భలే చిట్కా (Story)

ఇల్లంతా చక్కగా సర్ది ఉంది. పిల్లల ఆట వస్తువులన్నీ  ఎంతో  పొందికగా సెల్ఫ్‌్‌లో సర్దుకుంటున్నారు పిల్లలు.  అస్సలాము అలైకుమ్‌  అంటూ  ఇంట్లోకి వచ్చాడు అబ్దుల్లా. వఅలైకుమ్‌ అనుకుంటూ తమ పనుల్లో తాము బిజీ అయ్యారందరూ. రోజూ వఅలైకుమ్‌స్సలామ్‌ అంటూ ఎదు రొచ్చే పిల్లలు భార్యామణి లోపల్నుంచే సమాధానమిచ్చారు. ఏంటోయ్‌ ఏమిటి హడావుడి ఎవరొస్తున్నారేంటి అంతా బిజీగా వున్నారు అన్నాడు. రఫీ మామూ వస్తున్నాడంటూ  పిల్లలు  సంతోషంగా చెప్తున్నారు. ఆఁ…  మా  అన్నయ్య వస్తు న్నాడండి చాలాకాలం తర్వాత అంటూ వంటలో నిమగ్నమైంది ఆమినా. ఇంత లోనే రఫీ రానే వచ్చాడు. భోజనం తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అందరూ మర్నాడు ఉదయం పిల్లలకు యు.టి అని త్వరగా పడుకున్నారు. కొంచెంసేపు మాట్లాడుకుని పెద్దవాళ్ళు కూడా నిద్రకుపక్రమించారు.story-p18drpeggi119guvonlr1sfo1nc

మర్నాడు పిల్లలను స్కూల్‌కు పంపి భర్త షాపుకు  వెళ్ళిన  తర్వాత త్వరగా పని ముగించుకుని   అన్నయ్యతో కబుర్లలోపడిరది ఆమెనా.  పుట్టిం టివారి బాగోగులు, పక్కింటివాళ్ళ గురించి  అన్నీ  అడిగి  తెలుసు కుంటూ  చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ  వున్నారు అన్నాచెల్లెళ్ళిద్దరూ.   లంచ్‌  కోసం ప్రిపేర్‌ చేసుకుని వున్న చికెన్‌ బిర్యానిని  పొయ్యి మీద  పెట్టి మళ్ళీ   మాటల్లో  పడ్డారు  అన్నా చెల్లెళ్ళు. మాటల్లో బిర్యాని కొంచెం మాడినా ధ్యాసలేదు ఆమినాకు.

జొహర్‌ తర్వాత దస్తర్‌ఖాన్‌ పరిచి అప్పుడు చూస్తే  బిర్యాని  కొంచెం మాడు వాసన వచ్చింది.  అన్నం మాడిన చూసుకోవా  ఎప్పుడూ అంతే ఏదో ఒకటి ఉప్పు తక్కువో ఎక్కువో వేస్తావ్‌ అన్నాడు అబ్దుల్లా ఎప్పటిలాగానే.  ఎప్పుడు  ఎందుకాయే ఏదో ఒకటి రెండు  సార్లు పొరపాటు జరి గింది అంది ఆమినా తన తప్పు లేనట్లు. వీళ్ళ రసభాసా సైలెంట్‌గా తిలకిస్తున్నాడు రఫీ. అబ్దుల్లా షాపుకెళ్ళిన తర్వాత ఎంత మంచిగా  వండినా  ఏదో వంక పెడ్తుం టారు మీ బావ గారు అంది ఆమిన. నిజం గానే కొంచెం అడుగంటింది అంటూ, నీవు ప్రవక్త(స) గారు చెప్పిన చిట్కా పాటించు వంట అద్భుతంగా వుంటుందన్నాడు రఫీ. ప్రవక్త(స) గారు ఏం చిట్కా చెప్పారబ్బా? నాకు  తెలియని  చిట్కా ఏదో? లోలోన ఆలోచించసాగింది ఆమిన. ఔను నేను కూడా మనలో చిన్న చిన్న ఫంక్షన్లకు వంట చేస్తాగా అదే చిట్కాను పాటిస్తాను. వంట ఎంతో  రుచిగా వుందని   అందరూ అంటుంటారు అన్నాడు రఫీ. ఏం చిట్కా కావచ్చు అది? అడిగితే అది కూడా తెలియదా అంటాడేమో అన్నయ్య అను కుంటుండగా రఫీ ఇలా చెప్పాడు :

ఒకసారి ముహమ్మద్‌ (స) వద్దకు కొందరు బానిస స్త్రీలు వచ్చారని తెలిసి ఫాతిమా(ర) ప్రవక్త(స) వద్దకు వెళతారు. కాని అక్కడ చాలా మంది  ఉండటం  చూసి తిరిగి ఇంటికి వచ్చేస్తారు.  ఇది  గమనించిన ప్రవక్త(స)  వారు  తెల్లారి ఫాతిమా (రజి) ఇంటికెళ్ళి  కూతురితో  నిన్న నీ రాకకు కారణమేమిటి  అని  అడుగుతారు. ఫాతిమా(రజి) బిడియంతో ఏమి మాట్లాడ లేదు.  దీనికి  సమాధానంగా అలీ(రజి) ప్రవక్తా!  ఏమని  చెప్పాలి, పిండి విసిరి విసిరి  ఫాతిమా  చేతులు కాయలు కాశాయి.  దూరం  నుంచి  నీళ్ళు మోసి మోసి భుజాలు కందిపొయ్యాయి. పొయ్యి దగ్గర వంట వల్ల పొగతో బట్టలు మసిబారి పొయ్యాయి. మీ దగ్గరకు కొందరు బాని సలు వచ్చారుగా, ఒక బానిసను తెచ్చుకో తనకు చేదోడువాదోడుగా వుంటుందని నేనే చెప్పాను అన్నారు ఎంతో ఆవేదనగా అలీ(రజి).

బానిసకంటే  కూడా  ఎన్నో  రెట్లు మేలైన చిట్కా నేను చెప్తాను,  దానివల్ల అలసట బడలిక తగ్గి నూతనోత్సాహంతో మళ్ళీ పని చేసుకోవచ్చు. అదేమిటంటే పడుకోబోయే ముందు 33 సార్లు సుబ్‌హానల్లాప్‌ా, 33 సార్లు అల్‌హమ్దులిల్లాప్‌ా,  34 సార్లు అల్లాహు అక్బర్‌, ఒకసారి లాఇలాహ ఇల్ల ల్లాహు వప్‌ాదహు లాషరీకలహు లహుల్‌ ముల్క్‌  వలహుల్‌  హమ్ద్‌ వహువఅలా కుల్లి షైఇన్‌ ఖదీర్‌’’ చదవాలి.

దీనివల్ల ఎంతో శ్రమతో కూడుకున్న, కష్ట తరమైన   పని  కూడా సులభతరమవు తుంది. ఈ తస్బీప్‌ా వల్ల ఒక బానిసకంటే ఎన్నో రెట్లు అధికశక్తి, మనోధైర్యం, బలం లభిస్తాయి. మనం చేస్తున్న పనిలో సఫలత లభిస్తుంది.   ఈ  తస్బీప్‌ా  పఠిస్తూ వంట చేస్తే  పుణ్యానికి  పుణం,   రుచికి  రుచి ఇంకా బావగారు  కూడా  ఎంతో ఇష్టంగా తింటారు.

అన్నయ్య!  ఇప్పట్నుంచి క్రమం తప్ప కుండా  తస్బీప్‌ా ఫాతిమాను పఠిస్తూ వండుతా.  మిగతా పనులప్పుడు కూడా పఠిస్తా అంది సంతోషంగా ఆమినా. తన చెల్లెలు ముఖంలో ఆనందం చూసి సంతో షంగా అల్లాప్‌ాకు కృతజ్ఞతలు తెలుపు కుని  తన  ఊరు  బయలుదేరాడు రఫీ తృప్తిగా.

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *