‘బహు’ చెడ్డ మార్గం తరువాయి భాగం

( గత సంచిక తరువాయి )

ఒకే దేవుని పట్ల భయం, పాపాలలో కూరుకుపోయిన సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దింది. దైవత్వంలో ఇతరులను చేర్చే వారిలో దైవభీతి నశించి పోతుంది. దైవత్వంలో ఇతరు లను చేర్చే వారి నమ్మకం ఎలా ఉంటుందంటే వారు ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు నరకశిక్ష నుండి వీరిని తప్పకుండా కాపాడుతారు అని నమ్ముతారు. వారు ఎంత పాపాత్ములైనాసరే.

దైవత్వంలో  ఇతరులను  చేర్చడం వలన మనిషిపై  పడే  చెడు  ప్రభావాలు: పాపా లలో పీకల్లోతు కూరుకుపోతాడు. అతనిలో మంచి  వ్యక్తిత్వం  జనించదు. బహుదైవా రాధకులు చెప్పే వాటిలో అసలు సత్యమే లేదు.  వారు  చెప్పేవన్నీ కట్టుకథలు మాత్రమే.  జనాలను దారి మళ్ళించడానికి లేనిపోనివన్నీ కల్పించి చెప్పుతారు. కొంత మంది అమాయకులు వాటిని నమ్మేస్తారు.

బహు దైవారాధకులు  చెప్పే  బూటకపు కథల  గురించి  స్వామి  దయానంద సరస్వతి  ఈ  విధంగా చెబుతున్నారు: ‘‘అబద్ధపు ప్రచారాలు, బూటకపు కథలతో పుస్తకాలను  రాసి  రుషులు, మునుల పేర్లతో  ప్రచురిస్తున్నారు బహుదైవారాధ కులు’’  (సత్యార్థ ప్రకాశం అధ్యాయం 11 పేజీ 365)
geeturai_5
‘‘జ్ఞానం  లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించే  నిమిత్తం అబద్ధాన్ని  కల్పించి దానిని అల్లాప్‌ాకు  ఆపాదించే  వ్యక్తికంటే మించిన   దుర్మార్గుడెవరు?  నిశ్చయంగా అల్లాప్‌ా  అటువంటి దుర్మార్గులకు రుజు మార్గం చూపడు.  అసలు  సత్యం ఏమి టంటే ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును అల్లాప్‌ాయే సృష్టించాడు. ఆయనకు  సహవర్తులు ఎవరూ లేరు. ఎవరైతే  ఈ సత్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితం  మొత్తం  సత్యంతో మరియు మంచి వ్యక్తిత్వంతో సాగిపోతుంది. (దివ్య ఖుర్‌ఆన్‌ అన్‌ఆమ్‌ 6: 144)
‘‘అంతిమ ఫలితం మీ కోరికలపై గానీ లేక గ్రంథ ప్రజల కోరికలపైగానీ ఆధారపడి లేదు. దుర్మార్గం చేసినవాడు దాని ఫలితం అనుభవిస్తాడు. అల్లాప్‌ాకు వ్యతిరేకంగా తనను  సమర్థించే వాణ్ణి గానీ  తనకు సహాయం చేసేవాణ్ణి గానీ  అతడు  పొంద లేడు. మంచిపనులు చేసే  వారు  పురుషు లైనా, స్త్రీలైనా వారు  గనక  విశ్వాసులైతే స్వర్గంలో  ప్రవేశిస్తారు.  వారికి  రవ్వంత అన్యాయం  కూడా జరగదు. (దివ్య ఖుర్‌ఆన్‌ 4: 123, 124)

‘‘వారు చెప్పే  ఈ  అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 2 : 10)
నాస్తికుల ఆలోచనా  విధానం ఏ విధంగా ఉంటుందంటే  వారు  ఈ ప్రపంచాన్ని ఎవరూ సృష్టించలేదు అని అనుకుంటారు. ఇది బధిరులు చెప్పే భౌతిక వాదం తప్ప మరేమీ కాదు.
బహుదైవారాధకుల  ఆలోచనా  విధానం ఏవిధంగా ఉంటుందంటే  ఎన్నో  శక్తులు కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని  కాపాడాలన్నా  లేదా నాశనం చేయాలన్నా ఎన్నో శక్తుల ప్రభావం ఉంది అనుకుంటారు.

ఏకేశ్వరోపాసన  చేసేవారి  ఆలోచనా విధానం ఏవిధంగా ఉంటుందంటే దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు, నడిపించే వాడు. పుట్టుకా,  మరణం, లాభం, నష్టం, గౌరవం,  అగౌరవం,  అదృష్టం, దురదృష్టం అన్నీ ఆయన  చేతుల్లోనే ఉన్నాయని నమ్ముతారు.

ఇవి మూడు రకాల ఆలోచనా విధానాలు ఇవి  మానవుణ్ని  మేధస్సుపై తీవ్ర ప్రభా వాన్ని చూపుతాయి.
బహు  దైవారాధకుడు  ప్రతి చిన్న విష యానికి భయపడతాడు.  బహు దైవారాధ కుడికి ప్రతి జీవరాశీ దేవుడే. అందరి దేవుళ్ళ చేతుల్లో   తన  తలరాత ఉంది అనుకుం టాడు. లాభనష్టాలు అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి  అని  నమ్ముతాడు. ఇవి ఏ ఆధారంలేని  ఆలోచనా  విధానాలు మాత్రమే.
‘‘సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో  నింపే  సమయం త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లాప్‌ా  ఏ  ప్రమాణాన్ని  అవతరింప జేయలేదో వారినీ, వారు  అల్లాప్‌ాతోపాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. (దివ్యఖుర్‌ఆన్‌ 3: 151)

ఏకేశ్వరోపాసన చేసేవారి మనస్సులో ఒకే దేవుని భయం తప్ప మరింకెవరి భయము ఉండదు. చిన్న విషయానికైనా, పెద్ద విష యానికైనా ఆ దేవుని పైనే నమ్మకం పెట్టు కుంటారు.

‘‘సర్వశక్తులు,  సర్వాధికారులు అల్లాప్‌ా గుప్పెట్లోనే ఉన్నాయి.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 2: 165)

‘‘నిజమైన విశ్వాసులు అల్లాప్‌ానే నమ్ము కోవాలి.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 3: 160)

ఒక నిజమైన విశ్వాసి అల్లాప్‌ా ఏమార్గంపై నడిస్తే ఆనందిస్తాడో అదే మార్గంపై నడు స్తాడు. ఏకేశ్వరోపాసన చేసేవారి నమ్మకం ఎలా  ఉంటుందంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా అతనిపైనే భారం మోపుతాడు.

‘‘భయభక్తులతో పనిచేస్తూ ఉదాత్త వైఖరి కలిగివుండే వారితో అల్లాప్‌ా ఉంటాడు.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 16: 128)

‘‘ఎవరు  అల్లాప్‌ాకు భయపడుతూ పని చేస్తాడో  అతనికి  అల్లాప్‌ా కష్టాల నుండి గట్టెక్కే మార్గం  చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. అల్లాప్‌ాను నమ్ముకున్నవానికి అల్లాప్‌ాయే చాలు. అల్లాప్‌ా తన పనిని పూర్తి చేసి తీరు తాడు. అల్లాప్‌ా ప్రతి దానికి ఒక విధి నిర్ణ యించి ఉంచాడు.’’  (దివ్యఖుర్‌ఆన్‌ 65: 2,3)

బహు  దైవారాధన  చేసేవారు ఇంత దృఢ విశ్వాసాన్ని కలిగి వుండరు. ప్రతీచిన్న విష యానికి భయపడిపోతారు. ఏకేశ్వరోపాసన వల్ల మనిషికి  ఎన్నో  గొప్ప గొప్పగుణాలు అలవడుతాయి.  బహు దైవారాధన గురించి ఖుర్‌ఆన్‌లో ఈ విధంగా ప్రస్తావిం చడం జరిగింది.

‘‘దేవునికి  భాగస్వాములుగా ఎవ్వరినీ చేర్చకూ,  నిజం ఏమిటంటే ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చడం పరమ దుర్మార్గం.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 31: 13)
ఏకేశ్వరోపాసన ఒక జాతికి, ఒక దేశానికి సంబంధించిన  సమస్యకాదు. మొత్తం ప్రపంచానికి సంబంధించినది. ఏకేశ్వరో పాసన ప్రజలందరినీ ఒకటి చేస్తుంది. ఒకే దేవుని  దాసులు  ఒకే  ధర్మంగా  వారు ఒక్కటై ఉంటారు.  వారి ఆలోచనా విధా నాలు  కూడా  ఒకటిగానే ఉంటాయి. బీదవాడు,  గొప్పవాడు,  అధికులు, అథములు  అనే  బేధభావాలు  అసలే  ఉండవు. ఒకే దేవుని వచనము, ఒకే ధర్మం వారిని ఒకటిగా చేస్తుంది.

‘‘విశ్వాసులు  పరస్పరం అన్నదమ్ములు.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 49: 10)
ఏకేశ్వరోపాసన నుండి దూరమైన వారిలో ఇలాంటి  ఆలోచనా  విధానాలు నశించి పోతాయి.
బహుదైవారాధన తారతమ్యాలను సృష్టిం చడంలో నాస్తికులతో ఏమాత్రం తీసిపోదు. బహు దైవారాధన మానవుని ఆలోచనలను ప్రేమను ఎన్నో భాగాలుగా చీల్చివేస్తుంది. ఒక్కొక్క    వంశం  వారు ఒక్కో దేవుణ్ణి ఆరాధిస్తారు.

( సమాప్తం )

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *