ప్రత్యేక కథనం: ఆత్మహత్య ఘోరపాపం

ఎవరైనా తమ ప్రాణాలను తాము బలవంతంగా తీసుకోవడాన్నే ‘ఆత్మహత్య’ అంటారు. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసు కోవడం   ఒక  అంటువ్యాధిలా  ప్రబలి పోతోంది. ఏ పేపర్‌ తిరగేసినా, టీవిలో ఏ ఛానెల్‌ చూసినా ఆత్మహత్యలు ప్రధా నంగా ఉంటున్నాయి. జీవితం రంగుల మయం,  కష్టసుశాల  మిశ్రమం. సుఖ దుఃఖాలు లాభనష్టాలు  సహజం. ఈ జీవితం దేవుడిచ్చిన వరం.  సమస్యలకు భయపడి ఆందోళనతో ఆత్మహత్య కోరితే సమస్యలు పరిష్కారం కావు. చీకటి లేకుండా ఉదయం రాదు. ఓటమి లేనిదే విజయం లేదు. దైవం ప్రసాదించిన ఈ జీవితం  ఓ  పరీక్ష.   అందుకే దివ్య ఖుర్‌ఆన్‌లో దైవం ఇలా ప్రస్తావిస్తున్నాడు: ‘మీలో మంచి పనులు చేసేవారెవరో పరీ క్షించి చూద్దామని. ఆయన చావు బ్రతుకు లను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తిమంతుడు, అత్యధికంగా మన్నించే వాడును. (ఖుర్‌ఆన్‌ 67: 2)

geeturai_weekly_magazine_18_5
ఔశీతీశ్రీస నవaశ్ర్‌ీష్ట్ర ూతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ (ఔనూ) సర్వే  ప్రకారం సంవత్సరానికి మన భారతదేశంలో దాదాపు లక్ష మంది వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకునే పద్ధతులు ఉదాహరణకు ఉరేసుకోవడం, నీళ్ళలోకి దూకి మునిగిపోవడం, రైలు కింద పడి చావటం, మంటలు రేపుకుని కాలిపోవడం మొదలైనవి.  ఇందువలన ముఖ్యంగా మన దేశం  మానవ వనరులను కోల్పో వటం జరుగుతుంది.   కాని  మన రాజ్యాంగం ప్రతీ భారతీయులైన పురుషు లకు స్త్రీలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చింది. కాని ఆత్మహత్యను ఐపిసి 309 సెక్షన్‌ ప్రకారం నేరంగా పరిగణించింది. అయినప్పటికీ ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష లేక జరిమాన విధించడం జరుగు తుంది.

ఆత్మహత్యకు కారణాలు:
వరకట్న  వేధింపులు,  ప్రేమ వైఫల్యం, వివాహేతర సంబంధాలు,  అనారోగ్యం, లైంగిక వేధింపులు, కుటుంబ కలహాలు, పరీక్ష ఫెయిల్‌,  పంట నష్టం, అప్పులతో పరువు నష్టం అయ్యిందని, తెలంగాణ కోసమని,  ఈ  విధంగా సమస్యలు తీవ్ర తరమైనప్పుడు ఇలా ఎన్నో చిన్నచిన్న కారణాలకు  మనస్తాపం చెంది ఆందోళ నతో నిరాశతో తొందరపాటు వలన చేసు కునే చర్య.  ఈ వైఖరి అత్యంత విషాద కరం. మనిషి తాను కోరిందల్లా పొందటం లోనే ఆనందం, సుఖసంతోషం ఉంటా యని తలుస్తాడు. వాటి కోసం ప్రయత్నం, కృషి చేస్తాడు. కాని ఒక్కోసారి ఎంత కష్ట పడినా ఫలితాలు రాకపోవచ్చు. ఇలాంటి సంఘటనలు మనిషిలో నిరాశ, నిస్పృహ లను పెంచేస్తాయి.  పూర్తిగా జీవితంపై విరక్తి కలిగిస్తాయి. స్థిమితం కోల్పోవడంతో మనిషి పూర్తిగా కృంగిపోతాడు, అప్పుడు ఇక మరణమే శరణ్యం అనుకుంటాడు. ఓర్పు,  సహనం నశించిపోయినప్పుడు దైవ సహాయం కోరితే తప్పక లభిస్తుంది. దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకూడదు. దివ్య ఖుర్‌ఆన్‌లో దైవం ఇలా తెలుపుతున్నాడు
‘మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాప్‌ాకు మీరంటే ఎంతో దయ అని నమ్మండి.’ (ఖుర్‌ఆన్‌ 4 :29)

బ    ఆత్మహత్య  చేసుకునేవారికి ఉండే లక్ష ణాలు ప్రముఖ సైకాలజిస్ట్‌ ఎం.డిరియాజ్‌ గారి అభిప్రాయాలు:
బ    పిరికితనం  కలిగి ఉంటూ నలుగు రితో కలిసి ఉండడానికి ఇష్టపడడు.
బ    ఒంటరిగా ఉంటాడు, ఒకచోట నిల కడగా కూర్చోడు.
బ    తనలో తాను మాట్లాడుకుంటూ  ఉంటాడు, ముఖం కళ తప్పిపోయి నల్లగాఉంటుంది.
బ    ఏ పనిమీద ఆసక్తి చూపడు, పనిలో ఏకాగ్రత ఉండదు.
బ    పదేపదే  ఆత్మహత్య  చేసుకున్న వారిని  స్ఫూర్తిగా   తీసుకుంటూ  ఉంటాడు.
బ    ఏదేదో అనుమానాలతో భరించలేని ఆత్మన్యూనత కలిగివుంటాడు. విరక్తి పెంచుకుంటూ  ఒక్కోమెట్టు దిగ జారుతున్నట్లు కనిపిస్తాడు.
బ    ఎటువంటి పరిశుభ్రత  ఉండదు, పాటించడు,  సమస్యలన్నీ నాకే ఉన్నాయి ఎవ్వరికీ లేవు అందరూ మంచిగానే ఉన్నారు అంటుంటాడు.
బ    ఎలాంటి శుభకార్యాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు.
బ    మద్యం,  ధూమపానం,  గుట్కా, పొగాకు  తదితర  అలవాట్లను రెట్టింపు చేస్తాడు.

ఇటువంటి లక్షణాలు కలిగిఉన్న వ్యక్తులు కనబడితే  తప్పకుండా  మీరు ధైర్య స్థైర్యాలు  కలిగించండి.  చేతనైతే సహా యంగా మీ చేతిని అందించండి.
ఆత్మహత్య వలన కలిగే నష్టాలు

క్షణికావేశంలో  తొందరపాటు నిర్ణయంతో కలిగే నష్టాలు  అపారంగా  ఉంటాయి. వీరిపై   ఆధారపడిన  ఎంతోమంది వృద్ధులు,  మహిళలు,  చిన్నారులు దిక్కు మొక్కు లేని జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. ఇంకా అనేక కుటుంబాలు వీధినపడు తుంటాయి.   వందలాది  చిన్నారులు అనాధలుగా మారుతున్నారు. ఆ చిన్నారుల భవిష్యత్తు అంధకారమవుతున్నాయి. ఇంకా కుటుంబాలకు, కుటుంబాలు ఆర్థికంగా కుదేలు అవుతున్నాయి.  కళ్ళ ముందే కన్నబిడ్డలు చనిపోవటం  తల్లిదండ్రులకు గుండెలు పగిలినంతగా తీరని శోకం ఎప్ప టికీ మిగిలి వుంటుంది. కాని వీరి కుటుం బాలతో వైరం, శత్రుత్వం ఉన్నవారికైతే ఇలాంటి సంఘటనలు మిక్కిలి సంతోషం కలిగిస్తాయి.
ధార్మిక (ధర్మ) గ్రంథాలు ఏమి చెబుతున్నాయి?

చావు, బ్రతుకులు కేవలం అతనిని సృష్టిం చిన సృష్టికర్త అధీనంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని దివ్యఖుర్‌ఆన్‌ ధృవీకరిస్తుంది.
‘సృష్టికర్త అల్లాప్‌ాయే మిమ్మల్ని  పుట్టిం చాడు,  తరువాత  మీకు  ఉపాధిని ఇచ్చాడు. ఆ  తరువాత మీకు మరణం కలిగిస్తాడు,  తరువాత మిమ్మల్ని బ్రతికి స్తాడు.’ (ఖుర్‌ఆన్‌ 30: 40)

పై  ఖుర్‌ఆన్‌  వాక్యాల్లో ఉన్న అర్థాన్ని ముఖ్యంగా  గమనించగలరు. ఓ మనిషి! పుట్టుకకు పూర్వం నీ ఉనికి కొంచెం కూడా లేదు, నీ  గురించి ఈ లోకానికి ఏమాత్రం కూడా తెలియదు. అటువంటి నీకు మొదటిసారిగా పుట్టించిన వాడు మరణిం చిన  తర్వాత  మళ్లీ పుట్టించలేడా? ఆ శక్తిసామర్థ్యాలు ఆయనకు లేవా? కాబట్టి తప్పక పుట్టిస్తాడు. మరణానంతర జీవితం ఉంది. సర్వసృష్టికర్త ఎదుట హాజరు చేయ బడతావు. అప్పుడు నిన్ను ప్రశ్నిస్తాడు? నీ యవ్వనాన్ని ఏ ఏ  కార్యకలాపాల్లో గడి పావు? మంచి పనులలోనా, చెడు పనుల లోనా? ఈ  విధంగా  మానవుల మంచి చెడ్డల విచారణ జరుగుతుంది. ఎవరి కర్మల కనుగుణంగా వారికి ప్రతిఫలం ఇవ్వటానికి పరలోకం సిద్ధంగా ఉంటుంది. జీవితం  అంటే  చావు వచ్చేవరకు నీవు బ్రతికాలి, మధ్యకాలంలో ప్రాణాలను బలవంతంగా తీసుకుంటే దైవానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఈ ఘోర పాపం చేసినందుకు అంధకార నరకంలో ప్రవేశిస్తావు, అక్కడ అనేక రకాల శిక్షలు ఉన్నాయి.  ఇదే  విషయాన్ని హిందూ ధర్మగ్రంథమైన  యజుర్వేదంలో ఇలా చెప్పబడిరది.
‘ఆ లోకాలు సూర్యుడు లేని లోకాలు (నర కాలు) ఎల్లడెలా అంధకారం వ్యాపించి  ఉంటుంది. అందులో ఆత్మహత్యలకు పాల్పడినవారు ప్రవేశిస్తారు.’ (యజుర్వేదం 40: 2)
ఇక బైబిల్‌లో కూడా నరకం గురించి ప్రస్తావన ఉంది

‘నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు’ (మార్కు 9: 48)

జీవితంలోని  సమస్యలకు  చావు పరి ష్కారం కాదని అందుకు దైవం శిక్షిస్తాడు అని ధర్మగ్రంథాలు ఘోషిస్తున్నాయి.

ఇస్లాంలోని చివరి ప్రవక్త మహాశయులు ముహమ్మద్‌(స) ఒక హదీసు గ్రంథంలో ఇలా సెలవిచ్చారు :

‘ఏ మనిషైతే ఒక పదునైన కత్తితో తనను తాను  హత్య చేసుకుంటాడో అతను నర కాగ్నిలోకి పోయి ఒక పదునైన ఆయుధాన్ని తన  కడుపులోకి  పొడుచుకుంటాడు. కలకాలం అతడు ఆ స్థితిలోనే నరకంలోనే పడి ఉంటాడు. ఎవడైతే  విషం  తాగి తనను తాను చంపుకుంటాడో  అతను నరకాగ్నిలోకిపోయి  విషాన్ని  తాగుతూనే ఉంటాడు. శాశ్వతంగా అతను నరకంలోనే పడిపోతాడు.  ఎవడైతే పర్వతం మీద నుంచి  కిందకి దూకి తనను తాను హత్య చేసుకుంటాడో అతను నరకాగ్నిలోకి ప్రవే శించి  పైనుంచి   కిందికి పడుతూనే  ఉంటాడు.  అతను  ఎడతెగకుండా ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉంటాడు.

ఆత్మహత్యకు  సంబంధించిన ఏ పద్ధతు లైతే దైవప్రవక్త  చెప్పారో  అవి సాధార ణంగా మనం చూస్తూనే ఉంటాము.  ఈ వాక్యాలలో   శాశ్వతంగా  నరకంలో             ఉంటాడు అని తెలుపబడిరది.  అంటే అర్థం ఇక ఎప్పటికీ మరణం రాదు. శాశ్వ తంగా   అందులోనే  పడి ఉంటాడు. అందుకే  ఇస్లాం ధర్మం ఆత్మహత్యను నిషిద్ధమైనదిగా ఖరారు చేసింది. కావున దేవుని కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.

మనిషిలోని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన  అతని  శక్తిసామర్థ్యాలను మొద్దుబారేలా  నిర్వీర్యం చేస్తాయి. కాని ఖుర్‌ఆన్‌లోని వాక్యాలు అలాంటి వారికి కొత్త శక్తిని, నూతనోత్సాహాన్ని  ఇవ్వటంతో పాటు   సకారాత్మకమైన  ఆలోచన కలవారిగా తీర్చిదిద్దుతాయి.

ఖుర్‌ఆన్‌ ఇచ్చే శుభవార్త
‘ఎవడు అల్లాప్‌ాకు భయపడుతూ పనిచేస్తాడో అతనికి అల్లాప్‌ా కష్టాల నుంచి గట్టెక్కే మార్గం చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాప్‌ాను నమ్ముకున్నవారికి అల్లాప్‌ాయే చాలు. (దివ్యఖుర్‌ఆన్‌ 65: 3)

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *