస్తున్న కేకలు అరుపులు విని నేను నా భర్త పిల్లలను తీసుకుని పారిపోయాం. మేము బిల్లూ ప్రధాన్‌ ఇంటి వైపు పరుగెత్తాం. మా ఇల్లు తగలబడి పోవడాన్ని పరుగెత్తుతూనే చూశాం.’’ అని చెప్పింది. ఈ గందరగోళంలో ఆమె ఇద్దరు పిల్లలు తప్పిపోయారు. వారిద్దరు బిల్లూ ప్రధాన్‌ ఇంటికి చేరగానే లోపలికి వారిని లాక్కున్నారు. అరగంట కూడా గడవక ముందే, ఊరికి చెందిన కొందరు పురు షులు  లోపలికి  జొరబడ్డారు. లోపల ఆశ్రయం  కోసం వచ్చిన వారిపై దాడి చేశారు.  ‘‘నా భర్తను నా ముందే నరికేశారు.’’ అంది ఆమె. ఆమెపైన దాడి జరిగిందా? చాలా సార్లు అడిగిన తర్వాత మాలో  చాలా మంది దుస్తులు వలి చేశారు.  మానభంగాలకు పాల్పడ్డారని చెప్పింది.

మహిళలను దుడ్డుకర్రలతో చావబాదారు. ఆ  తర్వాత  వారి బట్టలిప్పి రాక్షసంగా సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. మగవారిని అమానుషంగా నరికేశారు. ఒక గంట తర్వాత మహిళలను నగ్నంగానే బయటకు గెంటేశారు.

‘‘నేను ఇతర మహిళలతో కలిసి ఒక ఇంటి చాటున దాక్కున్నాను.  ఆ  తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. ఈ శిబిరం లోని ఒక మనిషి తన కుర్తా నాకివ్వడం మాత్రమే గుర్తుంది. అతను ఇక్కడేఉండ వచ్చు.’’ అంటూ ఆమె చుట్టూ చూసింది.

ఖాంద్లా బ్లాక్‌ మునిసిపల్‌ చైర్మన్‌ హాజీ వజీద్‌ హసన్‌  పంపిన  ట్రాలీల్లో వారు ఆమెను కాపాడారు.  ఖాంద్లాకు చెందిన ఖుర్షిదా మాట్లాడుతూ  వారి ఒంటిపై దుస్తులే లేవు. మేము చుట్టుపక్కల ఇండ్ల నుంచి దుస్తులు పోగు చేసి ఇచ్చాము. షబానా ఇద్దరు కుమారులు, 5వ తరగతి, 2వ తరగతి చదువుతున్న వాళ్ళు మూడు నెలల నుంచి ఆచూకీ లేదు.

ఒక్క షబానా మాత్రమే కాదు, ఇలాంటి అమానుషాలకు గురయిన వారు చాలా మంది ఉన్నారు. 40 ఏళ్ళ సాబ్రా కూడా లక్‌బావుడీ  నుంచి  ఈద్గా శిబిరానికి వచ్చింది. ఆ  రోజున  వారు కూడా బిల్లు ప్రధాన్‌ ఇంటనే ఆశ్రయం పొందారు. వారి కోసం వాహనం ఏర్పాటు చేయడానికి పెద్ద కొడుకు బయటకు వెళ్ళాడు.ఆమె భర్త క్షయరోగి. గ్రామపెద్దగా బిల్లూ ప్రధాన్‌ రక్షణ కల్పిస్తాడనుకున్నామని, ఆ ఇంటికి వెళ్ళిన 15 నిముషాల్లోనే దాడి జరిగింది. మహిళలను కూడా కొడవళ్ళతో నరికారు. 12 సంవత్సరాల ఆమె కుమార్తెపై అత్యా చారానికి   పాల్పడ్డారు.  ఆమె పెద్ద కుమార్తెను నేలపై పడవేసి అనేకమంది మానభంగానికి పాల్పడ్డారు. చిన్న కుమార్తె మర్మాంగాలపై దుడ్డుకర్రతో కొట్టడంతో రక్తస్రావం  కాసాగింది.  అలాగే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.   వారక్కడి నుంచి బయటపడి  ఖాంద్లా చేరుకున్న తర్వాత అక్కడ స్వచ్ఛంద కార్యకర్తలు వారిని కాపాడారు.

ముజఫర్‌ నగర్‌ జిల్లాలోని గంగేరులో అరబియా ఇస్లామ్‌ హుద్రూ ఇస్లామ్‌ మదర సాలో వారికి పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలపై సామూహిక అత్యాచా రాలు జరిగాయని  ఎవరూ బయటకు చెప్పడానికి సాహసించడం లేదని తెలు స్తోంది.

ం ం ం

చెరకు పొలాల్లో అర్ధనగ్నంగా అత్యంత దారుణమైన స్థితిలో కుళ్ళిన మహిళ శవం దొరికిన  తర్వాత  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమీషన్‌ చైర్‌ పర్సన్‌ జరీనా ఉస్మానీ సామూహిక అత్యాచారాలు జరిగా యని నిర్ధారిస్తూ, మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని ఒక బహిరంగ లేఖ రాశారు. బాధిత మహిళల్లో చాలా మంది బలహీనవర్గాలకు చెందిన వారు. వారిని బెదిరించి నోరు మూయి స్తున్నారని ఆమె అన్నారు. కాని ఉత్తర ప్రదేశ్‌ హోం సెక్రటరీ మాత్రం పోలీసు లకు అత్యాచారాల కేసులేవీ రాలేదని, కేసులు రాకుండా పోలీసులు ఏమీ చేయ లేరని సెలవిచ్చాడు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *