విజ్ఞానమే వెలుగు అజ్ఞానమే చీకటి

ఇస్లాంకు పూర్వం అనేక జాతుల్లో స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది కాదు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరైతే శత్రువులతో ధీటుగా పోరాడుతారో, జాతిని రక్షించే బాధ్యతలు నిర్వహిస్తారో వారికే ఆస్తి హక్కును, కుటుంబాన్నిపోషించే హక్కులు కలిగివుండాలి. అంటే శారీరక బలం, పోరాడే శక్తికి ఎక్కువ ప్రాధాన్యత   ఉండేది. దీనిని జాతుల గర్వకారణంగా, అధికారాన్ని జయించటానికి సాధనంగా భావించేవారు.

ఏ జాతి అయితే విద్యా నైపుణ్యాల నుండి దూరంగా  ఉంటుందో  సంఖ్యాపరంగా ఎంత పెద్దగుంపు ఉన్నా కాని దాని యొక్క సామర్థ్యం విలువ మట్టికుప్పలాంటిది. అది ఎప్పుడూ  పాదాల  కింద పరువబడు తుంది. దీని గొప్ప ఉదాహరణ భారత దేశం.  మన  దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా గల దేశం. భౌగోళికంగా కూడా చిన్నదేమి కాదు. సహజ వనరుల క్కూడా మన దేశంలో కొదవలేదు. జపాన్‌ జనాభా పరంగాను, భౌగోళిక పరంగాను మనకన్నా చాలా చిన్న దేశం.  సహజ వనరుల పరంగానూ అది  మనకు పోటీ పడలేదు.  కాని  నేడు మనం జపాన్‌ ముందు చేయి  చాస్తున్నాం. ఈ దుస్థితికి విద్యాజ్ఞానాల్లో వెనుకబడడమే.

geeturai_weekly_magazine_17_4

ఇస్లాం  ఆవిర్భావం  రోజు నుంచే విద్యా జ్ఞానాలకు పెద్దపీట వేసింది. తన ప్రభువు పేరుతో చదవండి. ఎవరైతే సమస్త లోకాల సృష్టికర్త (సమస్త లోకాల సృష్టికర్త అయిన ప్రభువు పేరుతో చదవండి) అంటే అందరి కంటే ముందు దైవప్రవక్త(స)కు తర్వాత ప్రవక్త ద్వారా సమస్త మానవాళికి ‘విద్య’ గురించి సందేశమివ్వబడిరది. ఎందుకంటే విద్య అన్ని మంచి పనులకు మూలం. అన్ని చెడులకు, కలహాలను రూపుమాపు తుంది. అందుకే మహాప్రవక్త(స) విద్యను కాంతి,  వెలుగు అన్నారు. (అల్‌ అల్మ్‌ నూరున్‌)

ఇల్లు చీకటిలో ఉంటే అందులో దొంగల ముఠాలు దోచుకోవడం తేలికవుతుంది. ఆ ఇల్లు క్రిమికీటకాలు,  చీడ పురుగుల నివాస  స్థలంగా మారుతుంది.   వాటిలో ఒక్కొక్క రితో  ప్రతిఘటించటం కఠినతర మవుతుంది. కాని ఒక దీపాన్ని వెలిగించి నట్లయితే  ఆ  ఇల్లు కాంతిమయమవు తుంది. అప్పుడు దొంగల ముఠాలు, ఇంట్లో  రావటానికి సాహసించరు. క్రిమి కీటకాలు,  చీడ  పురుగులు ఆ ఇంటిని నివాస స్థలాలుగా  మార్చుకోవు. మహా ప్రవక్త(స) విద్యను  కాంతి అని చెప్పే ఈ సందేశం  ఇవ్వదలచుకున్నారు. ప్రతి చెడును రూపుమాపలేము. వాటిని ఒక్కొక్క టిగా ప్రతిఘటించడం తేలికైన విషయం కాదు. కాని అన్ని చెడులకు, రుగ్మతలకు, కలహాలకు మూలం.అజ్ఞానం, మూఢత్వం మరియు విద్యనుండి భ్రష్టుడవడం, ఏసమాజంలోనైతే విద్య యొక్క కాంతి విలసిల్లుతుందో ఆ సమాజంలోని రుగ్మ తలు, చెడులు తనంతట అవే దూరమవు తాయి. విద్య, జ్ఞానం యొక్క అగ్ని వాటిని ఊదిపారేస్తుంది.

మహాప్రవక్త(స) విద్య ప్రాధాన్యత ఎంత ఉండేదంట ే మక్కాలో అన్నిరకాల విప త్కర  పరిస్థితులున్నా  ఆయన ‘దారె అర్ఖమ్‌’ను విద్య, శిక్షణ కేంద్రంగా చేశారు. మొదటి  నుంచే  ప్రవక్త(స)గారు తన మిత్రుల విద్య,  శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.  మక్కా నగరం నుండి మదీన  నగరానికి వలస వచ్చిన తర్వాత మహాప్రవక్త(స)కి సొంత ఇల్లు కూడా అందుబాటులో లేకుంటే ఆయన(స) గారు హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ అన్సారీ(రజి) గారి ఇంట్లో అతిథిగా ఉన్నారు. తనకోసం తన  అనుయాయుల కోసం ఇంటి ఆలోచన చేయలేదు. కాని అందరికంటే ముందు ముస్లింల కోసం ప్రార్థన మంది రాన్ని, ఆధ్యాత్మిక కేంద్రంగా ‘మస్జిదె నబవి’ని  నిర్మించారు. దానికి ఆనుకొని ‘సుఫ్ఫ’ పేరుతో మొదటి విద్యాలయాన్ని కూడా నిర్మించారు. ఈ చిన్న విద్యాల యమే మొత్తం అరబ్బు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి  వచ్చే ముస్లింలకు చదు వుల నిలయంగా ఉండేది. మహాప్రవక్త(స) స్వయాన  ఆ విద్యాలయానికి నిర్వాహ కులు, ఉపాధ్యాయులుగా వ్యవహరించే వారు. మహాప్రవక్త(స) గారి ఈ కార్యాచరణ ప్రతి ముస్లిం సమాజానికి ఆదర్శం ఏ జాతి అయితే విద్యా కాంతి ద్వారా తమ ఇళ్ళను వెలిగించుకోదో ఆ జాతి ఉన్నత శిఖరాలను అధిరోహించదు.  వారి  జీవితాలు ప్రకాశ మానమైనవిగా ఉండవు.

ఒకవేళ మనం చరిత్రను అధ్యయనం చేసి నట్లయితే విద్యకు సంబంధించిన అనేక ఆశ్చర్యకర సంఘటనలు కనిపిస్తాయి. అలాంటి సంఘటనలో ఒకటి బదర్‌ యుద్ధ సమయంలో 70  మంది మక్కా వాసులు బందీలుగా ముస్లింలకు పట్టుబడ్డారు. ఆ సమయంలో ముస్లింలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి తినడానికి సరైన ఆహారం, అవసరానికి తగ్గ దుస్తులు కూడా లభించేవి కావు. స్వయాన మహా ప్రవక్త(స) గారి  ఇంట్లో వారాల పాటు పొయ్యి అంటించే భాగ్యముండేది కాదు. ఈ యుగం ముస్లింలు ఆర్థికంగా ఇబ్బం దులను ఎదుర్కొన్నారు. పేదరికం ద్వారా అనేక రోజులు పస్తులు ఉండాల్సివచ్చేది. ఇలాంటి  సందర్భంలో మహాప్రవక్త(స) గారు  మక్కావాసుల నుండి పరిహారంగా అత్యధికంగా  ధనాన్ని  అర్జించి మదీన వాసులు (ముస్లింలకు)  ఆర్థికంగా ఆదు కునే ప్రయత్నించేవారు. ఆర్థిక జీవనానికి కొంచెం  ఊతమిచ్చేవారు.  కాని మహా ప్రవక్త(స) బద్ర్‌ యుద్ధంలో ఖైదీలుగా పట్టు బడ్డ వారిని ఎవరైతే విద్యావంతులున్నారో చదవడం,  రాయడం తెలిసినవారున్నారో వారు పది  మంది ముస్లింలను చదవడం, రాయడం నేర్పించాలి  అనే పరిహారాన్ని విధించారు.  మహాప్రవక్త(స) ఈ కృత్యం ద్వారా ముస్లింలకు సందేశమివ్వదలుచు కున్నదేమిటంటే మనకు పస్తులుండాల్సి వచ్చినా,  ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రాపంచిక సుఖాలు తక్కువగా లభించినా కాని ప్రతి క్షణం పిల్లల విద్య, శిక్షణకు మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. జ్ఞాన సముపార్జన ఒక వరం. అది ఎవరి నుండి లభించినా తీసుకోవాలి. మహాప్రవక్త(స) గారు  తన  అనుయాయులకు అరబీ భాషతోపాటు  ఇతర భాషలను కూడా నేర్చుకోమని సూచించేవారు. అన్ని భాష లను దేవుడే సృష్టించాడు అని ప్రబోధిం చారు. విద్యను అర్జించడం ప్రతి ముస్లిం ధార్మిక కర్తవ్యంగా నిర్ణయించారు. మహా ప్రవక్త(స) ఇలా ప్రబోధించారు. మానవుడు చనిపోయిన  తర్వాత కూడా  అతనికి మూడు కార్యాల  ద్వారా  పుణ్యఫలం లభిస్తుంది. అందులో ఒకటి విద్య.

విచారకరమైన విషయమేమిటంటే  ఏ జాతికైతే అందరికంటే ముందు చదవమని ఆజ్ఞాపించబడి, అతనిచేతిలో కలాన్ని పెట్ట బడిరదో అదే జాతి నేడు అజ్ఞానంతో, నిరక్ష రాస్యతతో, విద్యభ్రష్టతతో కొట్టుమిట్టాడు తోంది.

ఈ దుస్థితి నుంచి, బయటపడాలంటే ముస్లిం వాడల్లో, జనవాసాల్లోని వీదుల్లో విద్య ఉద్యమం నడపాలి. తన ఇరుగు పొరుగు వారి పిల్లల చదువు గురించి ఆలో చించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదు ర్కొంటున్న కుటుంబాల పిల్లల విద్యపర మైన  బాధ్యతలు  తీసుకోవాలి. వారికి చేయూతనివ్వాలి.  విద్యను వ్యాపారంగా కాకుండా పూర్తిగా  జాతి ప్రయోజనాలను కోరుతూ పాఠశాలలను స్థాపించాలి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *