పలస్తీన శాంతి సాధ్యమా..?

క్రయిస్తవ ప్రపంచంలో అత్యంత ముఖ్య మైన ధార్మిక  నాయకుడు, పోప్‌ ఫ్రాన్సిస్‌ పలస్తీనా  పర్యటించారు.  పలస్తీనా అధ్య క్షుడు  మప్‌ామూద్‌  అబ్బాస్‌ ఆయనకు ఘనస్వాగతం  పలికారు. మరోవైపు ఐక్య రాజ్యసమితి కూడా ఇస్రాయీల్‌పై కాస్త కన్నెర్రజేసింది.  ఇస్రాయీల్‌ బైతుల్‌ ముఖద్దస్‌ను  వెస్ట్‌బ్యాంక్‌ను వేరు చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది. ఇది కుట్రపూరితమైన చర్యగా పేర్కొంది. నిజానికి  ఈ  మాటలు ఎప్పటి నుంచో పలస్తీనీయులు చెబుతున్నారు. బైతుల్‌ ముఖద్దస్‌ విషయంలో ఇస్రాయీల్‌ కుట్రల గురించి పలస్తీనా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. కాని పలస్తీనా ఆరోపణలను ఎవరూ   పట్టించుకోనేలేదు.  ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలతో పలస్తీనా ఆరోపణలకు బలం  చేకూరింది.   ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యల వల్ల  ఆచరణాత్మకంగా ఇస్రా యీల్‌ కుట్రలను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పలేం. కాని  పలస్తీనా విష యంలో  ఐక్యరాజ్యసమితి  వైఖరిలో మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ మార్పు కొత్త అధ్యయానికి తెర తీయ వచ్చు. ఐక్యరాజ్యసమితి అధికారాలేమిటో అందరికీ తెలిసినవే. ఆచరణాత్మకంగా ఐక్యరాజ్యసమితి స్వతంత్రంగా ఏ పనీ చేసే స్థితిలో లేదు. ఇటీవల ఇస్రాయీల్‌ చేపట్టిన చర్యలు కూడా గమనించదగ్గవి. ఐక్యరాజ్యసమితితో సహా అనేక దేశాల రాయబారుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ  ఇవ్వకుండా  ఇస్రాయీల్‌ ఏక పక్షంగా వ్యవహరించింది. ఇస్రాయీల్‌ను కట్టడి చేయడంలో ఐక్యరాజ్యసమితి దారు ణంగా విఫలమైంది. ఐక్యరాజ్యసమితి ఏం చేయగలదన్న   విషయంలో  ఎవరికీ ఎలాంటి భ్రమలు లేవు. ఇస్రాయీల్‌ విష యంలో  ఐక్యరాజ్యసమితి  నిష్క్రియా పరత్వానికి పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇస్రాయీల్‌ ఒంటెద్దు పోకడల విష యంలో నిన్నటి వరకు నోరు కూడా విప్పని ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఇస్రాయీల్‌ కుట్రల విషయంలో మాట్లాడడం కూడా గొప్ప పరిణామమే. geeturai_9

పలస్తీనాలో మానవహక్కులపై పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి   అనుబంధ  సంస్థ ఇటీవల చేసిన వ్యాఖ్య చాలా ముఖ్య మైనది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇస్రాయీల్‌ అనేక అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోంది. తూర్పు బైతుల్‌ ముఖద్దస్‌లో  పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడానికి గాను ఇస్రా యీల్‌ పూనుకుంది. అందుకోసం అక్కడ పలస్తీనీయుల  నివాసాలను ధ్వంసం చేస్తోందంటూ  ఐక్యరాజ్యసమితి అను బంధ సంస్థ  వ్యాఖ్యానించింది. ఇటీవల తూర్పు  బైతుల్‌  ముఖద్దస్‌లో అనేక పలస్తీనా  నివాసగృహాలను  ధ్వంసం చేయడం జరిగిందంటూ నివేదిక ఇచ్చింది. అంతేకాదు, యూదుల బస్తీల నిర్మాణానికి గాను పద్దెనిమిది నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారని, అవి పూర్తయిన తర్వాత రెండు వేల  ఎనిమిది  వందల యూదబస్తీలు తూర్పు బైతుల్‌ ముఖద్దస్‌లో వెలుస్తాయని ఆ నివేదిక తెలియజేసింది.

ఇస్రాయీల్‌  యూద  బస్తీల విస్తరణ కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితికి ఇప్పుడే తెలిసిన నిజాలేమీ కావు. ఇస్రాయీల్‌ ఈ చర్యలకు పాల్పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు బైతుల్‌ ముఖద్దస్‌లను విడదీయడానికి కుట్రపూరితంగా చేపట్టిన బస్తీల నిర్మాణ మిది. ఇంకా అనేక విస్తరణా కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇస్రాయీల్‌ బలవం తంగా పలస్తీనా పౌరులను గెంటేయడానికి, బలప్రయోగంతో యూదబస్తీలు నిర్మిం చడానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాలు శరవేగంగా  కొనసాగుతున్నాయని కూడా ఐక్యరాజ్యసమితి  అనుబంధ సంస్థ తెలియజేసింది.

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇస్రాయీల్‌ ఇంకా నోరిప్ప లేదు. కాని ఐక్యరాజ్యసమితిపై పరోక్షంగా దాడికి దిగింది. పలస్తీనా, ఇస్రాయీల్‌ల మధ్య శాంతి ప్రయత్నాలను భంగపరుస్తుం దంటూ ఒక ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థపై ఆగ్రహం వెళ్ళగక్కింది. పలస్తీనా నిర్వాసితుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ వ్యవహారశైలి ఇస్రాయీల్‌కు నచ్చడం లేదు. పలస్తీనా ప్రజలకు వారి హక్కులు ఇప్పిస్తామంటూ ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు కూడా ఇస్రాయీల్‌కు మింగుడు పడడం లేదు. ఇస్రాయీల్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆ సంస్థ వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.

ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ సంస్థలు ఇంతకు  ముందు  కూడా అనేకసార్లు ఇస్రాయీల్‌ దౌర్జన్యాలను, యూద బస్తీల విస్తరణకు  పాల్పడుతూ మానవహక్కు లను కాలరాయడాన్ని, పలస్తీనా వాసులపై అణిచివేతలను   వేలెత్తి  చూపాయి. ఇస్రాయీల్‌ దౌర్జన్యాలు కాని, బలవంతపు యూదబస్తీల నిర్మాణం ద్వారా విస్తరణా కార్యక్రమాలు కాని, స్వతంత్ర పలస్తీనా ఏర్పాటుకు సృష్టిస్తున్న అడ్డంకులు కాని, పలస్తీనా పౌరులపై పాల్పడుతున్న దాడులు కాని…  వాటికి  ప్రతిస్పందనగా అంతర్జాతీయంగా పలస్తీనా  పట్ల పెరుగు తున్న సానుభూతి  ఇస్రాయీల్‌కు మింగుడు పడడం లేదు. ఇస్రాయీల్‌ తన ఇష్టారాజ్యం చెలాయించాలనుకుంటోంది. అందుకు  విరుద్ధంగా  కనిపించే ప్రతి విషయంపై గగ్గోలు చేస్తోంది. పోప్‌ పలస్తీనా పర్యటన సందర్భంగా కూడా ఇస్రాయీల్‌ వైఖరి ఇలాగే ఉంది.

క్రయిస్తవ ప్రపంచంలో అత్యంత ప్రముఖ మతపెద్ద  పోప్‌  పలస్తీనా పర్యటనకు ముందు జోర్డన్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమాల్లో మాట్లా డుతూ,  ఆయన  పలస్తీనా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని గట్టిగా చెప్పారు. సాయుధమార్గాన్ని వదిలి శాంతి బాటకు  రావాలని  పిలుపునిచ్చారు. పలస్తీనా సమస్య శాంతియుత పరిష్కారం గురించి  ఆయన  చెప్పడమూ, శాంతి మార్గానికి రావాలని చెప్పడమూ ఈ రెండు కూడా ఇస్రాయీల్‌కు మింగుడుపడలేదు. అందువల్ల పోప్‌ పర్యటన  పట్ల నిరసన ప్రదర్శనలతో  హోరెత్తించింది.  ప్రదర్శన కారులను నిర్బంధించడమూ జరిగింది. కాని ఇక్కడ గమనించవలసిన వాస్తవమే మంటే ఇప్పుడు వాస్తవాలు ఇస్రాయీల్‌ను బాధిస్తున్నాయి. వాస్తవాలను దాచిపెట్టడం ఎంతోకాలం సాగదు. అలాగే నోళ్ళకు తాళాలు  వేసి ఉంచడం  కూడా ఎంతో కాలం  సాధ్యం  కాదు.  న్యాయాన్ని బల ప్రయోగంతో అడ్డుకోనూలేరు. సత్యాన్ని గొంతు నులిమి చంపనూలేరు.

ఇటీవల పలస్తీనా వివిధ వర్గాల మధ్య సమైక్యతా ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. వాటి ఫలితాలు కూడా ముందుకు వచ్చాయి. అమెరికా, ఇస్రా యీల్‌ దేశాలకు అయిష్టమైనాగాని, ఈ దేశాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినాగాని పలస్తీనాలోని వివిధ గ్రూపుల మధ్య సమై క్యత బలపడుతోంది. స్వతంత్ర పలస్తీనా ఏర్పాటు  దిశగా  ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా చాలా మంది అభివర్ణి స్తున్నారు.   పలస్తీనా  అధ్యక్షుడు మప్‌ామూద్‌ అబ్బాస్‌ కూడా దీనికి మద్దతుగా అనేకసార్లు మాట్లాడారు. పోప్‌ను స్వాగతించిన తర్వాత ఆయన పత్రికలతో మాట్లాడుతూ చెప్పిన మాటలు కూడా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. ఇస్రా యీల్‌ బైతుల్‌ ముఖద్దస్‌ నగరం నుంచి ముస్లిములనే కాదు, క్రయిస్తవులను కూడా వెళ్ళగొడుతుందంటూ ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ ఆరోపణల్లోని వాస్తవాన్ని ప్రపంచం కూడా అర్ధం చేసుకుంటోంది.
పలస్తీనా   పర్యటన ద్వారా పోప్‌ కూడా మధ్యప్రాచ్య   రాజకీయాల్లో అడుగు పెట్టినట్లయ్యింది. బైతుల్‌ ముఖద్దస్‌ వద్ద ఆయన శాంతి కోసం ప్రార్ధించారు. వెస్ట్‌ బ్యాంక్‌లో రెండు ప్రాంతాలకు మధ్య            ఉన్న   వేర్పాటు  గోడ వద్ద  పలస్తీనా భూభాగంలో నిలబడి ఆయన శాంతి కోసం ప్రార్ధించారు. ఆయన చేయి ఆన్చిన చోట గోడపై ‘‘ఫ్రీ పలస్తీన్‌’’ అన్న అక్షరాలు స్పష్టంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. పలస్తీనా, ఇస్రాయీల్‌ అధినేతలు వాటికన్‌ వచ్చి శాంతి కోసం ప్రార్ధించాలని ఆయన ఆహ్వానించారు. శాంతిచర్చలు స్తంభించడం మంచిది కాదని హితవు పలికారు. గమనించవలసిన మరో విషయ మేమంటే జోర్డన్‌ నుంచి పోప్‌ తిన్నగా పలస్తీనాకు వచ్చారు.మధ్యలో ఇస్రాయీల్‌ వద్ద  ఆగి  రావడం జరగలేదు. తన పర్యటనలో ఆయన శాంతి స్థాపించాలని నొక్కి చెప్పారు.

వాటికన్‌ పాలసీ కూడా మనం గమనిం చాలి. ప్రస్తుతం పోప్‌గా ఉన్న ఫ్రాన్సిస్‌ కన్నా ముందు ఇద్దరు పోప్‌లు కూడా పలస్తీనా ప్రజల పట్ల సానుభూతి చూపించినవారే. పోప జాన్‌ పాల్‌, పోప్‌ బెనెడిక్ట్‌లు పలస్తీనా ప్రజల పట్ల సానుభూతి ప్రకటించినవారే.

కేవలం  సానుభూతి  ప్రకటనల వల్ల ఒనగూడేది ఏదీ లేదు. ఇస్రాయీల్‌, పలస్తీనా  అధ్యక్షులను  పోప్‌ వాటికన్‌ ఆహ్వానించారు.   ఇస్రాయీల్‌  నుంచి సైమన్‌   పెరెస్‌   పలస్తీనా  నుంచి మప్‌ామూద్‌ అబ్బాస్‌ ఇరువురు కూడా వాటికన్‌ ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు. కాని సైమన్‌ పెరెస్‌ ఇస్రాయీల్‌లో విధాన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. ఆయన మాట చెల్లుబాటయ్యేది లేదు. ఆయన మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు చెప్పే మాటలు కేవలం ప్రజాసంబంధాలు మెరుగుపరచుకోడానికి   ఇస్రాయీల్‌                ఉపయోగించుకుంటుందే తప్ప రాజకీయ నిర్ణయాలన్నీ   నెతన్యాహు  చేతిలోనే ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచు కుంటే తక్షణం పలస్తీనా సమస్యకు పోప్‌ పర్యటన వల్ల  లభించే  పరిష్కారం ఏదీ లేదని తెలుస్తుంది.    కాని  పలస్తీనాకు ప్రపంచంలో    వివిధ   దేశాల మద్దతు పెరుగుతుందన్నది వాస్తవం. అన్యాయం చివరకు అంతంకాక తప్పదన్నది కూడా కాదనలేని వాస్తవం.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *