శాంతి చర్చలు

ఇస్రాయీల్‌ పలస్తీనాల మధ్య శాంతి చర్చల్లో మరోసారి ఇస్రాయీల్‌ పట్ల పక్షపాతం కనబడుతోంది. పలస్తీనాపై ఒత్తిళ్ళు పెంచుతున్నారు. నిజానికి ఇంతకాలం శాంతి చర్చలు స్తంభించడానికి కారణం ఇస్రాయీల్‌ మూర్ఖపు వైఖరే అని అందరూ అంగీక రించారు. కాని ఇప్పుడు మాత్రం పలస్తీనాపై ఒత్తిడి పెంచి ఇస్రాయీల్‌ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నాలు పెద్ద  ఎత్తున జరుగుతున్నాయి.  ఇప్పుడు మాటలు కూడా మారిపోయాయి. ఇస్రాయీల్‌ శాంతి చర్చలకు  సిద్ధంగా ఉన్నప్పటికీ పలస్తీనా వైఖరి వల్లనే ఆలస్యమైందని ఇప్పుడు అంటున్నారు.  పలస్తీనా అనవసరపు షరతులతో చర్చలకు అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఇస్రాయీల్‌ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. కాని వాస్తవానికి ఇస్రా యీల్‌ చాలా షరతులను పరోక్షంగా పెడుతోంది. యాసర్‌  అరఫాత్‌  కాలం నుంచి చర్చలు అనేకసార్లు ప్రారంభమయ్యాయి. ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల చర్చలు ఆగుతూనే ఉన్నాయి.

ప్రతిసారి అమెరికా అత్యుత్సాహంగా చర్చలను ముందుకు తీసుకెళ్ళడానికి నడుం కడుతోంది.  ఈసారైతే  హమాజ్‌ను కూడా చర్చల్లో భాగస్వామి చేసే ప్రయత్నాలు జరిగాయి. దీనికి ముఖ్య కారణం ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముర్సీ చేసిన ప్రయత్నాలు. అందువల్లనే ఆయన పదవిచ్యుతుడయ్యాడన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రతిసారి ఇస్రాయీల్‌ ఈ చర్చల సాకుతో అమెరికా ఒత్తిడిని ఉపయోగించు కుని ఏదో ఒక ప్రయోజనం పొందుతూనే ఉంది. చర్చలు మళ్ళీ ఆగిపోతున్నాయి.

మరోవైపు పలస్తీనాకు సంబంధించి ఒక్క డిమాండ్‌ పై కూడా ఇంతవరకు ఏదీ జరగ లేదు. ముస్లిములు, యూదులు, క్రయిస్తవులు ముగ్గురికి పవిత్రమైన జెరుసలేమ్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు లేవు. జెరుసలేమ్‌ను ఇస్రాయీల్‌ రాజ ధానిగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాటిని పట్టించుకోనట్లు అమెరికా నటిస్తోంది. యూద బస్తీల  విస్తరణ కొనసాగుతోంది.  అయినా అమెరికా పట్టించుకోవడం లేదు. కాని మధ్యప్రాచ్యంలో శాంతి చర్చల విషయంలో మాత్రం చాలా ఆసక్తి ఉన్నట్లు చెబుతోంది.

ప్రతిసారి చర్చల సాకుతో పలస్తీనాను మరింత ఒత్తిడికి గురిచేయడానికి, ఇస్రాయీల్‌కు మరిన్ని ప్రయోజనాలు కట్టబెట్టడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలను ప్రపంచదేశాలు గమనించాలి. ఈ ప్రయత్నాలను అడ్డుకోడానికి వెంటనే పూనుకోవాలి.

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *