ఫలితాలు

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొందరికి సంతోషాన్నిచ్చాయి. కొందరికి విషాదంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఊహించనివారిలో సహజంగానే నిరాశ కమ్ముకుంటుంది. కాని ఇది వాస్తవం, కాబట్టి వాస్తవంగానే స్వీకరించాలి. వివిధ రాజకీయపార్టీలు, ఈ ఎన్నికల్లో దారుణపరాభవానికి గురైన పార్టీలు ఓటమికి కారణాలను సమీక్షించుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి సమీక్షలు పార్టీలకు అవసరమే. వివిధ సామాజిక వర్గాల్లోను ఈ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి. అలాంటి సామాజిక వర్గాలు కూడా కారణాలను సమీక్షించుకోవాలి.  వివిధ రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాయి. తమ ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి? ఎక్కడ పొరబాట్లు దొర్లాయన్న విశ్లేషణ ఎంతైనా అవసరం.

voting

ముఖ్యంగా సెక్యులర్‌ పార్టీలు ఈ ఎన్నికల్లో దారుణంగా వెనకబడ్డాయి. అవి చెప్పిన రెండు లక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా ఈ ఎన్నికల్లో సాధించలేకపోయాయి. మొదటి లక్ష్యం బిజేపి మతతత్వ పార్టీ కాబట్టి, బిజేపికి అధిక స్ధానాలు లభించకుండా ప్రయత్నించడం, రెండవ లక్ష్యం బిజేపి సారథ్యంలో ఎన్‌డీఏ కూటమి అధికారాన్ని అందుకోకుండా ప్రయత్నించడం. ఈ రెండు ప్రయత్నాల్లోను సెక్యులర్‌ పార్టీలు దారణంగా విఫలమయ్యాయి.  కాని నిజంగానే సెక్యులర్‌ పార్టీలు దేశంలో సెక్యులర్‌ వాతావరణాన్ని కాపాడ్డానికి ప్రయత్నించాయా అన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఎందుకంటే ఈసారి ఈ పార్టీలలో కొన్ని ఉనికిని కాపాడుకోవడం కూడా కష్టంగా మారింది.

ఈసారి బిజేపికి 282స్ధానాలు లభించాయి. బిజేపి మొదటిసారిగా పూర్తి మెజారిటీ సాధించింది. పార్లమెంటులో బిజేపికి ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేదు. అంటే బిజేపికి తన ఎజెండా అమలు చేయడానికి ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గవలసిన అవసరం లేదు. సంకీర్ణ రాజీకీయాలు నిస్సహాయతలూ లేవు. మిత్రపక్షాల బలం కూడా కలుపుకుంటే ఎన్‌డీఏకు పార్లమెంటులో 336స్ధానాలున్నాయి. ఇందులో బిజేపి తర్వాత 18స్ధానాలతో శివసేన పెద్దపార్టీగా ఉంది. ప్రస్తుతం ఎన్‌డీఏలో 29పార్టీలున్నాయి. ఇందులో కేవలం 12పార్టీలకు మాత్రమే లోక్‌సభలో సభ్యులున్నారు. అంటే 17మిత్రపక్షాలకు లోక్‌సభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. సిద్ధాంతపరంగా బిజేపికి అతి దగ్గరగా ఉన్న పార్టీ శివసేన మాత్రమే. మిగిలిన పార్టీలు కూడా బిజేపి నిర్ణయాలను ప్రశ్నించే అవకాశాలు లేవు. తెలుగుదేశం గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడే బిజేపి నిర్ణయాలను ప్రశ్నించలేదు. ఇప్పుడు నోరిప్పుతుందని అనుకోలేం. ఎన్‌డీఏలోకి మరిన్న పార్టీలు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అధికార కూటమిలో చేరడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడే ఆలోచేనలు వినబడుతున్నాయి. వైయస్సార్‌ సిపికి చెందిన తొమ్మిది మంది గెలిచారు.ఈ పార్టీ కూడా ఎన్‌డీఏ గూటిలో చేరితే ఆశ్చర్యం లేదు. టీఆర్‌యస్‌ కూడా అటే మొగ్గు చూపవచ్చు.

బిజేపి తాను చెబుతూ వచ్చిన, చేస్తూ వచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే పూర్తి మెజారిటీ, పూర్తి బలం ఇప్పుడు లభించింది. ఎన్ని వాగ్దానాలు పూర్తవుతాయో, బీదప్రజానీకానికి ఎంత మేలు జరుగుతుందో వేచి చూద్దాం.

Check Also

కొన్ని ప్రశ్నలు

మీడియా ఇటీవల ఒక కొత్త ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనితీరును కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *