మంచి మనుషులు – స్పెషల్ స్టోరీ

1)     దైవాన్ని స్మరించేవారు,  స్మరించని వారి పోలిక ప్రాణమున్న జీవులు, ప్రాణం  లేని  మృతుల్లాంటిది. (బుఖారి` హజ్రత్‌ అబూమూసా అష్‌అరీ(ర)

2)     దేవుడు  ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త(స) అన్నారు:‘నేను నా దాసుడు తలచేవిధంగా అతని తలంపుకు దగ్గరిగా ఉంటాను. దాసుడు నన్ను జ్ఞాపకం  చేసుకున్నప్పుడు నేనతని వెంట ఉంటాను. అతను నన్ను తన మనసులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనతణ్ణి నా మదిలో గుర్తుచేసుకుం టాను. అతను  గనక  నన్ను సమా వేశంలోగుర్తుచేసుకుంటే నేనతన్ని దానికన్నా శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తు చేసుకుంటాను. (దైవదూతల సమావేశంలో అనిఅర్థం) (బుఖారి, ముస్లిం`  హజ్రత్‌ అబూహురైరా(రజి)

3)     అన్నిటికన్నా అత్యుత్తమమైన ధ్యానం ‘లాయిలాహ ఇల్లల్లాప్‌ా’ అని పల కటం. (తిర్మిజీ, హజ్రత్‌ జాబిర్‌(రజి))

4)     నేను మీకు  స్వర్గ  ఖజానాల్లోని ఒక ఖజానా గురించి తెలుపనా? అని ప్రవక్త(స) అన్నారు.  తెల్పండి, దైవ ప్రవక్తా(స)! అని చెప్పటం జరిగింది. ‘లా హౌల వలా ఖువ్వత ఇల్లాబి ల్లాప్‌ా’ అని ఆయన(స) చెప్పారు. (బుఖారి, అబూ మూసా అష్‌అరీ (రజి)

geeturai_weekly_magazine_18_3
5)     ఎవరైనా రోజుకి వెయ్యి పుణ్యాలు సంపాదించగలడా?  అని  ప్రవక్త(స) అడిగినప్పుడు   దైవప్రవక్తా(స)! రోజుకు  వేయి  పుణ్యకార్యాలు ఎవ రైనా చేయగలడా? అన్నాడో వ్యక్తి. ‘సుబ్‌హానల్లాప్‌ా’ వందసార్లు పలికితే వెయ్యి పుణ్యాలు లభిస్తాయి.  లేదా వెయ్యి తప్పిదాలు తుడిచివేయబడ తాయి అని  ప్రవక్త(స)  తెలిపారు. (ముస్లిం` హజ్రత్‌ సాద్‌ బిన్‌ వఖ్ఖాస్‌ (రజి)

6)     రెండు వచనాలున్నాయి. అవి పలక టానికి  తేలికగా,   సులభంగా             ఉంటాయి. త్రాసులో మాత్రం చాలా బరువుగాఉంటాయి. కరుణామయు డైన దేవుడికి  చాలా  ప్రియమైనవి. అవి ‘సుబ్‌హానల్లాహి వ బిహందీహీ, సుబ్‌హానల్లాహిల్‌ అజీం’ (బుఖారి, ముస్లిం` హజ్రత్‌ అబూహురైరా(రజి))

7)     ‘సుబ్‌హానల్లాప్‌ా, అల్‌హమ్దులిల్లాప్‌ా, లాయిలాహ  ఇల్లల్లాప్‌ా’  ఇంకా ‘అల్లాహు అక్బర్‌’ అని  పలకటం సూర్యుడు ఉదయించే వస్తువులన్నిం టికంటే ప్రియమైంది.  (ముస్లిం` హజ్రత్‌ అబూ హురైరా(రజి)

8)     పొద్దున, సాయంత్రం ఈ దుఆ పఠిం చమని ప్రవక్త(స) ఉపదేశించారు:
‘అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్‌ అర్జి. ఆలిమల్‌ గైబి వష్షహాదతి రబ్బి కుల్లిషైయిన్‌. వ మలీకహూ అష్‌హదు అల్లాయిలాహ  ఇల్లా అంత అవూ జుబిక మిన్‌షర్రి నఫ్సీ వషర్రి ష్షయి తాని వ షిర్కిహి’
(ఓ అల్లాప్‌ా! భూమ్యాకాశాలను సృష్టిం చినవాడా! గోచరాగోచర విషయాలు తెలిసినవాడా! ప్రతి వస్తువుకి యజ మాని అయిన పాలకుడా! నీవు తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నా మనసు రేపే కీడు నుండి షైతాన్‌ రేపే చెడు తలంపుల నుండి అతని సాన్నిహిత్యం నుండి  శరణు  వేడుకుంటున్నాను. (తిర్మిజీ,   హజ్రత్‌ అబూబకర్‌ సిద్దిఖ్‌ (రజి))

9)     దైవప్రవక్త(స) ఉదయం, సాయంత్రం ఈ దుఆ పఠిస్తూ ఉండేవారు. ఇంకా ఎవరైతే ఈ దుఆ పఠిస్తాడో అంతిమ దినాన దైవం అతణ్ణి తప్పనిసరిగా తృప్తి పరుస్తాడని అనేవారు.
‘రజీనా బిల్లాహి రబ్బన్‌ వబిల్‌ ఇస్లామి దీనన్‌ వబి ముహమ్మదిన్‌ సల్లల్లాహు అలైహి వసల్లమ నబియ్యవ్‌ వ రసూలవ్‌’
(అల్లాప్‌ాయే  పాలకుడని, ఇస్లామే ధర్మమని,  ముహమ్మద్‌(స) ప్రవక్త, సందేశహరులని మేము అంగీకరి స్తున్నాం) (హసన్‌, హుసైన్‌` హజ్రత్‌ అనస్‌(రజి))

10)     ఓరోజు  దైవప్రవక్త(స)  ముందర ఇద్దరు  మనుషులకు  తుమ్ము వచ్చింది. వారిలో   ఒకతను   చాలా మర్యాదస్తుడు.   అతను  తుమ్మి నప్పుడు  ‘అల్‌హమ్దులిల్లాప్‌ా’  అని పలికలేదు.  మరొకతను పలికాడు. దైవప్రవక్త(స) రెండో వ్యక్తికి ‘యర్‌హ ముకల్లాప్‌ా’ అని బదులు పలికారు. నేను  తుమ్మినప్పుడు  మీరు (స) బదులు పలకలేదు కదా! అని మర్యా దస్తుడు  అన్నాడు.  అతను దైవాన్ని స్మరించాడు.  అందుకే  నేనతన్ని జ్ఞాపకం పెట్టుకున్నాను. నీవు దేవున్ని విస్మరించావు.  కాబట్టి  నేను కూడా నిన్ను మరచాను అని  జవాబిచ్చారు ప్రవక్త(స). (మస్నదె అహ్మద్‌` హజ్రత్‌ అబూహురైరా(రజి)
గమనిక :  ‘యర్‌హముకల్లాప్‌ా’ విన్న తర్వాత తుమ్మినవాడు ‘యప్‌ాదీకు ముల్లాప్‌ా’ (అల్లాప్‌ా నీకు మార్గదర్శకం చేయుగాక) అని అనాలి.

11)     దైవప్రవక్త(స) మరుగుదొడ్లో ప్రవేశించే టప్పుడు ఈ దుఆ పఠించేవారు :
‘‘అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్‌ ఖుబుసి వల్‌ ఖబాయిస్‌’
(ఓ అల్లాప్‌ా! నేను మగ, ఆడ జిన్నాతుల కీడు  నుండి  నీ శరణు కోరుతు న్నాను.) (తిర్మిజీ`హజ్రత్‌ అనస్‌(రజి))

12)     మరుగుదొడ్డి నుండి బయటికి వచ్చే టప్పుడు ఆయన(స) ఇలా పలికే వారు : ‘గుఫ్‌రానకల్లాహుమ్మ’
(ఓ దేవా! మేము  నీ  నుండి మన్నిం పును కోరుకుంటున్నాము) (హసన్‌ హుసైన్‌` హజ్రత్‌ అయిషా(రజి)

13)     దైవప్రవక్త(స) ఏ రోగినైనా పరామర్శిం చటానికి వెళితే అతని తలాపి దగ్గర కూర్చొని ఏడుసార్లు ‘అస్‌అలుల్లా హల్‌ అజీమ రబ్బల్‌ అర్షిల్‌ అజీమి అఁయ్యష్‌ఫియక’ అని పలికేవారు.  (నీకు స్వస్థత చేకూర్చాలని,  గొప్ప  సింహాసనానికి అధిపతి మహోన్నతు డైన  దైవాన్ని   వేడుకుంటున్నాను) (మిష్కాత్‌` హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి))

14)     మొదటి  తేదీ  చంద్రుణ్ణి చూసి నప్పుడు  ఇలా ప్రార్థించాలి : ‘అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్‌ అమ్ని వల్‌ ఈమాని వస్సలామతి వల్‌ ఇస్లామి వత్తౌఫీఖి లిమా తుహిబ్బు వ తర్జా రబ్బి వరబ్బుకల్లాప్‌ా’
(ఓ అల్లాప్‌ా! ఈ చంద్రుణ్ణి మాపై శుభం సమృద్ధితో, విశ్వాసం, శాంతితో ఇంకా ఇస్లాంతో కూడుకున్నదిగా నీకిష్టమైన నీవు  మెచ్చిన రీతిలో               ఉదయింపజేయి.  ఓ చంద్రమా! నీ ప్రభువు, నా  ప్రభువు అల్లాప్‌ాయే) (హసన్‌ హుసైన్‌)

15)     ప్రవక్త మహనీయులు(స) ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఇలా పలికేవారు :
‘బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి అల్లా హుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్‌ అన్‌నజిల్ల అవ్‌నుజల్ల వఅన్‌ నజిల్ల అవల్‌ నుజల్ల అవ్‌ నజ్‌లిమ అవ్‌ యుజులమ అలైనా అవ్‌ నజ్‌హల అవ్‌ యుజ్‌హల అలైనా’
(అల్లాప్‌ా పేరుతో (నేను బయలుదేరు తున్నాను)  నేను అల్లాప్‌ాపై భారం మోపాను.  ఓ అల్లాప్‌ా!  మా అడు గులు  కంపించకుండా  లేదా మరొకరు మమ్మల్ని మార్గభ్రష్టతకు లోను చేయకుండా మేము స్వయాన పెడద్రోవ  పడకుండా  లేదా ఇత రులు  మమ్మల్ని పెడత్రోవ పట్టించ కుండా, మేము ఇతరులపై దౌర్జన్యం చేయకుండా లేదా ఇతరులు మాపై దౌర్జన్యం చేయకుండా ఉండాలని. మేము స్వయాన అజ్ఞానంతో వ్యవహ     రించకుండా లేదా మరొకరు మా పట్ల  అజ్ఞానంతో ప్రవర్తించకుండా              ఉండాలని  నీ శరణు కోరుకుంటు న్నాను. (మస్నదె అహ్మద్‌` హజ్రత్‌              ఉమ్మె సల్మా(రజి)

16)     ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఈ దుఆ పఠిస్తే షైతాన్‌ దుష్ట పేరణల నుంచి మనిషి రక్షించబడ తాడు.
‘బిస్మిల్లాహి తవక్కల్‌తు అలల్లాహి వలా హౌలవలా ఖువ్వత ఇల్లా బిల్లాప్‌ా’
(అల్లాప్‌ా నామంతో, నేను అల్లాప్‌ాపై భారం మోపాను. అల్లాప్‌ా సహాయం లేకుండా రక్షణనిచ్చే శక్తిగాని, మరే శక్తి పొందే తాహతు గాని నాకు లేదు. (తిర్మిజీ` హజ్రత్‌ అనస్‌(రజి)

17)     మనిషి తనఇంట్లో ప్రవేశించేటప్పుడు ముందుగా ఈ దుఆ చదవాలి. ఆపై ఇంట్లో వారికి ‘అస్సలాము అలైకుమ్‌’ అని అనాలి. ‘‘అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఖైరల్‌ మౌలజి వ ఖైరల్‌ మఖ్‌రజి బిస్మిల్లాహి వలజ్‌నా, వ బిస్మిల్లాహి ఖరజ్‌నా, వఅలల్లాహి రబ్బినా తవక్కల్‌నా’’
ఓ అల్లాప్‌ా! నేను ఇంట్లో ప్రవేశించే, ఇంటి నుంచి బయలుదేరే మేలును అడుగుతున్నాను.  మేము  అల్లాప్‌ా పేరుతోనే ప్రవేశించాము. ఆయన పేరుతోనే  బయలుదేరాము.  మా ప్రభువుపైనే నమ్మకం పెట్టుకున్నాం.) (అబూదావూద్‌ `  అబూ మాలిక్‌ అష్‌అరీ(ర)    (మిగతా వచ్చేవారం)

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *