భారత్‌తో చర్చలకు సిద్ధం

విదేశాంగ విషయాలపై తమ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక విధాన నిర్ణయాలను తీసుకుందని, భారత్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ వెల్లడిరచారు. మెరుగైన దౌత్యసంబంధాలు, శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా భారత్‌తో మళ్లీ చర్చల ప్రక్రియకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇస్లామాబాద్‌లో కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు, భారత్‌తో చర్చలు తిరిగి ప్రారంభించేందుకు, చైనాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు. పొరుగు దేశాలతో శాంతియుత వాతావరణం, ఆశాజనకమైన భాగస్వామ్యం ఉండాలంటే దౌత్యపరమైన వ్యూహాలు ఫలవంతంగా ఉండాలని షరీఫ్‌ అభిప్రాయపడ్డారు.

ఏక శిశు విధానానికి స్వస్తి పలకనున్న చైనా

నాడు చైనా ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనే నినాదంతో దేశంలోని జనాభా నియంత్రణకు పూనుకుంది. తమ దేశంలో  జనాభాను ఎంతవరకు  నియంత్రించిందో గాని మళ్లీ ఇప్పుడు ఒక్కరు వద్దు ఇద్దరే ముద్దు అనే నినాదాన్నె త్తుకుంది. చైనా నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌కి చెందిన స్థాయీ సంఘం ఇందుకు సంబంధించిన తీర్మానాలను ఆమోదిం చిందని సిన్‌హుయా అనే వార్తా సంస్థ వెల్లడిరచింది. ఈ తీర్మానం చైనాలో చట్టంతో సమానం. గత నెలలో ప్రకటిం చిన ఈ విధానపరమైన మార్పుతో ఒకే శిశువు ఉన్న కుటుంబాలను మరో శిశువును కలిగి ఉండటానికి అనుమతి ఇస్తారు.

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికల నిర్వహణ  విరమించా లన్న డిమాండ్‌తో ప్రతి పక్షాలు చేపడుతున్న ఆందోళనలు కొనసాగు తున్నాయి. ప్రధాన ప్రతి పక్షం బంగ్లా నేషనలిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనలలో దాడులకు ప్రేరేపించేవారినే అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యఢాకాలో సుప్రీంకోర్టు భనవ సముదాయం ఎదుట ప్రభుత్వ మద్దతు, వ్యతిరేక న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

రెండు ఖండాలను కలుపుతూ సొరంగ మార్గం నిర్మించిన టర్కీ

రెండు ఖండాలు ఆసియా యూరప్‌ లను కలుపుతూ బాస్పోరస్‌ జలసంధి మధ్యలో మర్మరే సొరంగాన్ని నిర్మిం చింది టర్కీ. ఈ నిర్మాణం ద్వారా అలనాటి అటోమన్‌ సుల్తానుల వందేళ్ల కలను సాకారం చేసింది. ఈ సొరంగం ఆసియా యూరప్‌లనే కాకుండా టర్కీలోని రెండు ప్రాంతాలను ఒకదానితో ఒకటి కలుపుతుంది. ఈ సొరంగం ద్వారా హైస్పీడ్‌, సరుకు రవాణా చేసే రైళ్లు పయనిస్తాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ టర్కీ అవతరించి 90 ఏళ్ళైన సందర్భంగా ఈ సొరంగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సొరంగం పొడవు 13 కి.మీ. ప్రతిరోజూ 15 లక్షల మంది దీనిగుండా ప్రయాణం చేస్తారని అంచనా. 2004లో ఈ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. దీనికిగాను 3.3 బిలియన్ల యూరోలు ఖర్చయింది. భూకంపాన్ని తట్టుకునేటట్లు ఈ మార్గాన్ని నిర్మించారు.

ఈజిప్టు ఆర్మీ జనరల్‌ని అధ్యక్షుణ్ని చేసే యత్నం

ఈజిప్టు ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే అధ్యక్ష ఎన్నికలను  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్మీచీఫ్‌ అబ్దుల్‌ ఫత్తప్‌ా అల్‌సీసీని ఏప్రిల్‌ మాసానికి ముందే అధ్యక్షునిగా ఎంపిక  చేసేందుకు  రాజకీయంగా  పావులు కదుపుతోంది.  జులైలో  ముహమ్మద్‌ ముర్సీని పదవీచ్యుతుడిని చేసిన తరువాత మొదట పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించి ఆ తరువాత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేలా రోడ్‌ మ్యాప్‌ రూపొందించారు. కానీ ఇప్పుడు ఆర్మీ చీఫ్‌కు అధికార పీఠాన్ని అప్పగించడానికి పార్లమెంట్‌ ఎన్నికల కంటే ముందే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది.

Check Also

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *