విశ్వాసమే సౌభాగ్యం

ఇస్లామ్‌  ధర్మాన్ని   తెలుసుకోని వారు ఎంత దురదృష్ట వంతులు?  వారు  మార్గదర్శకాన్ని పొందలేరు. ఇస్లామ్‌ ధర్మావలంభీకులు ఇస్లామ్‌ పరివ్యాప్తి కోసం ఒక దీటైన ఉద్యమాన్ని లేవనెత్తాలి. ఇదొక బృహత్తర కార్యం. దీని ప్రచారం కట్టుదిట్టంగా, ఉన్నతంగా, ఘనంగా జరగాలి. ఎందుకంటే ధర్మసందేశావలంభనలోనే మానవ సాఫల్యం దాగి ఉంది. అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ఎవడయినా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లామ్‌ను) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదిం చబడదు. (3:85)

ఒక ప్రముఖ ముస్లిమ్‌ ధర్మప్రచార కర్త జర్మనీలోని మ్యూనిక్‌ నగరంలో నివాసం ఉండడానికి వెళ్ళారు. ఆయన ఆ నగరం లోకి ప్రవేశించగానే ఒక చోట ఒక సైన్‌ బోర్డుపై ‘‘మీకు యూకో హామా దౌష్ట్యాల గురించి తెలీదా?’’ అని  రాసి ఉండడం చూశారు. అది చూసిన వెంటనే ఆయనకు ఒక ఆలోచన స్ఫురించింది. వెంటనే ఆయన ఒక చోట ‘‘మీకు ఇస్లామ్‌ గురించి తెలుసా? లేక పోతే ఫలానా నెంబర్‌కు ఫోన్‌ చేయండి’’ అని సైన్‌బోర్డు తయారు చేయించి పెట్టారు. జర్మనీలోని సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆయనకు ఫోన్‌లు రావడం మొదలయ్యాయి. ఒక సంవత్సరంలో ఆయన ద్వారా వేల మంది ఇస్లామ్‌ స్వీకరించారు. ఆయన ఒక మస్జిద్‌, ఒక ఇస్లామీ కేంద్రం, ఒక మదర్సా నిర్మించారు.

geeturai_weekly_magazine_17_1

మనిషి అయోమయంలో ఉన్నాడు. అతన్ని ప్రశాంతతను కలిగించే గొప్ప ధర్మం అవసరం ఎంతయినా ఉంది. అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: దాని ద్వారా అల్లాప్‌ా తన సంతోషం పొందగోరే వారికి శాంతి పథాలను చూపు తాడు. తన ఇచ్ఛానుసారం వారిని చోకట్ల నుంచి వెలికి తీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు. (5:16)

ఒక సూడానీ ముస్లిమ్‌ బాదియా అనే ప్రాంతం నుంచి రాజ ధాని నగరం ఖర్తూమ్‌కు వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఆంగ్లే యులు పరిపాలించేవారు. అతను బజారులో ఆంగ్లేయుడైన ఒక ట్రాఫిక్‌ పోలిస్‌ను చూసి ఇతను ఎవరు? అని అక్కడ ఉన్న వారిని అడిగాడు. ప్రజలు ‘ఇతను తిరస్కారి’ అని జవాబిచ్చారు. ‘ఇతను ఎవరిని తిరస్కరిస్తాడు?’ అని అడిగాడు. అందుకువారు ‘అల్లాప్‌ాను తిరస్కరిస్తాడు’ అన్నారు. అందుకు ఆయన ‘అల్లాప్‌ాను తిరస్కరించేవారు కూడా ఉన్నారా?’  అని ఆశ్చర్యపోయాడు.  అల్లాప్‌ా శరణు వేడుకుంటూ ఆ ప్రాంతం నుంచి వచ్చేశాడు.

ప్రజల జీవిత చరిత్రలు, ఆత్మకథలు చదివేవారికి అనేక విష యాలు ద్యోతకమవుతాయి. అవేమిటంటే
(1) అలీ (రజి) ఇలా అన్నారు: మనిషి తన సదాచరణలతోనే గౌరవించబడతాడు. అంటే భావం మనిషి అతని రూపురేఖలతో గుర్తించబడడు. అతని విజ్ఞానం, నీతి నడవడిక, క్రమశిక్షణతో గుర్తించబడతాడు.  (2) మనిషి ఎంతగా త్యాగాలు, అల్లాప్‌ా మార్గంలో ఖర్చు చేస్తాడో అంతగానే ప్రసిద్ధి చెందుతాడు.                 (3) మనిషి తానే తన చరిత్రను సృష్టించుకుంటాడు. తన సత్ప్ర వర్తన, దుష్ప్రవర్తనల మూలంగా పేరు తెచ్చుకుంటాడు. (4) మనిషి జీవితం చిన్నది. త్వరలోనే ముగుస్తుంది. కనుక పాపా లకు పాల్పడుతూ, పొరపాట్లు చేస్తూ, దు:ఖం, నిరాశా నిస్పృ హల్లో కూరుకుపోయి దాన్ని మరింత చిన్నదిగా మార్చు కోకండి. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా పేర్కొనడం జరిగింది: అప్పుడు మనిషి ఇలా అంటాడు: మేము ప్రపంచంలో కొద్ది సమయం మాత్రమే ఉన్నాము.

సుఖమయజీవితానికి..
సదాచరణలు: పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే, విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము.
సదాచరణి  అయిన భార్య:  ప్రభూ! మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు. (25:74)
అప్పులకు దూరంగా ఉండాలి. దుబారా ఖర్చు చేయకూడదు. పిసినారి తనం కూడా వహించకూడదు. ధర్మసమ్మతమైన మార్గాలలో సంపాదించాలి. ధర్మసమ్మతమైన మార్గాల్లో ఖర్చు చేయాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. ప్రజలతో మంచిగా వ్యవహ రించాలి. అల్లాప్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాప్‌ాను ఆరాధించాలి.  సహనం వహించాలి. దైవమార్గంలో ఖర్చు చేయాలి. సత్కార్యాలు చేయడంలో ముందుండాలి. ప్రజలను మంచి వైపునకు ఆహ్వానించాలి. చెడుల నుంచి వారించాలి. ధర్మసంస్థాపన కోసం పాటుపడాలి.  ధర్మసందేశ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.  అల్లాప్‌ా ఆదేశానుసారం నడచుకోవాలి.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *