ముళ్ళ గులాబి

సమ్రీన్‌ పదహారేళ్ళ చలాకీ, తెలివిగల అమ్మాయి.  ఎప్పుడూ చిన్న పిల్లలతో ఆడుతూ, వారి నవ్వుల కేరింతల మధ్య తను  ఆనందంగా  ఉండేది.  తను నేర్చు కున్న విద్యను ఆ పేద పిల్లలకు పంచుతూ అందరికీ  ఆదర్శంగా  నిలిచేది. సమ్రీన్‌ మంచి గుణగణాలను చూసి ఆమె కోసం ఎన్నో పెళ్ళి సంబంధాలు వచ్చాయి. కానీ సమ్రీన్‌ తల్లిదండ్రులకు, అప్పుడే పెద్ద కూతురైన  అమ్రీన్‌  వివాహం  చేసి వుండటం వల్ల మళ్ళీ వెంటనే సమ్రీన్‌ వివాహం చేయలేక  ఆ వచ్చిన సంబం ధాలను నిరాకరించారు. మంచి గుణ వంతురాలైన సమ్రీన్‌ను ఎవరు కోడలుగా చేసుకోవాలని అనుకోరు? ఆమె కోసం సంబంధాలు రావడం ఆగలేదు. చివరికి తల్లిదండ్రులు  అప్పు  తెచ్చి  తమ తాహతుకు మించి కట్నకానుకలు  ఇచ్చి సమ్రీన్‌ వివాహం ఘనంగా చేశారు.  geeturai_weekly_magazine_17_3

తల్లి దండ్రులను, తను పుట్టి పెరిగిన ఇంటిని వదిలి అందరి, ఆత్మీయుల కళ్ళల్లో అశ్రువులు నింపి అత్తగారింటికి ప్రయాణమైంది ఎన్నో అందమైన కలలు కంటూ. తను నేర్చుకున్న సంస్కారం, విద్యాబుద్ధులతో తన అత్తగారింట్లో ఒక మంచి కోడలిగా, ఒక  మంచి  భార్యగా కావాలని దైవాన్ని ప్రార్థిస్తూ అత్తగారింట అడుగు పెట్టింది. సమ్రీన్‌ ఊహించినట్టుగానే తన ఆడ పడుచులతో, తోటి కోడళ్ళతో తన కలుపు గోలుతనం  వలన అందరి మనసుల్లో స్థానం   సంపాదించింది. తన అత్తగారిలో అమ్మను వెతుక్కుంటూ మామయ్యను గౌరవిస్తూ ఉంటుంది. సమ్రీన్‌ వైవాహిక జీవితంలో రెండు సంవత్సరాలు సాఫీగా సాగాయి.  గులాబీ చెట్టుకు ముళ్ళున్న ట్టుగానే సమ్రీన్‌ జీవితంలో కూడా కష్టాల ముళ్ళు గుచ్చుకోసాగాయి. వ్యాపారంలో నష్టం రావడంతో తన భర్త ఆర్థిక పరిస్థితి క్షీణించి కృంగిపోయాడు. మావయ్య ఎంత సహాయం చేసినా లాభం లేక బాధలలో మునిగిపోయాడు భర్త రహీమ్‌. క్రమంగా రహీమ్‌ సమ్రీన్‌ను వేధించసాగాడు. తనను అప్పటివరకు గౌరవించిన తన ఆడపడు చులు చీదరిస్తూ బానిసలా చూడసాగారు. అయినా అవేమీ పట్టనట్టుగా తన అత్తగారి ఇల్లే సర్వస్వంగా భావిస్తూ తన అత్త మామ సేవలో రోజులు గడుపుతూ ఉంటుంది. అయినా కుటుంబ సభ్యుల ఆక్రోశాలకు రోజూ బలిఅవుతూ ఆర్థికసంపాదన లేని నువ్వు బరువైపోయావు అనే సూటిపోటి మాటలతో సమ్రీన్‌ సున్నిత హృదయాన్ని బాధపెడుతూ ఉన్నారు.

ఇంత కష్టకాలం లోనే సమ్రీన్‌కు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమ్రీన్‌ బాధలకు దేవుడు కొంచెం ఉపశమనం ఇచ్చాడనే ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు.  సమ్రీన్‌కు అత్తింట్లో కష్టాలు పరాకాష్టకు చేరాయి. సమ్రీన్‌ సహనానికి ఒక పరీక్షగా మారింది. చివరికి అదనపు ఇంటి నుంచి గెంటేశారు. తన అత్తమామలను  ఎంతగా  పాధేయ పడినా గర్భవతి అని కూడా  చూడకుండా కరుణించక పోవడంతో  భారంగా అడుగు బయటకు వేస్తూ తన ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కలియచూస్తూ కన్నీళ్ళ పర్యంతం అయి సముద్రపు అలలా వచ్చే దుఃఖాన్ని ఆపలేక పుట్టింటికి బయలుదేరింది. తనను పెళ్ళి చేసి పంపిన పేద తల్లిదండ్రు లకు  తన  ముఖం  ఎలా చూపించాలో తెలియక  కుమిలిపోయింది. అంతలో పురుటి  నొప్పులతో  బాధపడుతున్న సమ్రీన్‌ను తన  దూరపు బంధువులు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. సమ్రీన్‌ బాధను చూడలేక ఆకాశం కూడా కుండ పోత  వర్షాన్ని  కురిపించసాగింది. ఉరుములు మెరుపుల  మధ్యనే మరో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి శాశ్వతంగా వరకట్నపు తుఫానుకు నేలకు రాలింది ఒక తెల్లగులాబీ సమ్రీన్‌.

సమ్రీనే కాదు సమాజంలో ఎందరో మహి ళలు వరకట్నపు దురాచారానికి బలవుతూ తమ పిల్లలను అనాథలను చేస్తూ తమ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి శాశ్వతంగా దూరమవుతున్నారు.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *