నమ్మిన వారికి నమ్మినంత

మనిషిని నమ్మితే ఏముందిరా!
మబ్బును నమ్మినా ఫలితముందిరా!!
మానవుని జీవితంలో నమ్మకం అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నమ్మకం ఉన్నవాడే జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలడు. ఒక వ్యక్తిని నమ్మినా లేక ఒక శక్తిని నమ్మినా, ఒక సమాజాన్ని నమ్ముకున్నా ఆఖరికి తనను తాను నమ్ముకున్నా నమ్మకమనేది మనిషి ధృడ నిర్ణయంపై ఆధారపడి వుంటుంది తప్ప మరేమీలేదు.

కనుక మనిషి ప్రతి చిన్న విషయాన్ని కూడా అల్పమైనదిగా భావించకూడదు. ఉదాహరణకు ఒక భార్య తన భర్తను నమ్ముతుంది. తన భర్త తనను ఆదరిస్తాడని, తనను తన సంతానాన్ని జీవితాంతం పోషిస్తాడని నమ్ముతుంది.geeturai_weekly_23_1

అదేవిధంగా ఒక విద్యార్థి తాను సాధించబోయే డిగ్రీని నమ్ముకుంటాడు, ఒక బానిస తన యజమానిని తన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలడని నమ్ముతాడు. ఒక యజమాని తన బానిసను యజమాని యొక్క హక్కులను నెరవేర్చగలడని నమ్ముతాడు.

అదేవిధంగా ఒక సమాజం ఒక వ్యవస్థను నమ్ముకుంటుంది. ఇలా ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటున్నారంటే ఒకరికి వేరొకరిపై గల నమ్మకమే కారణం.
అయితే ఈ ప్రపంచంలో ఎందరో కాకున్నా కొందరు మాత్రం ఎవరిని నమ్మరు, దేన్నీ విశ్వసించారు. అంతేకాకుండా వాళ్ళు తమను తామే నమ్మరు. తమలో ఉన్న శక్తియుక్తులను కూడా విశ్వసించరు. చివరికి తమ నీడను కూడా అనుమానించే అనుమానపు పక్షులు వీరు. ఇలాంటి వారు జీవితంలో ఏదీ సాధించలేరు. భవిష్యత్తు లోకంతోపాటు ముందు సాగలేదు. వారి జీవిత కాలం ఇట్టే కరిగిపోతుంది. ుఱఎవ aఅస ుaఱసవ చీశీ షaఱ్‌ టశీతీ చీశీఅవ అన్నాడు ఒక ఆంగ్ల కవి. ఇలాంటి వారు ఇహలోకంలోనే కాదు పరలోకాన్ని కూడా పొందలేరు. అంటే (మానవుని కోసం దైవం సృష్టించిన స్వర్గాన్ని పొందలేరు). దైవగ్రంథమైన దివ్యఖుర్‌ఆన్‌లో దైవం (అల్లాప్‌ా) ఈవిధంగా తెలియజేస్తున్నాడు. ‘కాలం సాక్షిగా! మానవుడు అపార నష్టంలో పడివున్నాడు. వారు తప్ప ఎవరయితే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో’ (దివ్యఖుర్‌ఆన్‌ 103 :1)

విశ్వసించడం అంటే నమ్మటం దేనిని నమ్ముకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. విశ్వసించవలసింది ఇహలోకాన్ని కాదు పరలోకాన్ని. అల్లాప్‌ాను అంతిమ దినాన్ని విశ్వసించాలి. అలా విశ్వసించనివారు పరలోకంలో కటిక పేదవాడుగా గుర్తించబడతాడు. దైవప్రవక్త(స) ఇలా అన్నారు : ‘మీరు సిరిసంపదల రీత్యా భాగ్యవంతులైనప్పటికీ విశ్వాసం రీత్యా చాలా పేదవారుగా ఉంటారు.’ (తిర్మిజి)

పరలోక విషయం ఎంత చిన్న కానుకనైనా ఎంతోగొప్పదిగా భావించాలి. దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏ విషయాన్నైనా గడ్డి పరక సమానంగా భావించరాదు.
దైవప్రవక్త(స) హితోక్తి ప్రకారం ‘విశ్వాసంలో డెబ్బై అంశాలు ఉంటాయి. అందులో చిట్టచివరిది దారిలో నుంచి చిన్న ముల్లును తొలగించడం.’
ఇంకా దివ్యఖుర్‌ఆన్‌లో ఈవిధంగా ఉంది : ‘ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నాసరే దాన్ని అతను చూసుకుంటాడు.’ (దివ్యఖుర్‌ఆన్‌ 99: 8)

ఈ సందర్భంలో సూక్ష్మమయినదే కదా అని స్వర్గం అందమైన భవనాన్ని కోల్పోయి చక్రవర్తి యొక్క వృత్తాంతం చూడండి :
ఒకానొక్కప్పుడు హారూన్‌ రషీద్‌ అనే ముస్లిం చక్రవర్తి ఉండేవారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ సత్కార్యాలు చేస్తుండేవాడు. అందులోని భాగంగా కొన్ని యోజనాల పొడుగులో ఒక భారీ పంట కాలువలను తవ్వించాడు. ఆ పంటకాల్వల కింది పొలాలు సశ్యశ్యామలమై అపూర్వ పంట దిగుబడి వచ్చేది. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేవారు.
ఒకరోజు సతీసమేతుడై విహారానికి బయలుదేరాడు. ఆహ్లాదకరమైన వాతావరణం, భార్యాభర్తలిరువురూ ఆ పంట కాల్వ పక్కనుండి విహరిస్తున్నారు. అక్కడ వారికి చక్రవర్తి సన్నిహితుడైన ఒక వ్యక్తి కాల్వ పక్కన ఇసుక తిన్నెపై కూర్చొని చిన్న చిన్న గృహాలను ఇసుకతో నిర్మిస్తున్నాడు. అతన్ని ఉద్దేశించి చక్రవర్తి ఇలా అన్నారు : మిత్రమా! ఏమిటి నీవు చేస్తున్న పని అని అడిగాడు. దానికి అతను సమాధానంగా ‘నేను పరలోకంలోని స్వర్గధామాలను నిర్మిస్తున్నాను. నమ్మకముంటే ఎవరైనా కొనుక్కోవచ్చు’ అని అన్నాడు. ‘దాని ఖరీదెంత’ అని చక్రవర్తి అడిగాడు. దానికి అతను ‘కేవలం ఒక్క దిర్హం మాత్రమే’ అని అన్నాడు.

ఆ మాట విన్న చక్రవర్తి ‘కేవలం ఒక్కదిర్హంకు స్వర్గధామం లభిస్తుందా’ అని పరిహసిస్తూ ముందుకు సాగిపోయారు.
కాని చక్రవర్తి పట్టపురాణి (శ్రీమతి) నాకొక స్వర్గధామం ఇవ్వండి అని ఒక్క దిర్హం చెల్లించింది. ఆ తర్వాత వారిద్దరు రాజభవనానికి చేరుకున్నారు.
ఆరోజు రాత్రి చక్రవర్తి హారూన్‌ రషీద్‌కు తన భార్య స్వర్గంలోని అందమైన భవనంలో ఉన్నట్లు కలగన్నాడు.
మరునాడు సాయంత్రం కాల్వ పక్క ఇసుక తిన్నె వద్ద ఉన్న తన సన్నిహితుని వద్దకు వెళ్ళి తన ‘స్వప్న’ వృత్తాంతాన్ని తెలిపి తనకు కూడా ఒక స్వర్గధామాన్ని అమ్మవలసిందిగా కోరాడు. కాని ఆయన సన్నిహితులు ఇలా అన్నాడు : చూడు మిత్రమా నిన్న నేను ఇస్తానన్నప్పుడు నీకు నమ్మకం కుదరలేదు కనుక నీవు తిరస్కరించావు. ఈ రోజు నీవు లక్ష దిర్హం వెచ్చించి నా ఆ స్వర్గధామాన్ని పొందలేవు’ అన్నాడు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *