ఫలితాలు ప్రమాద ఘంటికలు

పరిస్థితులు అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉన్నప్పుడు  అల్లాప్‌ాపై   నమ్మకముంచి ప్రయత్నిస్తే   సమస్యలకు   పరిష్కార మార్గాలు లభిస్తాయి. అదే  విధంగా వర్త మాన రాజకీయ పరిస్థితులలో దేశంలోని ముస్లింలు  తమ  బలాలను, బలహీన తలను బేరీజు వేసుకొని భవిష్యత్తులో దేశ రాజకీయాలలో  సమర్థవంతమైన పాత్ర పోషించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవలసి ఉంటుంది. దేశం లోని వివిధ  లౌకిక రాజకీయపక్షాలు గత ఎన్నికలలో తమ పాత్రను సరిగా నిర్వహిం చటంలో కుల, సామాజిక సమీకరణాలను, సమర్థనను  నిలబెట్టుకోవటంలో విఫల మయ్యాయి. బిజెపి పార్టీ వివిధ మార్గాల ద్వారా  తమ  అనుకూల వర్గాలను సమీక రించుకోవటంలో విజయం సాధించింది. దీని ఫలితంగా ముస్లిం ఓట్లు వివిధ లౌకిక రాజకీయ  పక్షాల  మధ్య చీలి ఇతరుల ఓట్లు  అన్నీ  సమీకరించబడి బిజెపికి అనుకూలంగా మారాయి.  ముస్లింలను నిందిస్తున్న  లౌకిక  రాజకీయ పక్షాలు ముందు  తమ  కుల సమీకరణలను, సమర్థనను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి.geeturai_weekly_15

ఎన్నికలను  ప్రభావితం  చేసే స్థాయిలో ముస్లింలు  కొన్ని  నియోజకవర్గాలలో నిర్ణయాత్మక శక్తిగా  ఉన్నప్పటికీ వారికి లోక్‌సభలో  లభించిన రాజకీయ ప్రాతి నిధ్యం అతి  తక్కువగా ఉంది. కేవలం 23 మంది  ముస్లిం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు.  గత లోక్‌సభతో పోలిస్తే తక్కువ స్థానాలు లభించినందుకు ముస్లింలు  సమర్థించిన రాజకీయ పక్షాలు అత్యధిక  స్థానాలు  సాధించినందుకు దుఃఖంగానే ఉంది.  కానీ ఈ ఎన్నికల ప్రధాన విశేషం కాంగ్రెస్‌కు ఓటుబ్యాంక్‌గా పిలువబడే  ముస్లింలు  ఆ పార్టీకి దూర మయ్యారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్రం తరు వాత పార్లమెంటులో అత్యంత కనిష్ట స్థానా లను సాధించింది. ఒక పార్టీ పతనానికి, విజయానికి అల్ప సంఖ్యాకులు ఏవిధంగా తోడ్పడతారో  ఈ  ఎన్నికలలో  రుజువైంది. ముస్లింలు  కాంగ్రెస్‌కు ఇదివరకు  లాగా మూకుమ్మడిగా  ఓటు  వేయలేదు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాజయానికి ప్రధాన కారణం  సంప్రదాయకంగా కాంగ్రెస్‌కు ఓటు  వేసే  వర్గాలు ధరల పెరుగుదల, అవినీతి, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా బిజెపి వైపు మొగ్గారు.

ముస్లిం ఓట్లలో  చీలిక  పరిణామాలను పరిశీలిస్తే   ఉదాహరణకు  రాంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 47% మంది ముస్లింలు  ఉన్నారు. కానీ అక్కడ బిజెపి విజయం  సాధించింది. ఇందుకు కారణం కాంగ్రెస్‌,   ఎఎపీ, బిఎస్‌పి, ఎస్‌పి తదితర రాజకీయ  పక్షాలన్నీ ముస్లింలను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి. యూపీలోని 80 నియోజకవర్గాల నుంచి 55మంది ముస్లిం అభ్యర్థులను వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి. వీరిలో ఒక్కరు కూడా విజయం సాధించ లేదు. హిందూ` ముస్లిం ఓటర్ల మధ్య విభ జన (కమ్యూనల్‌ పోలరైజేషన్‌) జరిగింది. ఫలితంగా బిజెపి లాభపడిరది. యూపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నిక కాకపోవడం  ఇదే  మొదటిసారి.  ఇతర ప్రాంతాలలో కూడా ఇదే విధమైన కమ్యూ నల్‌ పోలరైజేషన్‌ జరిగి ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చాయి.

యూపీలో బిజెపి 73 స్థానాలలోగెల్చింది. 7  స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. అనేక మంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణం కమ్యూనల్‌ పోలరైజేషన్‌లో బిజెపి లాభపడటమే. 1980లో 19 మంది ముస్లిం అభ్యర్థులను లోక్‌సభకు పంపిన యూపీ 2014లో ఒక్క రిని కూడా పంపలేదు. 2009 ఎన్నికలలో 9  మంది  ముస్లిములు యూపీ నుంచి లోక్‌సభకు  ఎన్నికయ్యారు.  2014 ఎన్నికలలో ఎస్‌పి  నుంచి పోటీచేసిన 13 మంది  ముస్లిం అభ్యర్థులు, 19 మంది బిఎస్‌పి అభ్యర్థులు, 9 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు అందరూ పరాజయం పాల య్యారు. బిజెపి  ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా  నిలుపలేదు.  సిఎస్‌డిసి విశ్లేషణ ప్రకారం  మొత్తంగా  ముస్లింలలో 9% ముస్లింలు బిజెపికి,  43% కాంగ్రెస్‌కు, మిగతా ముస్లిం ఓట్లు వివిధ లౌకిక పార్టీల మధ్య చీలిపోయాయి. బిహార్‌లో ముస్లిం ఓట్లు పెద్దగా చీలలేదు. యూపీ, బిహార్‌ లోని ముస్లింలు అధికంగా ఉన్న 10 నియోజకవర్గాల ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే ముస్లింలు  అధికంగా  ఉన్న  నియోజక వర్గాలలో  ముస్లిం  ఓట్లు ఏ విధంగా చీలాయో అవగతమవుతుంది. యూపీలో ముస్లింలు  అధికంగా  ఉన్న నియోజక వర్గాలలో 10 స్థానాలు బిజెపి గెల్చుకుంది. బిజెపి సగటున 44% ఓట్లు సాధించగా, మిగతా  ముస్లిం  ఓట్లు వివిధ లౌకిక రాజకీయ పక్షాల మధ్య చీలాయి. బిహార్‌లో ముస్లింలు అధికంగాఉన్న 10 నియోజక వర్గాలలో 6 స్థానాలను బిజెపి గెల్చుకోగా 4 స్థానాలు మిగతా లౌకికపార్టీలకు దక్కాయి. ఈ నియోజకవర్గాలలో సగటున బిజెపి 37.3% ఓట్లు సాధించగా, మిగతా ముస్లిం   ఓట్లు   వివిధ  లౌకిక రాజకీయ పక్షాల మధ్య  చీలాయి. ముస్లిం ఓట్ల మధ్య చీలిక ఫలితంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న స్థానాలలో కూడా బిజెపి గెలిచింది.

ముస్లింలు  మొదట  తమలో  తాము ఐక్యతను సాధించి  సమాజంలోని భిన్న వర్గాల మధ్య సోషల్‌ ఇంజనీరింగ్‌ సాధించి తమతోపాటు సమాజంలోని అన్ని వర్గాల సమస్యల  సాధనకు  కృషి చేయాలి. ముస్లింలు నిరంతరం జాగురూకతతో  ఉండి సమస్యల పట్ల అవగాహన కలిగి తమ  సమస్యలను  తామే సమైక్యంగా పరిష్కరించుకోవలసి ఉంటుందని జమా అతె ఇస్లామీ హింద్‌ ప్రధాన కార్యదర్శి నుస్రత్‌అలీ అన్నారు. సమస్యలను ఎప్పటి కప్పుడు  ప్రభుత్వ  దృష్టికి  తీసుకెళ్ళి పరిష్కారానికి  కృషి  చేయాలి.  ఏ పార్టీ అధికారంలో  ఉన్నా వారి దృష్టికి సమస్య లను తీసుకెళ్ళి పరిష్కరించుకోవాలి.

గత 2014 ఎన్నికలలో పొందిన స్థానాలు, పొందిన ఓట్ల   శాతం  పరిశీలిస్తే నైష్పత్తిక ఓటింగ్‌ విధాన  ఆవశ్యకత అగుపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల  విధానం  ప్రకారం ఒక నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఐదుగురు తలా 16% ఓట్లు సాధించారు.కానీ 6వ అభ్యర్థి 20% ఓట్లు సాధించాడు కానీ అతడే విజేతగా ప్రకటించబడతాడు. అతనికి వ్యతిరేకంగా 80%ఓట్లు  వచ్చినా అతనే విజేత అవు తాడు.  ఇది  ఇప్పుడు ఉన్న ఎన్నికల విధానంలోని  లోపాన్ని  తెలుపుతుంది. ఇదేవిషయాన్ని డాక్టర్‌ జఫ్ఫర్‌ ఇస్లాంఖాన్‌ ప్రెసిడెంట్‌ ఆల్‌ ఇండియా ముస్లిం మజ్లిస్‌ ఎ ముషావరత్‌ ఢల్లీి గజెట్‌లో వ్రాసిన వ్యాసంలో సోదాహరణంగా వివరించారు. ఈ  ఎన్నికలలో బిజెపి 282 స్థానాలు, కాంగ్రెస్‌  44  స్థానాలు సాధించాయి. వీరిద్దరి  మధ్య  సాధించిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 19% మాత్రమే కానీ స్థానాలలో చాలా అంతరం ఉంది.

నేడు ప్రపంచంలోని అనేక దేశాలలో నైష్ప త్తిక ప్రాతినిధ్య విధానాన్నిఅనుసరిస్తున్నారు. ఈ విధానంలో ఒక పార్టీ సాధించే స్థానాలు ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతంపై ఆధార పడి వుంటుంది.  విచిత్రమేమంటే నిన్నటి వరకు బిజెపి నైష్పత్తిక ప్రాతినిధ్య విధా నాన్ని సమర్థించింది. ఈ ఎన్నికలలో బిజెపి వాగ్దానం చేసిన వాటికి, గెల్చిన తరువాత అది పలుకుతున్న పలుకులకు, ప్రకటన లకు మధ్య అంతరం కన్పిస్తుంది. మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో ముస్లిం బాలి కలు ఒక చేత్తో ఖుర్‌ఆన్‌ మరొక చేత్తో లాప్‌ టాప్‌తో ఉండాలి అన్నారు. అభివృద్ధితో ముందుకు పోవాలి అన్నారు. దేశంలో అమలులో ఉన్న వ్యవస్థలను బలోపేతం చేస్తాం అంతేగాని వాటిని రద్దు చేయం లేదా బలహీనం చేయమని ఇంటర్వ్యూ లలో ప్రకటించారు.  కానీ గెల్చిన వెంటనే కొంతమంది బిజెపి నాయకులు కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికరణ, రిజర్వేషన్లు లాంటి అంశాలపై ప్రకటనలు చేస్తున్నారు.  బిజెపి లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించిన తరువాత తన పాత ఎజెండా రామ మందిర నిర్మాణం, కాశ్మీర్‌ 370 అధికరణ,ఉమ్మడి పౌరస్మృతి వంటి వాటిని అమలు లోనికి తేవడానికి ప్రయత్ని స్తున్నదన్న అనుమానాలు లేకపోలేదు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *