పరిపూర్ణ ఆరోగ్యానికి…. ప్రవక్త(స) వారి ఆచరణ

అల్లాప్‌ా మానవులకు  ప్రసాదించిన అను గ్రహాల్లో మహోన్నతమైన,  మహత్తరమైన వరం ‘ఆరోగ్యం’. అంతేకాదు ఇది ఆయన అమానతు కూడా! దీన్ని పరిరక్షించుకోవడం లోనే  మానవుల  ఇహపర సాఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.  ఆరోగ్యం  పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని దైవప్రవక్త ముహమ్మద్‌(స)  ఉపదేశించారు. దానికోసం ఆయన(స) అనేక చికిత్సా విధానాలను  సూచించారు.  మానవ జీవితానికి అసలు  ఊపిరి  బుద్ధీ వివేకాలు, నీతి నడవడిక, చైతన్యం విశ్వాసాలే. ఇవి సక్రమంగా ఉండా లంటే  శారీరక  ఆరోగ్యస్థితి బాగుం డాలి. బుద్ధీవివేకాల వికాసం, నీతి రీతుల  ఆచరణ, ధార్మిక విధుల నిర్వహణ  వీటన్నిటికీ శారీరక ఆరోగ్యం పునాది లాంటిది. బలహీన మైన, వ్యాధిగ్రస్తమైన దేహంలో బుద్ధీ వివేచనలు కూడా బలహీనంగానే ఉంటాయి.

మానవుడు  ఈ  ప్రపంచంలో  లక్ష్య రహితంగా పుట్టించబడలేదు. మానవ జీవితానికో  ఉద్దేశ్యం,  లక్ష్యం ఉన్నాయి.  దేవుని ప్రతినిధిగా మనిషి ఈ ప్రపంచంలో  తన బాధ్యతలను నిర్వహిం చాల్సి ఉంది. దైవ ప్రాతినిధ్య బాధ్యతల నిర్వహణ కోసం ఆధ్యాత్మిక శక్తితోపాటు శారీరక  బలం కూడా కావాలి. బుద్ధీ వివే కాల్లో  జీవం ఉండాలి.  ఉరకలు వేసే               ఉత్సాహంతో జీవితం నిత్య ప్రవాహినిలా కళకళ  లాడుతూ  ఉండాలి.  ఆరోగ్య వంతులైన ప్రజల ద్వారానే సజీవ జాతులు ఉద్భవిస్తాయి. ఇలాంటి జీవజాతులే జీవన రంగంలో  అపూర్వ  త్యాగాలు చేసి శిఖర స్థానాలను పొందుతాయి. జీవన విలువల్ని ప్రపంచానికి చాటిచెబుతాయి.geeturai_weekly_14

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న నానుడి అనాదిగా  మనం  వింటూ వస్తున్నాం. ఏమున్నా లేకపోయినా ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే అని భావిస్తాం. ఇది నూటికి నూరు శాతం నిజం.  కాని ఆచరణలో కొచ్చేసరికి ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాం. దీనిక్కారణం, యాంత్రికంగా మారిన నేటి మన  జీవనవిధానం . ఆధునికజీవన శైలి మనిషిని ఒక  సజీవ  యంత్రంగా మార్చి వేసింది.   దీన్నుండి  బయట పడడానికి మానవుడు  ఎన్నో  ప్రయత్నాలు, ప్రయో గాలు చేస్తున్నాడు.

మానవుల  మానసిక,  శారీరక వ్యాధుల నివారణకు ఆధునిక వైద్యశాస్త్రం అద్భుత మైన ఆవిష్కరణలు చేసింది.నేటికీ చేస్తూనే ఉంది. మానవుల ఆరోగ్య పరిరక్షణ విష యంలో ఆధునిక వైద్య విధానం మంచి ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పవచ్చు. కాని పరిపూర్ణతను సాధించిందని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ప్రపంచ మానవారోగ్య సూచీని చూస్తే మనకీ విషయం తెలుస్తుంది.

అయితే  నేటికీ దాదాపు వేయిన్నర సంవత్సరాలక్రితమే దైవప్రవక్త(స) మానవారోగ్య పరిరక్షణ విషయంలో అనేక ఆచరణాత్మక వైద్యవిధానాలను సూచించారు. పరిపూర్ణ ఆరోగ్యానికి పాటించవలసిన నియమాలతోపాటు వ్యాధి  మూలాలను  తెలిపి, దానికి తగిన చికిత్సా పద్ధతులను తెలియ జేశారు. నేటి మన ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం అబ్బుర పడే అత్యంత అద్భుత వైద్యవిధానాన్ని ప్రవక్త మహ నీయులు ప్రపంచానికి అందించారు. ఆ అద్భుత వైద్యవిజ్ఞాన ఆవిష్కరణ లను  ‘గీటురాయి’  పాఠకులకు అందించాలని  యాజమాన్యం భావిం చింది. ‘తిబ్బె నబవీ’ సౌజన్యంతో  ప్రముఖ రచయిత యం.డి. ఉస్మాన్‌ఖాన్‌ ప్రతి వారం ఈ ‘కాలమ్‌’ నిర్వహించనున్నారు.

వచ్చే వారం నుంచి వెలువడనున్న ఈ ‘కాలమ్‌’ దైవప్రవక్త(స) వారు స్వయంగా ఆచరించి, ఇతరులకూ సూచించిన అత్యద్భుతమైన వైద్యవిధానం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఇతోధిక సహాయ కారిగా నిలిచి, సమస్త మానసిక, శారీరక వ్యాధుల  నుండి  విముక్తం చేసి చక్కని ఆరోగ్యవంతమైన  సమాజానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నాం.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *