నలందాను దహనం చేసింది ముస్లిములు కాదు బ్రాహ్మణులు

ఈ అంశం వినేవారికి  చాలా  ఆశ్చర్య కరంగా ఉండొచ్చు.  చరిత్రను వక్రీకరించి రాశారనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. బయటవాళ్ళు  సరే,  బౌద్ధులు కూడా బౌద్ధంపై  దాడి చేసింది  ముస్లింలేనని బలంగా నమ్ముతున్నారు. ఇది వారి అవ గాహనా లేమికి, చరిత్రపై వారికున్న అవగా హనకు  నిదర్శనం. బ్రాహ్మణులు చేసిన ఘోరాన్ని తెలివిగా  ముస్లింలపైకి నెట్టారు. ఇదే నిజమని  నమ్ముతూ  వస్తున్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచనలు` ప్రసంగాలు: సంపుట:3లో విప్లవం` ప్రతి విప్లవం అనే చాప్టర్‌ను  చదివితే ఎవరు ఎవరి మీద దాడులు  చేశారో స్పష్టంగా వివరించారు. ప్రచారమవుతున్న అసత్యాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా వాస్తవాలను జీర్ణిం             చుకునే శక్తి కావాలి. నలందాను దహనం చేసింది  ముస్లింలేనని  చరిత్ర పుటల నిండుగా  దండిగా  రాసుకొచ్చారు. ఇదే నిజమని ఇండియాతోపాటు అన్ని దేశాలు నమ్ముతూ వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నలందా దాడి వెనుక అసలు రహస్యాలేమిటి? వాటికి నిదర్శనాలేమిటి? ఒక పరిశోధనాత్మక కోణంలో పరిశీలిద్దాం.
మహా చక్రవర్తయిన అశోకుని కాలంలో భారతదేశంతోపాటు ప్రాచీన ఆసియా ఖండమంతా బౌద్ధం పూర్తిస్థాయిలో అభి వృద్ధి  చెందింది.  మరీ ముఖ్యంగా కని ష్కుని కాలంలో  ఆయన కృషి ఫలితంగా ఆఫ్గనిస్తాన్‌, తురుకిస్తాన్‌, పాకిస్తాన్‌, బామి యాన్‌, కాబూల్‌ ప్రాంతాలు ప్రపంచం గర్వించదగ్గ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలుగా కీర్తిగాంచాయి.   ప్రపంచ దేశాలను ఇండియాతో అనుసంధానం చేసే ప్రాంతా లివి.  ఒక  రకంగా అంతర్జాతీయ బౌద్ధాని కివి  ముఖ్య  కేంద్రాలుగా భాసిల్లాయి. బౌద్ధానికి గల ఈ కీర్తి తొమ్మిదవ శతాబ్ది వరకు మాత్రమే నిలిచింది.

12
క్రీ.శ. 9వ శతాబ్దంలో బ్రాహ్మిణ్‌ మంత్రి అయిన  ‘కాల్లర్‌’ (కులుషా)  ఆఖరి బౌద్ధ రాజైన  ‘లాగతుర్మన్‌’ను  ఓడిరచి బౌద్ధ రాజ్యాన్ని నేలకూల్చి  శైవిజంగా  మార్చి బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించాడు. శంకరా చార్యునికి  స్వయానా  అనుచరుడైన కులుషా వేల సంఖ్యలో బౌద్ధులను అంత మొందించాడు. లెక్కకు మించిన బౌద్ధ మొనాస్ట్రీలను, స్థూప చైత్యాద్రులను, వందల మీటర్ల ఎత్తు గల బంగారు బుద్ధ విగ్రహాలను నేలకూల్చాడు. ఇదే కాలంలో వండలిజం  వచ్చి బామియాన్‌, గార్దెజ్‌, లాగ్మహాన్‌,  ఇతర ప్రాంతాలలో గల బౌద్ధ నిర్మాణాలు కూల్చివేతకు గురయ్యాయి.
ఈ సమయంలో బ్రాహ్మణుల అట్రాసిటీస్‌ నుంచి బౌద్ధులు అతికష్టం మీద తమకు తాము రక్షించుకున్నారు. చాలామంది బౌద్ధులు ఈ అట్రాసిటీస్‌ను భరించలేక ‘లిబియాన్‌ కరామి’ అనునాయులుగా మారిపోయారు.  కరామి  అనేది స్థానిక ముస్లిం  ‘సూఫీపిర్‌’.  వీరిని ‘కరామీస్‌’ అనేవారు. తామ్రపుష్పపు పీఠంపై బుద్ధ విగ్రహాన్ని, అల్లా విగ్రహాన్ని వీరు స్థాపించే వారు.  పురావస్తు  శాఖకు ఇటువంటి శిల్పాలు చాలానే దొరికాయి. కరామిసెక్ట్‌ అనేది సగం బుద్ధిజం, సగం ఇస్లాంతోను వుండేది. ఇది బుద్దిజానికి` ఇస్లాంకి మధ్య వారధిలా వారిద్దరి మనోభీష్టాలను పంచు కునే ‘ఘుర్‌’  జీవితంలో  గొప్ప ప్రాముఖ్య తను సంతరించుకున్నది. మహ్మద్‌ గజని, క్యుసేడర్‌లు  ఈ  కరామిసెక్ట్‌కు చెందిన వారే.
అల్‌  బెరూని  గ్రంథంలో  చెప్పిన  దాని ప్రకారం   క్రీ.శ.  950  కాలం  నాటికి బ్రాహ్మిణ్‌ సాహి రాజ్యానికి  ఎదురులేదు. కాబూల్‌  మాత్రం  మొత్తంగా బుద్ధిజం నుండి ఇస్లాంగా  మారిపోయింది. బ్రాహ్మ ణుల అట్రాసిటీస్‌  దీనికి కారణం. 50 సంవత్సరాల అనంతరం సుల్తాన్‌ మహ్మద్‌ గజనీ ఇండియాలో  తన  క్యాంపెయిన్‌ ప్రారంభించాడు.   ఇతను   కరామిసెక్ట్‌ నాయుడు. కాబట్టి   ఇతనికి  ఇండియన్‌ బ్రాహ్మిణ్స్‌ అంటే విపరీతమైన ద్వేషం             ఉండేది. మహ్మద్‌ గజని అసలు పేరు తిలక్‌ (తిలాకా) ఇతని తండ్రి పేరు జయసేన్‌ (జయసేన). ఇతను కాశ్మీర్‌లోని బుద్ధిస్ట్‌ మొనాస్ట్రీస్‌ విద్యనభ్యసించి బౌద్ధుడుగా మారిపోయాడు.
మహ్మద్‌  గజనీ  యొక్క  దాడులు ఇండియాలో క్రీ.శ. 1011` 1020 మధ్య జరిగాయి. మరీ ముఖ్యంగా హిందువుల పవిత్ర స్థలాలైన జావాముఖి, మధుర, సోమనాథ్‌ దేవాలయాలపై దాడిచేసి వారి ఆధ్యాత్మిక చిహ్నాలను దెబ్బతీశాడు. బ్రాహ్మ ణుల  మీద  పగ తీర్చుకోవడమే గజనీ లక్ష్యం. భారతదేశానికి చారిత్రక, సాంస్కృ తిక, ధార్మిక కేంద్రాలైన బౌద్ధ కట్టడాలపై బ్రాహ్మణులు ఘోరమైన దాడులు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణుల ప్రధాన కేంద్రాలపైన, వారి దైవిక దేవాల యాలలో నిలువ చేసిన సంపదపై దాడి చేశాడు. బౌద్ధ చైత్యాలను దేవాలయాలుగా మార్చుకుని బ్రాహ్మణులు మోటువాని వలె అమర్యాదపూర్వకంగా వాటిని నాట్యం, మత్తుపానీయాలు, వ్యభిచారం, స్త్రీలపై బలత్కారాలు వంటి అంశాలకు కేంద్రా లుగా మార్చేశారు. ఇండియాలో, అరబిక్‌ దేశాలలోగల అధికశాతం ముస్లింలు కన్వర్ట్‌ అయిన తొలి తరం బౌద్ధులు. అందుచేత ఇండియా   బ్రాహ్మణులంటే  గజనీ ప్రత్యక్షమైన ఆగ్రహాన్ని ప్రదర్శించేవాడు. ఈ కారణం చేతనే ఇండియాలో ముస్లిం సైనికులు నిరంతరాయంగా బ్రాహ్మణుల ఆధ్యాత్మిక స్థలాలపై దాడులు చేస్తుండే వారు. ఇందులో భాగంగానే  కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢల్లీిలో 27  బ్రాహ్మణ,  జైన దేవాల యాలపై దాడులు చేసి  ఆ  సామాగ్రితోనే కుతుబ్‌ మినార్‌ను నిర్మించాడు. కుతుబ్‌ మినార్‌ నిర్మాణం బ్రాహ్మణులను అణిచి వేసిన పాఠాలు  నేర్పుతుంది. అంతేగాని బౌద్ధ  కట్టడాలను  అతను పాడుచేయ లేదు. ఎందుకంటే అప్పటికే వాటిని బ్రాహ్మ ణులు నాశనం చేశారు.
బౌద్ధుల  మీద,   ముస్లింల మీద బ్రాహ్మ ణులు,  వారి  మేధావులు, రచయితలు ఎలా ప్రచారం  చేశారంటే ‘ఇండియాలో బుద్ధిజం వెనుకబడిపోవటానికి ప్రధాన కారణం  ముస్లిం  దండయాత్రలే’నని ప్రచారం చేశారు. ఇండియాలో బుద్ధిజం క్షయ మొందడానికి ప్రధాన కారణం బ్రాహ్మణులేనన్నది వాస్తవం. ముస్లింలు ఇండియాకు  రావడానికి 200 సంవత్స రాల ముందే బ్రాహ్మణులు ఇండియాలో బుద్ధిజాన్ని  నాశనం  చేశారు. ముస్లిం దండయాత్రికులు ఇండియాకు వచ్చింది క్రీ.శ.1011లో, బ్రాహ్మణ శంకరాచార్యుడు, బ్రాహ్మణ టెర్రరిస్ట్‌లు ఇండియన్‌ సబ్‌కాన్షియెంట్‌ (నేపాల్‌` ఇరాన్‌, ఇరాక్‌) నుంచి బుద్ధిజాన్ని సమూలంగా నాశనం చేసింది క్రీ.శ 820లో, అంటే ముస్లింలు రావడానికి 200 సంవత్సరాలు ముందే ఇండియాలో బుద్ధిజాన్ని బ్రాహ్మణులు తుదముట్టించారు. వాస్తవాలు ఇలా వుంటే కొంతమంది  బ్రాహ్మణ  స్కాలర్స్‌ క్రీ.శ. 1296లో భక్తియార్‌ ఖిల్జీ నలందాపై చేసిన దాడిని ఉదాహరణగా చూపించారు. ఇదే నిజమైతే ఈనాటికి బ్రాహ్మణులు బౌద్ధంపై విరుచుకుపడుతూనే ఉన్నారు.
నలందాపై ఖల్జీ  దాడి  చేశాడని చరిత్ర నిండా అబద్ధాలను పుంఖానుపుంఖాలుగా రాశారు. ఖిల్జీ  నాటికి నలందా విశ్వవిద్యా లయంలో తంత్రయానం జనిస్తున్న సమయం 99శాతం బ్రాహ్మణులు భిక్షు వుల వేషంలో ఉన్నారు. ఈ వాస్తవం పట్ల ఖిల్జీ చాలా అప్రమత్తంగా ఉన్నాడు. నలందాలోని ఈ నయవంచక బ్రాహ్మణు లను తరిమివేసి నిజమైన భిక్షువులను, నలందాను రక్షించాలని  ఖిల్జీ తీవ్రమైన పట్టుదలతో  వున్నాడు.  ఇందుకోసమే నలందా మీదకు దండెత్తాడు. అంతేగానీ నలందాను అతను దహనం చేయలేదు. ఖిల్జీ తమపైకి దండెత్తి వస్తున్నాడని గ్రహిం చిన బ్రాహ్మణులు దీనిని మంచి అవకా శంగా తీసుకొని నలందా గ్రంథాలయానికి నిప్పును ఎగతోశారు. నలందాను చిన్నా భిన్నం చేసి భిక్షువులను ఊచకోత కోశారు. బౌద్ధ విజ్ఞాన సర్వస్వాన్ని అగ్నికి ఆహుతి చేశారు. అత్యంత కిరాతకమైన ఈ ఘోరాన్ని బ్రాహ్మణులు తెలివిగా ఖిల్జీ (ముస్లింల) మీదకు నెట్టారు.  నలందా  విధ్వంసం పాపాన్ని ముస్లింల  మీదకు నెట్టి తాము పవిత్రులుగా చరిత్రను నమోదు చేశారు.
కొన్ని శతాబ్దాల పాటు ఈ ప్రపంచానికి అత్యున్నత  విద్యను అందించి ప్రపంచ దేశాలలో  మొట్టమొదటి ప్రాచీన విశ్వ  విద్యాలయంగా కీర్తి శిఖరాలను అందు కొన్న నలందా విశ్వవిద్యాలయం బ్రాహ్మ ణుల  దాష్టీకానికి  నిలువెల్లా బూడి దయింది.  కొన్ని  వందల హెక్టారుల స్థలంలో  వ్యాపించిన నలందా బౌద్దుల విజ్ఞాన  పిపాసకు నిలువెత్తు సాక్ష్యం. బుద్ధుని తత్వం జ్ఞాన సముపార్జనలో ఉందిగాని వైదిక క్రతువుల్లో అజ్ఞానంలేదు. విజ్ఞానమే సర్వశక్తివంతమైనదని నినదిం చిన బౌద్ధాన్ని బ్రాహ్మణులు తమ కసాయి కత్తులకు బలిచేసి మహా పాపానికి ఒడిగట్టారనేది నిజం.
తొలి తరం బౌద్ధులపై బ్రాహ్మణులు చేసిన అకృత్యాలను దృష్టిలో ఉంచుకొని బ్రాహ్మ ణుల మీద పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ఇండియాలో జరిగిన ఇస్లామిక్‌ దాడుల ప్రధాన లక్ష్యం. బ్రాహ్మణుల ఘోరకలిలో బలవుతున్న బౌద్ధులను రక్షించి బ్రాహ్మణు లకు గుణపాఠం చెప్పడానికే ఇండియాలో అఫ్గనిస్తాన్‌, సిందు, కాబూల్‌, అరబిక్‌ లాండ్‌లలో ముస్లిం దాడులు చేశారు. ఈ వాస్తవాలను  మరుగున  పరిచి బౌద్ధం వెనుకబడడానికి ముస్లిం దాడులేనని చరిత్రనునమోదు చేయడం అదే నిజమని మేధావులు సైతం వ్యాఖ్యానించడం దురదృష్టకరం. శత్రువుని గుర్తించలేని వాడికి యుద్ధంలో పరాజయంతప్పదు. ఇండియాలోబౌద్ధాన్ని పున:ప్రతిష్ట చేయా లనుకునేవారికి వ్యూహంతో పాటు శతృ వుల పట్ల అప్రమత్తత కూడా అవసరమే.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *