విద్యా కిరణాలు

జీనత్‌ ఫాతిమా

విద్య విలువైన భూషణం. అమూల్యమైన వరం. ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అవన్నీ వ్యర్థం. ‘విద్యలేని వాడు వింత పశువు’ అన్న నానుడి మనకు తెలిసిందే. విద్య, విజ్ఞానాలకు ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది.

book

దైవవాణి అయిన పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరణ ‘ఇఖర’ (చదువు) అనే వాక్యంతో ప్రారంభమయింది. ‘విద్యాభ్యాసం స్త్రీ పురుషులందరి విధి’ అన్నారు మహాప్రవక్త ముహమ్మద్‌(స). ‘విద్యార్జన నిమిత్తం ఎంత దూరమైనా వెళ్ళండి. భూమి అంచులకైనా సరే’అన్నారాయన. ఇంకా మహాప్రవక్త ‘జ్ఞానం` జీవితం,అజ్ఞానం` మరణం’ అని అన్నారు. ‘జ్ఞానులు, జ్ఞానం లేనివారు ఇరువురూ సమానం కాగలరా’ అని పవిత్ర గ్రంథం ఖుర్‌ఆన్‌ ప్రశ్నిస్తోంది. ఈ ప్రవచనాల ద్వారా విజ్ఞానులకు ఎంత ప్రాముఖ్యం ఉందో మనకు తెలుస్తుంది.

ఒకసారి సహాబాల ఎదుట ప్రవక్త ఇద్దరు వ్యక్తుల ప్రస్తావనను తీసుకొనివచ్చారు. వారిలో ఒకరు గొప్ప దైవభక్తిపరుడు. అనుక్షణం దైవధ్యానంలో లీనమై ఉంటాడు. మరొక వ్యక్తి ధార్మిక విద్వాంసుడు. ప్రవక్త(స) ఇలా అన్నారు ‘మీపై నాకున్న ప్రాధాన్యత ఎటువంటిదో ఆ దైవభక్తునిపై ఆ పండితునికి అలాంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే వేయి మంది దైవభక్తులకు భయపడని షైతాన్‌ ఒక్క జ్ఞానికి గడగడలాడిపోతాడు.

ఒకసారి మహాప్రవక్త(స) మస్జిదె నబవీ ముందు నుండి వెళ్తున్నారు. అప్పుడు అక్కడే పక్కపక్కనే రెండు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రవక్త(స) వారిని చూసి ఇవి రెండు మంచి సమావేశాలే. కానీ ఒక వర్గం చేస్తున్న దానికంటే మరొక వర్గం చేస్తున్నది ఇంకా మంచిపని. ఒక సమావేశంలోని వారు దైవధ్యానంలో, దైవ ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. దైవం కోరితే వారి ఆరాధనలను స్వీకరించనూ వచ్చు లేదా తిరస్కరించనూ వచ్చు. మరొక వర్గం వారు తమ సమావేశంలో విద్యాజ్ఞానాలను పరస్పరం బోధించుకుంటున్నారు. కనుక మొదటి వారు చేస్తున్న దానికంటే వీరు చేస్తున్నది చాలా గొప్ప పని, ఉత్తమమైన పని. నేను కూడా బోధకునిగానే పంపబడ్డాను. అని చెప్తూ ప్రవక్త(స) విద్యాబోధన జరుగుతున్న సమావేశంలో కూర్చున్నారు.

ఖుర్‌ఆన్‌లోని ఒక్క వాక్యం గురించి తెలుసుకోవడం దాని లోతులకు వెళ్ళటం 100 నఫిల్‌ నమాజులకన్నా ఎంతో శ్రేష్టమైనది.

ప్రవక్త(స) ఈవిధంగా బోధించారు. విద్యను అభ్యసించేవారి కోసం, ప్రజలకు మంచిని బోధించే వారి కోసం దైవదూతలతో సహా భూమ్యాకాశాలలో ఉన్న సృష్టిరాశులు, చివరికి రంధ్రాల్లో ఉండే చీమలు, సముద్ర గర్భాలలో ఉండే చేపలు, ఇతర జలచరాలన్నీ ప్రార్థిస్తూ ఉంటాయి.

తల్లిదండ్రులు తమ సంతానానికిచ్చే కానుకలలో ఉత్తమ విద్యకు మించిన కానుక మరొకటి లేదు. ఆస్తిపాస్తులు ఎన్ని సమకూర్చినా మంచి విద్యాబుద్ధులు, నైతిక శిక్షణ అందించకపోతే భావి తరాలకు అంధకారం తప్ప ఏమి మిగలదు.

ఖుర్‌ఆన్‌, హదీసు గ్రంధాల ద్వారా విద్య మానవుల్ని మంచివారుగా, సౌశీల్య వంతులుగా, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అరబ్‌ వాసులే.

ఖుర్‌ఆన్‌ అవతరణకు పూర్వం అరబ్బు సమాజం చెడులకు నిలయంగా ఉండేది. బహు దైవారాధన ప్రబలిపోయి వుండేది. కట్టుబాట్లు, నీతి నియమాలు, సచ్చీలత, సద్వర్తన, సిగ్గు, బిడియం లాంటివి ఏ కోశాన లేని నీచమైన స్థితి అరబ్‌ సమాజంలో ఉండేది. ఎటుచూసినా మద్యపానం, రక్తపాతం, వ్యభిచారం ఉండేవి. అటువంటి సమాజంలోనికి అల్లాప్‌ా తన పవిత్ర గ్రంథాన్ని పంపాడు. తన దైవగ్రంథం ద్వారా అజ్ఞానంలో పడివున్న అరబ్బు సమాజాన్ని ఉన్నతులుగా, పండితులుగా తీర్చిదిద్దాడు. అజ్ఞానాంధకారం నుండి వెలుగు కిరణాల వైపుకు మార్గాన్ని సుగమం చేశాడు. ఇటువంటి కట్టుబాట్లు లేని సమాజాన్ని ఖుర్‌ఆన్‌ ఏకేశ్వరోపాసన, దైవభీతి కలిగేలా చేస్తుంది. ఇదే విషయం ఖుర్‌ఆన్‌లో ఇలా తెలుపబడిరది.

అర్థం : యదార్థం ఏమిటంటే అల్లాప్‌ా దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు.

అల్లాప్‌ా దైవజ్ఞానం కలవారి స్థానాన్ని ఉన్నతం చేశాడు అని ఖుర్‌ఆన్‌లో ‘సూరె ముజాదలా’లో తెలుపబడిరది.

అర్థం : మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించబడినవారికి అల్లాప్‌ా ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు.

హజ్రత్‌ ఆదం(అస)కు జ్ఞానం కారణంగానే దైవదూతలందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని అల్లాప్‌ా ప్రసాదించడం జరిగింది.

హజ్రత్‌ అనస్‌ (రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు : ఎవరైతే విద్యను అభ్యసించడానికి బయలుదేరుతారో వారు తిరిగి వచ్చేవరకు అల్లాప్‌ా మార్గంలో ఉన్నట్లు పరిగణించబడతారు.

బద్ర్‌ యుద్ధం తదనంతరం ఖైదీలుగా పట్టుబడ్డ వారికి ఇలా ఆదేశించడం జరిగింది. ఎవరైతే పదిమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారో వారు విడుదల చేయబడతారు. దీనినిబట్టి మహాప్రవక్త దృష్టిలో విద్యా ప్రాముఖ్యం ఏమిటో తెలుస్తుంది. ఇంకొక సంఘటన ప్రకారం మహాప్రవక్త మస్జిదె నబవి అరుగును విద్యాలయంగా మార్చేశారు. నేడు మనం ధర్మవేత్తలుగా, హాఫిజ్‌లుగా, పెద్దపెద్ద సహాబీలుగా పిలువబడేవారందరూ ఈ విద్యాలయం నుంచి వచ్చినవారే.

ఖుర్‌ఆన్‌, హదీసు గ్రంథాల విద్యనే కాకుండా ధార్మిక, నైతిక, మానవీయ విలువలు నేర్పించే విద్యకు కూడా మహాప్రవక్త ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఈనాడు ప్రాపంచిక విద్య వ్యాపార దృక్పథంతో సమాజాన్ని కలుషితం చేస్తున్న స్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మహాప్రవక్త చెప్పినట్లుగా ధార్మిక, నైతిక, మానవీయ విలువలు నేర్పించే విద్య మనకు ఏ కోశాన కనిపించడంలేదు.

మనం నేడు మన విద్యావ్యవస్థను పరికించినట్లయితే విలువలతోకూడిన విద్య మనకు ఎక్కడా కనిపించడంలేదు. ఇందుమూలంగానే మన దేశంలో లంచం, అవినీతి, తీవ్ర మత భావనలు, బాధ్యతారాహిత్యం చదువుకున్న యువతలో సైతం నైతికత దిగజారుడుతనం పెచ్చరిల్లిపోతున్నాయి. మన చదువులు ప్రతిభ గల శాస్త్రవేత్తనో, ఇంజనీరునో, డాక్టరునో అందిస్తున్నాయేగాని మంచి విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. అందువల్లనే ఒక వార్డుమెంబర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకు ఒక అటెండర్‌ ఉద్యోగి నుంచి ఐఎఎస్‌ ఆఫీసర్‌ వరకు అవినీతిపరులుగా ఉండటాన్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

యువత నైతికత మీద దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఎందుకంటే నేటి విద్యార్థులు రేపటి పౌరులు, దేశంలోని యువత తప్పుదోవ పట్టే దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. యువతలో నైతికత కొరవడితే దేశ భవిష్యత్తు కుంటుపడుతుంది. మనిషికి పశువుకి తేడా నీతి నడవడికలే. కాని శాస్త్ర సాంకేతికాభివృద్ధి జరుగుతున్నకొద్ది ఈ అంతరం తరిగిపోతూ వస్తున్నది. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని యువకులు పబ్‌ సంస్కృతి, అశ్లీల నృత్యాలు, డేటింగ్‌, ప్రేమ, పిచ్చి వంటి విశృంఖల చేష్టల వైపు ఆకర్షితులవుతున్నారు. అవినీతిని నిరోధించడానికి ఎన్ని చట్టాలు  చేసినా అవి మనిషిని పూర్తిగా నియంత్రించకపోవడానికి గల ముఖ్య కారణం నైతికత లేని విద్య. ఇదే విషయమై మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇలా అన్నారు : ఃఃచీశీ aఎశీబఅ్‌ శీట శ్రీaషం షశీబశ్రీస పవ aపశ్రీవ ్‌శీ షఱ్‌ష్ట్రశీబ్‌ షబతీతీవజ్‌ూఱశీఅ Iఅ జూబపశ్రీఱష శ్రీఱటవ బఅశ్రీవంం వసబషa్‌ఱశీఅ ఱం ఙaశ్రీబవ పaంవస.ఃః

నైతికతతో కూడిన విద్య వచ్చేంతవరకు మన సొసైటీలో ఉన్న అవినీతిలో ఎటువంటి మార్పురాదు. దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మితమవుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.

మన దేశంలోని పర్యావరణ ప్రాముఖ్యాన్ని గుర్తించి విద్యలో ఒక తప్పనిసరి అంశంగా ప్రవేశపెట్టారు. అదేవిధంగా శాంతి విద్య, విలువల ఆధారిత విద్య కూడా ప్రవేశపెట్టాలి. అప్పుడే మన దేశం ఆదర్శ దేశంగా మారే అవకాశం ఉంది. ఏ విధంగానైతే అరబ్బు సమాజాన్ని అంధకారం నుండి వెలుగు వైపునకు తీసుకొచ్చిన నైతిక విద్య నేడు కూడా మార్పును తీసుకొని వస్తుంది. ప్రవక్త(స) సెలవిచ్చారు : తల్లి ఒడి నుంచి అసువులు బాసే వరకు విద్య సముపార్జన చేయండి అని.

0. ప్రవక్త నిరక్షరాస్యులు అయినా ఆయనపై దైవగ్రంథం అవతరించింది.

0. విద్య ప్రవక్తల వారసత్వం. విద్యలో అజ్ఞానం పటాపంచలవుతుంది.

0. సత్యం, అసత్యం, న్యాయం, అన్యాయం, మంచి చెడు, లాభనష్టాల విచక్షణ మనకు విద్యలోనే అవగతం అవుతున్నాయి.

0. అసలైన విశ్వాసి యొక్క మస్తిష్కం విద్యతో నిండదు. అతను దాన్ని పొందుతూ పొందుతూ అదే ద్యాసలో చనిపోతాడు.

0. స్వర్గపు మార్గాన్ని సులభతరం చేస్తుంది విద్య.

0. హజ్రత్‌ ముఅజ్‌ విద్యను గురించి ఇలా ప్రబోధించారు: విద్యను అభ్యసించండి. ఎందుకంటే విద్యను అభ్యసించడం దేవుని మార్గంలో తనకు (అల్లాప్‌ా) భయపడటం, దాన్ని పొందాలంటే కృషి దైవారాధన, దాన్ని చదవటం, చదివించటం దైవనామస్మరణం, దాని ధ్యాస, తపన, దైవమార్గంలో కృషి సలపడం. తెలియని వారికి తెలియజేయడం సత్కార్యం. తెలుసుకోవాలనే ఆశ కలవారికి చెప్పటం పుణ్యం.

చిరిగిన చొక్కా అయిన తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. పుస్తకానికి మించిన నేస్తం లేడు. పుస్తకం ఏకాంత సమయంలో మనకు తోడు నీడ.

ఏ విధంగానైతే పురుషులు ప్రవక్త(స) సన్నిధిలో హాజరై ధార్మిక విషయాలను నేర్చుకునేవారో అదేవిధంగా స్త్రీలు కూడా నేర్చుకునేవారు.

ఇస్లాం స్త్రీ పురుషులు ఉభయుల్ని విద్య సముపార్జించమని దాని ద్వారా సమాజంలో వెలుగు నింపమని ఆదేశిస్తుంది. జ్ఞానం విషయంలో ఎవరికి ఎవరిపైనా ప్రాధాన్యత గాని, ఏవిధమైన విచక్షణ గాని లేవు. ఎందుకంటే విద్య మానవజాతి మొత్తానికి ఒక వెలుగు జ్ఞానసముపార్జనకై స్త్రీ పురుషులు ఉభయుల కోసం మార్గాలను సుగమం చేసింది ఇస్లాం. దీనివల్ల సమాజం ఆదర్శవంతంగా రూపొందుతుంది. ఇస్లాం ఎడల సరైన అవగాహన లేనివారు, ఇస్లాం, మహిళలు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేందుకు అనుమతించదు. ఆమెను ఇంటిగోడల మధ్య పరిమితం చేస్తుంది అని అర్థంలేని విమర్శలు చేస్తుంటారు.

దైవప్రవక్త, మహిళల సమగ్ర శిక్షణ కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహించేవారు. విద్య కోసం ఆయన చేసిన ప్రయత్నాలు, చూపిన ఆసక్తి వల్లనే ప్రవక్త అనుయాయులు, సతీమణులు, ధర్మకర్తలుగా రూపొందారు. ఒకరిని మించి ఒకరు పండిత ప్రకర్షగలవారు. కొన్ని విషయాలలో పురుషులను మించి ప్రతిభను చూపారు మహిళలు. ఇంకొన్ని సందర్భాలలో పురుషులకు స్త్రీలే జ్ఞానాన్ని పంచేవారు. పురుషుడు విద్యావంతుడు కావడం ఎంత ముఖ్యమో స్త్రీలు విద్యావంతులు కావడం కూడా అంతే ముఖ్యం అని ఇస్లాం బోధిస్తుంది. దీని మూలంగానే మనకు విద్యారంగంలో సహాబాలతోపాటు సహాబియాత్‌లు కూడా దర్శనం ఇస్తారు. ఈ విషయంలో హజ్రత్‌ ఆయెషా (రజి) పేరు అగ్రస్థానంలో వుంది. ఇంకొన్ని సందర్భాలలో ఆమె పురుషులకంటే ఎక్కువ ఆధిక్యత కలిగి వున్నారు. ఆమె దైవప్రవక్త(స) నుంచి ఏకంగా 2210 హదీసులను ఉల్లేఖించారు. వీరి దగ్గరకు పెద్దపెద్ద సహాబాలు, తాబయిన్లు వచ్చి సలహా సంప్రదింపులు జరిపేవారు.

విద్యలో రాణించగల అవసరం స్త్రీకి ఎంతయినా వుంది. విద్యను అభ్యసించటం వల్ల స్త్రీ తన ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటుంది. తద్వారా తననుతాను గౌరవించుకుంటుంది.

0. ముస్లిమేతరులు అడిగే ప్రశ్నలకు దీటైన సమాధానం ఇస్తుంది.

0. వారికి ఇస్లాంలో వుండే చక్కనైన ఉపదేశాలు, అల్లాప్‌ా ఆదేశాలు, కట్టుబాట్లు, పరదా పద్ధతి, సమస్యలకు తగిన పరిష్కారం ఇస్లాంలో వుందని తెలియజేస్తుంది.

0. తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుంది. వారికి సరైన శిక్షణ ఇస్తుంది.

0. స్త్రీ విద్యావంతురాలు కావటం వల్ల ఒక ఇల్లు, ఇంటి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి వీధి, వీధి నుంచి గ్రామం, గ్రామం నుంచి సమాజం సుశిక్షుతుల్ని చేస్తుంది.

స్త్రీ విద్యావంతురాలు కాకపోతే ఇవన్నీ ఎలా సాధ్యం? బీదప్రజానీకానికి ఎంత మేలు జరుగుతుందో వేచి చూద్దాం.

Check Also

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *