రాజముద్ర చార్మినార్

చార్మినార్‌కు నాలుగు ముఖాలు. హైదరాబాద్‌కు గొడుగుపట్టే ఈ అద్భుత నిర్మాణానికి బహు చారిత్రక వ్యాఖ్యానాలు. పునాది రాయి ఎప్పుడు, ఎందుకు, ఎలా పడినా… తెలంగాణ రాజముద్రలో ఒదిగి తన ఉజ్వల చరిత్రలో మరో అంకానికి ఇప్పుడు చార్మినార్‌ తెర తీసింది. అయితే, నిజాం కాలంలో నాణేలు, కరెన్సీపై చార్మినార్‌ ముద్ర ఉండేది. స్వాతంత్య్రా నంతరం హైదరాబాద్‌ రాష్ట్రం యూనియన్‌ ప్రభుత్వంలో విలీనం అయిననాటి నుంచి ఈ చిహ్నం ప్రాధాన్యతని కోల్పోవడం మొదలయింది.
geeturai_10
కళా దర్శనం
31.95  మీటర్ల  చతురస్రాకార అపురూప కట్టడం ఇది. నాలుగువైపులా 11 మీటర్ల వెడల్పు 20  మీటర్ల ఎత్తులో కమాన్లు ఆకాశంలోకి చూస్తుంటాయి. హిందూ` ముస్లిం` సిక్‌`సాయి’…  ‘చార్మినార్‌ కా చార్‌ సిపాయి’గా సుప్రసిద్ధమై మత సామ రస్యతకు  ఇవి ప్రతిబింబాలు.  నాలుగు వైపులా క్రింది నుంచి పైకి ఎక్కడానికి 180 మెట్లను సర్పిలాకారంలో నిర్మించారు. రెండంతస్తుల నిర్మాణంలో కింది వైపు చిన్న కమాన్ల వసారాలున్నాయి. రెండో అంత స్తులో మసీదు ఉంది. ఇందులో ఒకేసారి 45 మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రార్థన లకు ముందు కాళ్లు చేతులు శుభ్ర పర చుకునేందుకు(వుజూ)చార్మినార్‌ నిర్మాణం మధ్య భాగంలో నీటి కొలను ఉంటుంది. ఈ బృహత్తర నిర్మాణం గోల్కొండ నవాబు కులీకుతుబ్‌షా హయాంలో క్రీ.శ 1591లో మొదలయి క్రీ.శ. 1595లో పూర్తయింది. ఎనిమిది వేల మంది కూలీలు, వాస్తు నిపు ణులు సుమారు నాలుగేళ్ళ పాటు పాలు పంచుకున్నారు.

ఆసక్తికర కథనాలు
నగరానికి  మంచి నీటిని పంపింగ్‌ చేయ డానికి నిర్మాణమయింది.
న అరబ్బీ చదివే విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు కట్టారు.
న అప్పట్లో విరుచుకుపడిన ప్లేగు మహ మ్మారి  కొన్ని  వేల  మందిని బలి తీసు కున్నది. వారందరి  స్మృత్యార్థం ఏర్పాటు చేశారు.

చార్మినార్‌లో మస్జిద్‌
చార్మినార్‌ అనగానే నాలుగు గుమ్మటాలు అని మాత్రమే జనానికి తెలుసు. కానీ ఈ నిర్మాణం సిగలో అత్యంత సుందరంగా నిర్మించిన ఒక మస్జిద్‌ ఉంది. అది చూప రుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 1591` 92 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మిం చిన ఈ  తాజియా  ముహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కళాభిరుచికి ప్రతీకగా నిలు స్తోంది.  పవిత్ర మొహర్రం నెలలో సుల్తాను ఇక్కడ  సభ  ఏర్పాటు చేసి ప్రార్థన చేసే వారని ప్రతీతి.  ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా  ప్రకారం  చార్మినార్‌ కట్టడం అనేది ఒక మదర్సా,  మస్జిద్‌. 1958లో ఆర్కియాలజీ సర్వే చార్మినార్‌ కట్టడాన్ని స్వాధీనం చేసుకొని అక్కడి మసీదును, మదర్సాను మూసివేశారు. కుతుబ్‌షాహి వంశపాలకుడు సుల్తాన్‌ ముహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1591లో చార్మినార్‌ను నిర్మిం చారు.  మొదటి  అంతస్తులో  మదర్సా, రెండో అంతస్తులో మస్జిద్‌ ఉంది.

చార్మినార్‌ రెండో అంతస్తులోని ఈ మస్జిద్‌ నిర్మాణ విశేషాలు
పూర్తిగా గ్రానైడ్‌ రాళ్ళతో అత్యంత సుందరంగా నిర్మించబడిరది.
ఒకేసారి 45 మంది ప్రార్థనలు చేసు కునేందుకు అనువుగా ఉన్న నిర్మాణ మిది.
మస్జిద్‌  ముందు ఆవరణలో వంద లాది మంది నమాజు (ప్రార్థన) చేసు కోవటానికి వీలుంది.
ఈ మస్జిద్‌కు వెళ్ళాలంటే… చార్మినార్‌ పైకి 75 మెట్లు ఎక్కి చేరుకోవాల్సి ఉంటుంది.
మస్జిద్‌ గోడలపై అద్భుతమైన పని తనం  నేటికీ  చెక్కుచెదరలేదు. ముఖ్యంగా  వాటిలో  తీర్చిన ద్రాక్ష తీగలు, పైనాపిల్‌ ఫలాలు, మధ్యన పొద్దు తిరుగుడు పూలు, గులాబీ పుష్పాలను తీర్చిదిద్దిన తీరు ప్రత్యేక ఆకర్షణ.

ఈ  ఫలాల  తీగలపై  పక్షులు, ఉడుతలు,  రామచిలుకల బొమ్మ లను చెక్కారు.
మస్జిద్‌ చుట్టూ తూర్పు వైపు 11, ఉత్తర దక్షిణాలకు  పదేస ి చొప్పున కమాన్లు ఉన్నాయి.
ఇక్కడి కిటికీలకు తీర్చిన జాలీలు అద్భుతమైన నిర్మాణ కౌశలాన్ని చాటి చెబుతున్నాయి.
చార్మినార్‌కు  నలువైపులా  ఉన్న నాలుగు మినార్లు 56 మీటర్లు ఎత్తైన విగా ఉండగా…  రెండవ అంతస్తు లోని  మస్జిద్‌  భూమి నుంచి 34 మీటర్ల ఎత్తులో ఉంది.
ప్రార్థన అనంతరం కిందికి దిగడానికి రెండు వైపుల నుంచి ఏర్పాట్లు  ఉన్నాయి.
ఈ మస్జిద్‌ వెలుపలి భాగంలో 1889   లో ఏర్పాటు చేసిన గడియారాలు నమాజు వేళల్ని తెలియజేసేవని చెబుతారు.
ఈ విశేషాలన్నీ కాలగర్భంలోని అవశేషా లుగా మారిపోయాయి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *