వాటికన్ సిటీలో అజాన్

వాటికన్‌ నగర చరిత్రలో మొదటిసారిగా 2014 జూన్‌ 8న   అజాన్‌,  నమాజ్‌ నిర్వ హించబడిరది.  పలస్తీనా, ఇస్రాయెల్‌కు చెందిన ప్రభుత్వాధినేతలను పోప్‌ వాటికన్‌ సిటీకి పిలిచారు. ప్రపంచంలోని ప్రముఖ మూడు మతాల వారు కలిసి నిర్వహించే ఉమ్మడి ప్రార్థనలలో పాల్గొనమని ఆహ్వా నించారు. పలస్తీనా, ఇస్రాయీల్‌ మధ్య జరిగే శాంతి చర్చలలో తన జోక్యం అప్ర స్తుతం అయినప్పటికీ మూడు మతాల వారు కలిసి ఉమ్మడిగా జరిగే ప్రార్థనలలో పాల్గొనటం  ద్వారా  శాంతి వాతావరణం సృష్టించబడి శాంతి చర్చలు సఫలమవు తాయని ఆశించారు.

ప్రార్థనలలో  ఒక  ముస్లిం విద్వాంసుడు, యూదు మతానికి చెందిన రాబి పాల్గొన్నా రని పోప్‌ ప్రకటించారు. ఈ ఉత్సవం పోప్‌ ఇంట్లోని సెంట్రల్‌ చర్చి గార్డెన్‌లో జరి గింది. ఈ ప్రార్థనలకు ‘హృదయాల నుంచి వచ్చిన ప్రార్థనలు’ అని నామకరణం చేశారు. సాధారణంగా ఆదివారం ప్రార్థనల అనంతరం క్రైస్తవుల కోసం ప్రత్యేక ప్రార్థన లను సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో ఉదయం నిర్వహిస్తారు. పోప్‌ ప్రత్యేక ఆహ్వానంపై ఈ ప్రార్థనలు నిర్వహించారు. కొంతమంది వీటిని వ్యతిరేకించారు. వారి అభిప్రాయం ప్రకారం వాటికన్‌ సిటీ చరిత్రలో ఇంతవరకు అజాన్‌ ఇవ్వబడలేదు. నమాజ్‌ నిర్వహింపబడలేదు.geeturai_weekly_13

ఈ ప్రార్థనలలో   మూడు  మతాలకు చెందిన  వారు  తమ  తమ ప్రార్థనలను నిర్వహించారు. ఆ  తరువాత ఉమ్మడి ప్రార్థన  జరిగింది.   అందులో దివ్య ఖుర్‌ఆన్‌తో సహా భిన్న మతాలకు చెందిన దైవగ్రంథాలలోని శాంతి, భద్రతకు చెందిన వాక్యాల పారాయణం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విలేకరులు ఈ ప్రార్థనా ఉత్సవాలకు హాజ రయ్యారు. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలోని 59 టీవీ స్టేషన్లు, 200 రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారం చేశారు.

పలస్తీనా, ఇస్రాయీల్‌ దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు ఉమ్మడి వేదికనుండి ప్రసంగించారు. అదే విధంగా అన్ని మతాల నాయకులు ఒకరు ఇంకొకరి మత ప్రార్థన లలో పాల్గొన్నారు.

పలస్తీనా  అధ్యక్షుడు  అబ్బాస్‌ వెంట పలస్తీనా  ఇమాముల  యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌, పలస్తీనాకు చెందిన మరొక మత నాయకుడు వాటికన్‌ సిటీ వెళ్ళారు.  ఇమామ్‌ షేక్‌ ముహమ్మద్‌ అజాన్‌ ఇచ్చారు. నమాజ్‌కు నాయకత్వం వహించారు. ప్రముఖ యూదు మత రాబి, యూదుల మత గ్రంథమైన తల్మూడ్‌ గ్రంథ నిపుణుడు రసోన్‌ ఆరోసి, డాని యల్‌ వాటికన్‌ సిటీ వెళ్ళారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ స్వయంగా ఇతర  మతాలకు చెందిన ప్రార్థనలలో పాల్గొన్నారు.  శాంతిని సాధిం చడంలో ఇది  ఒక  ముందడుగుగా భావించవచ్చును. పోప్‌ స్వయంగా ఈ ఉత్సవానికి నాయకత్వం వహించారు.

వైశాల్యంలో, జనాభాలో చిన్నదైనప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో వాటికన్‌ సిటీ ప్రధాన పాత్ర వహిస్తోంది.  ఇది  ప్రపంచంలో మిక్కిలి సౌభాగ్యవంతమైన నగరం. 44 ఎకరాలలో ఈ  నగరం నిర్మించబడిరది. 1929లో ఇటలీ పాలకుడు ముస్సోలినీ, 11వ పోప్‌ పాల్‌ మధ్య జరిగిన ఒప్పంద ఫలితంగా వాటికన్‌కు పూర్తి రాజ్య ప్రతిపత్తి కల్పించబడిరది. వాటికన్‌ సిటీ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వంను కలిగివుంది.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *