‘బహు’ చెడ్డ మార్గం

ప్రతీ  జీవరాశిని దేవుడుగా పరిగణించ డమే బహుదైవారాధన పరమార్థం. ప్రతీ జీవరాశి ముందు  చేయిచాచి తన కష్టా లను  దూరం  చేయమని అవసరాలను తీర్చమని అర్థించడానికి ఏ మాత్రం వెను కాడడు. శిరస్సును వంచుతాడు, అర్థిస్తాడు. ఈ  విధంగా  చేయడానికి ఒక్క క్షణం కూడా  ఆలోచించడు.  మనిషి అన్ని జీవ రాశుల్లోకెల్లా తక్కువ  స్థాయి కలవాడుగా భావించుకుంటున్నాడు. నాస్తికులు మనిషి స్థాయి నుంచి దిగజార్చి పశువుల స్థాయికి చేరవేశారు. మనిషి కోతి నుండి మనిషిగా అభివృద్ధి చెందాడని అంటారు. నీ తోటి మనుషులనే కాదు పశువులు, పురుగులు, పాములు, జర్రెలు, చెట్లు, పుట్టలు, సము ద్రాలు, కొండలు, రాళ్ళు, భూమి, అగ్ని, నీరు,  గాలి  ఇలా ప్రతి చిన్న పెద్ద అన్ని వస్తువులను దేవునిగా భావించు, వారి ముందు మోకరిల్లు వారినే అర్థించు వారికే నీ మొక్కులు చెల్లించు.  ఇది  ఎంత నీచమైన  ఆలోచనో మనం ఒక్కసారి గ్రహించాలి.
‘‘ఇతరులను అల్లాప్‌ాకు భాగస్వాములుగా చేసేవాడు  ఆకాశం  నుండి కింద పడి పోయినట్లే.  అతనిని  ఇక పక్షులైనా తన్నుకుపోతాయి  లేక  గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసిరివేస్తుంది.’ (దివ్యఖుర్‌ఆన్‌ 22: 31)geeturai_5
‘‘మేము  ఆదం  సంతతికి  పెద్దరికాన్ని ప్రసాదించాము. వారికి నేలపై, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహా రంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అను గ్రహం’’ (దివ్యఖుర్‌ఆన్‌ 17: 70)
‘‘నీ ప్రభువు తన దూతలతో అన్నప్పటి సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో, నేను భువిలో ఒక ప్రతినిధిని సృష్టించబో తున్నాను.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 2 : 30)
ఈ ప్రపంచంలోని ప్రతీ జీవరాశిని దేవుడు పుట్టించాడు.   కనుక  దేవుని ముందే శిరస్సును వంచాలి. ఎందుకంటే ఆయన మాత్రమే దానికి అర్హుడు పుట్టించేవాడు, పరిపాలకుడు, భూమి ఆకాశాలకు సర్వాధి కుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా జారీ చేసేవాడు. ఆయన్ని వదిలి ఇతరులను పూజించడం కానీ వారి ముందు శిరస్సు వంచడం కానీ సరికాదు.
ఖుర్‌ఆన్‌  మానవుణ్ని  ఈ  విధంగా ప్రశ్ని స్తుంది: ‘నీ అవసరాలను తీర్చడానికి నీ కోరికలను  నెరవేర్చడానికి ఒక్క దైవం సరిపోడనా ఇంత మంది భాగస్వాములను చేస్తున్నావు?’ (సూరే జుమర్‌ 39: 36)
ఖుర్‌ఆన్‌ మనిషిని ఆలోచించమని పిలుపు నిస్తుంది. ప్రభువు ఒక్కడా? లేక చాలా మందా. ఒక్కడినే ఆరాధించాలా లేక చాలా మందినే ఆరాధించాలా?
‘‘చాలామంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దేవుడు మేలా? ఆయనకు కాదని మీరు దాస్యం  చేస్తున్నవారు,   మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు తప్పా మరొకటి ఏమీ కాదు. దేవునితో సమానంగా ఇతరులను చేర్చేవారి వద్ద మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ ఉండదు. మనిషి ప్రాణాన్ని దేవుడు, దేవత లకు బలి ఇచ్చేస్తారు.’’
(దివ్యఖుర్‌ఆన్‌ 12 : 39)
దేవునితో సమానంగా ఇతరులను చేర్చేవారి వద్ద మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ ఉండదు. మనిషి ప్రాణాన్ని దేవుడు, దేవత లకు బలి ఇచ్చేస్తారు. రాజకీయ నాయ కుల  కోసం  తమ ప్రాణాలను అంకితం చేస్తారు.  ఒక  జంతువు ప్రాణానికి ఇచ్చే విలువ కూడా  మనిషి ప్రాణానికి ఇవ్వరు. దుస్తులు  మార్చేంత  తేలికగా వారు ప్రాణాలను తీసేసుకుంటారు.
బహుదైవారాధన చేసే వారిలో మరో నీచ మైనది  లక్షణం  ఉంటుంది. అది అథములు,  అధికులు అన్న భావం. ఈ రోగం  ప్రతీ    బహుదైవారాధకునిలో                  ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఈ భావన ఉంటుంది. భారత దేశంలో బ్రాహ్మణులను గొప్ప వారిగా భావిస్తారు. వీరిని దేవుని  సంతానంగా  పరిగణిస్తారు. అందరికంటే క్రిందిస్థాయిగా శూద్రులను పరిగణిస్తారు. వీరిని కేవలం సేవకులుగా భావిస్తారు.  మనుస్మృతి అనే గ్రంథంలో ఈ విధంగా ఉంది.  బ్రహ్మ ప్రపంచాన్ని ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళడానికి నోటితో బ్రాహ్మణుడిని చేతితో రాజులను, తొడలతో వైశ్యులను,  పాదాలతో దళితు లను పుట్టించాడు.   (అధ్యాయం 1: 31)
అధికులు,  అధములు  అనే భావాలు, అంటరానితనం ఇవి భారతదేశాన్ని ఉన్నత స్థానాన్ని తీసుకుపోవు సరికదా పాతాళానికి చేరుస్తాయి.  ప్రతి  బహుదైవారాధకునిలో ఈ విధమైనటువంటి ఆలోచనలు అధి కంగా   కనబడుతున్నాయి.  యునాన్‌ దేశస్తులు మానవత్వం యునానీయులకే సొంతం అనుకునేవారు. యునాన్‌ దేశానికి చెందనివారిని వారు పశువుకంటే హీనంగా చూసేవారు.  వారిని బందీలు చేసేవారు. ఈజిప్టులో  బనీఇస్రాయీల్‌ తెగ వారిని అధములుగా పరిగణించేవారు. ఈజిప్టుల సేవ చేయడానికి, వారు పెట్టే బాధలను భరించడానికి బనీ ఇస్రాయీల్‌ తెగ వారు జీవించేవారు. వారి మగ పిల్లలను ప్రభుత్వ ఆదేశం ప్రకారం చంపివేసేవారు. బహు దైవారాధన చేసే అరబ్బు దేశస్తులు వారే ప్రపంచంలో అందరికంటే గొప్పవారు అని విర్రవీగేవారు.  మిగతా  వారిని అధము లుగా భావించేవారు.
ఏకేశ్వరోపాసన   దృష్ట్యా  మనం చూసి నట్లయితే ప్రపంచంలోని ప్రజలందరూ సమానమే. అందరినీ ఒకే దేవుడు పుట్టిం చాడు. అందరూ ఒకే దేవుని దాసులు అందరూ ఆదమ్‌,  హవ్వా సంతానమే. దేవుడు ఏ జాతికీ,  ఏ  సమాజానికి, ఏ తెగకు సొంతం కాడు. అందరూ ఆయన దృష్టిలో సమానమే. దేవుని దృష్టిలో పుణ్యా త్ముడు, పాపాత్ముడు, దైవ విధేయత చూపేవాడు, చూపనివాడు అనే బేధాలు తప్ప వేరే ఎలాంటి బేధాలు దేవునికి ఉండవు.
‘‘మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురు షుని నుండి ఒకే స్త్రీ నుంచి సృజించాము. తరువాత మీరు  ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు  మిమ్మల్ని  జాతులు గాను, తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవారే అల్లాప్‌ా దృష్టిలో ఎక్కువ గౌరవ   పాత్రుడు.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 49: 13)
చిట్టచివరి  ప్రవక్త(స)  వారు ఈ విధంగా ప్రవచించారు. అరబ్బులకు  అరబ్బేతరు లపై గానీ అరబ్బేతరులకు అరబ్బుల పైగాని ఎలాంటి ఆధిక్యత లేదు.
ఓ మానవులారా! మీరంతా ఆదమ్‌ సంతా నమే. (బుఖారి, ముస్లిం)
‘‘ఓ అరబ్బు దేశస్తులారా మీ నాయకుని మాటను జవదాటకండి. దైవత్వంలో ఇతరులను  చేర్చడం  వలన దేవునికి, దాసునికి మధ్య  దూరం పెరిగిపోతుంది. ఇద్దరి   మధ్య   సంబంధం బలపడదు. మరియు ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోతాయి.
దేవునితో  సంబంధం మంచి వ్యక్తిత్వాన్ని జనింపజేస్తుంది.  దైవంతో సంబంధమే లేకపోతే మనిషిలో  మంచి  వ్యక్తిత్వం ఎక్కడినుంచి వస్తుంది.  బహు దైవారాధన చేసేవారిలో జనించే కొన్ని చెడు లక్షణా లను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటంటే దైవత్వంలో ఇతరు లను చేర్చడం వలన మనిషి తనను తాను దిగజార్చుకుంటాడు. మనిషి ఎప్పుడైతే తనలాంటి మనిషి లేదా తనకంటే తక్కువ స్థాయి  కలిగే  జీవరాశుల ముందు తన శిరస్సును  వంచుతాడో  ఇంకా అతనికి గౌరవం ఎక్కడ ఉంటుంది. తనను తాను గౌరవించుకోవడమే మంచి వ్యక్తిత్వానికి తొలి మెట్టు. ఏకేశ్వరోపాసన చేసేవాడు ఒకే దేవుని ముందు శిరస్సును వంచు తాడు.  ఎందుకంటే  ఆయనే  దానికి అర్హుడు.  ఈ విధంగా మనిషి గౌరవం పెరుగుతుంది. భయం మనిషిని చాలా పాపాల నుంచి దూరంగా ఉంచుతుంది. సమాజ  భయం  కొన్ని పాపాల నుండి దూరంగా  ఉంచితే  రాజకీయ భయం ఇంకొన్ని పాపాల నుంచి దూరంగాఉంచు తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మనిషికి దేవుని భయం ఉండాలి. ఏ దేవుడైతే అందరికంటే బలసాలియో ఏ దేవుడి శిక్ష నుండి మనిషి తప్పించుకోలేడో మనిషి మనసులో, మస్తిష్కంలో పుట్టే ఎలాంటి చెడు భావనను అయిన తెలసుకోగలడో ఆ దేవుని భయం ఉండాలి. ఎందుకంటే అతని ముందు తీర్పు దినమున హాజరవ్వ వలసి ఉంది. అతని శిక్ష నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.
(మిగతా వచ్చేవారం)..

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *