మైనారిటీ నిధులను ఖర్చుపెట్టని బీహార్‌ ప్రభుత్వం

బీహార్‌లో ముస్లిమ్‌ జనాభా అధికంగా ఉన్న 7 జిల్లాల్లో మల్టీ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు పెట్టలేదు. ఈ నిధులను సమయం ముగిసిందని వెనక్కి తిప్పి పంపడం జరిగిందని బీహార్‌ శాసనసభ హౌస్‌ కమిటీ, అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టిన నివేదికలో స్పష్టం చేశారు. సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిమ్‌ల పరిస్థితులు మెరుగు పరచడానికి  భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ముస్లిమ్‌లు అధికంగా ఉన్న 90 జిల్లాలలో అన్ని రంగాల్లో ముస్లిమ్‌ల సమగ్ర అభివృద్ధి స్పెషల్‌ ఫండ్‌ క్రింద ఈ నిధులను కేటాయించారు. అంతర్జాతీయ మైనార్టీ దినోత్సవం సందర్భంగా మిల్లత్‌ బేదారి ముహిమ్‌ అనే సామాజిక సంస్థ ఢల్లీిలో జరిపిన బైఠాయింపు కార్యక్రమంలో అలీఘర్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి పునరుద్ధరించమని, సచర్‌ కమిటీ నివేదికని అమలు పరచమని, ఉర్దూకు తగినంత ప్రాతినిధ్యం కల్పించమని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రారంభించే ప్రతి పథకంలో అల్ప సంఖ్యాకులైన ముస్లిమ్‌లకు తగినంత స్థానాలు కేటాయించమని కోరింది.

మలేషియా తరహాలో హజ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

హజ్‌ సబ్సిడీని రద్దు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా మలేషియా తరహాలో హజ్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కె. రహ్మాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. దీనిద్వారా హజ్‌ విధిని నిర్వర్తిం చాలనుకున్న ప్రతీ వ్యక్తి హజ్‌ పూర్తి చేసుకు నేందుకు  సులభంగా  వీలవుతుందని తెలిపారు. వచ్చే 10 యేళ్ల లోపు హజ్‌ సబ్సిడీ విధానం  పూర్తిగా  రద్దవుతుంది. కనుక కేంద్రం హజ్‌ కౌన్సిల్‌ విధానానికి ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ కౌన్సిల్‌ కార్యకలాపాలకనుగుణంగా హజ్‌ చేయాలనుకునేవారు ప్రతి నెల కొంత మొత్తంలో ధనాన్ని ప్రభుత్వం, ఎన్‌జీఓ ద్వారా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల్లో జమ చేయాల్సి ఉంటుంది. హజ్‌ చేయడానికి సరిపడేంత ధనం జమ అయిన తరువాత ప్రభుత్వం ద్వారా వారు హజ్‌ కార్యాన్ని నిర్వర్తించ్చవచ్చని చెప్పారు.

 

పోలీసు, రెవిన్యూ శాఖల సహాయంతో వక్ఫ్‌ ఆస్తుల రక్షణ

పోలీసు, రెవిన్యూ శాఖల సహాయం తో రాష్ట్రంలోని      వక్ఫ్‌ ఆస్తుల      పరిరక్షణకు       చర్యలు చేపడ     తామని మైనారిటీ సంక్షేమ కమిష నర్‌, వక్ఫ్‌ బోర్డు ప్రత్యేకాధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ తెలిపారు. వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా వాటిని అడ్డుకునేందుకు పూనుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విలువైన వక్ఫ్‌ ఆస్తులున్నాయని, ఎవరైనా వాటిని ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని ఆయన చెప్పారు. దీనిపై పోలీసు శాఖకు లేఖలు రాశామన్నారు. రెవెన్యూ శాఖ సహకారాన్ని  కోరినట్లు  తెలిపారు. వక్ఫ్‌ ఆస్తులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంద న్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.200 కోట్ల బడ్జెట్‌ ఇవ్వాలని, కొత్తగా వసతి గృహాలు, గురుకు లాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రాష్ట్రంలో  ఎంత మేరకు వక్ఫ్‌ భూములు ఆక్రమణకు  గురయ్యాయనే  సమాచారం  త్వరలోనే సేకరిస్తామన్నారు.

 

మరోసారి నానావతి కమిషన్‌ గడువు పెంపు

2002లో గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై విచారణకు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్‌కు మరో ఆరు నెలల గడువు పొడిగించారు. ఇప్పటికి కమిషన్‌ గడుపు పొడిగించడం ఇది 21వ సారి. తాజాగా 2014 జూన్‌ 30 వరకూ నానావతి కమిషన్‌ గడువు పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విచారణ నివేదిక పూర్తవడానికి మరికొంత సమయం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ కమిషన్‌ను 2002 మార్చి 6వ తేదీన జస్టిస్‌ నానావతీ మరియు జస్టిస్‌ కె.జీ షాప్‌ా సభ్యులతో ఈ కమీటీని నియమించడం జరిగింది.

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *