శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా భావించబడుతుంది. వారిని స్వాగతించడానికి అనేక గొప్ప ఏర్పాట్లు చేయబడతాయి. ఇక్కడ పవిత్ర రమజాన్‌ మాసం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దాని రాక కేవలం ఒక ముస్లింకే కాక, ముస్లిం జాతి మొత్తం ప్రపంచంలోకి ప్రతి వ్యక్తికి విశ్వవ్యాప్తంగా శుభప్రదమైన, లాభదాయకమైన, సందేశం ఇస్తుంది. రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సాహం అల్లాప్‌ా, మహాప్రవక్త(స) గారితో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం. కాబట్టి దాని స్వాగతం కోసం మనం మనలో అలాంటి గుణగణాలనే పెంపొందించుకోవాలి. ఏ గుణగణాలనైతే రమజాన్‌ నెల కోరుకుంటుందో పవిత్ర రమజాన్‌ నెలలో ఖుర్‌ఆన్‌ అవతరించిందని మనకు తెలుసు. ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. బదర్‌ యుద్ధం ఈ నెలలోనే జరిగింది. షబె ఖదర్‌ను ఉంచబడిరది. మక్కా విజయ సంఘటన కూడా ఈ నెలలోనే జరిగింది. ఈ నెలలోని ప్రతి పది రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడిరది. ఇంకా ఈ నెలలో జకాత్‌, దానధర్మాలు, ఫిత్రాలతో ధాతృత్వం వెల్లివిరుస్తోంది. కావున పవిత్ర రమజాన్‌ నెల ప్రార్థనల ఔన్నత్యాన్ని ఎంతో పెంచబడిరది. కాబట్టి ఈ నెల ఔన్నత్యానికి అనుగుణంగా స్వాగతం పలకాలి. రమజాన్‌ రాకపూర్వమే మనము అంతః, భాహ్యపరంగా సంసిద్ధులవాలి. అంతః, బాహ్య పరమైన పరిశుభ్రతను చేసుకోవడం కోసం, భక్తి, ధర్మనిష్ట, నిగ్రహం సాధించడం కోసం అత్యంత కార్యసాధనంగా సహాయ పడేదే ‘ఉపవాసం’. అందుకోసమే మహాప్రవక్త(స) గారు రమజాన్‌నెల తర్వాత అత్యధికంగా ఉపవాసాలు షాబాన్‌ మాసంలోనే ఉన్నారు. ఇదే రమజాన్‌ నెలను స్వాగతించడానికి మంచి అనువు.

geeturai_weekly_23_3

రమజాన్‌ నెలలోని మూడు సంఘటనలు:
రమజాన్‌ నెలలో జరిగిన మూడు సంఘటనలు మొత్తం ప్రపంచ రూపురేఖల్ని మార్చేస్తాయి. ఈ సంఘటనలు మానవునికి దిశా నిర్దేశాన్ని చూపుతాయి. మొదటి సంఘటన ఖుర్‌ఆన్‌ అవతరణ. ఖుర్‌ఆన్‌ మానవుల జీవనానికి వెలుగునిచ్చింది. ప్రపంచ చీకట్లను తొలగించింది. మానవులకు సృష్టి దాస్యం నుంచి సృష్టికర్త దాస్యం వైపు మళ్ళించింది. మార్గభ్రష్టులైన వారికి సన్మార్గం, రుజుమార్గం చూపింది. ఖుర్‌ఆన్‌ను అవగాహన చేసుకునే, ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. మన నిత్య జీవితంలో తొణికిసలాడాలి. దీని వెలుగులోనే మనం మన కుటుంబాలను తీర్చిదిద్దాలి. దీని సందేశం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. దాన్ని స్థాపించడానికి శాయశక్తులా కృషి చేయాలి.

రెండో సంఘటన` బదర్‌ యుద్ధం. ఈ సంఘటన న్యాయ, అన్యాయాలను, సత్యాసత్యాలను విడమరుస్తుంది.
మూడో సంఘటన` అఖండమైన మక్కా విజయం. ఈ మక్కా విజయం సందేశమేమిటంటే సత్యధర్మ స్థాపకులకు ఇహలోకంలోనూ శాశ్వతంగా నివసించే పరలోకంలోనూ సాఫల్యాన్ని పొందుతారు. రెండో సందేశం ఏమిటంటే ఏ స్థలాన్ని అయితే అల్లాప్‌ా ప్రార్థన కోసం ప్రత్యేకించబడిరదో అలాంటి ప్రదేశాన్ని బహు దైవారాధన, విగ్రహారాధన నుండి పరిశుభ్రంగా వుంచాలి. ఇది దైవారాధన కోసం ప్రత్యేకించబడిన పుణ్యభూమి. కాబట్టి అసత్యంతో, బహుదైవారాధనతో ఎలాంటి రాయబారం, సంధి చేసుకోవడానికి ఆస్కారం లేదు. ప్రపంచంలో ముస్లింలు ఎక్కడైనా ఏ సందర్భంలో, ఏ ప్రదేశంలోనైనా విజయాన్ని సాధిస్తే వారు గర్వంతో విర్రవీగరు. వారు అల్లాప్‌ా సన్నిధిలో కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చుతారు. అల్లాప్‌ా గొప్పతనాన్ని చాటుతారు. వారిలో ఇంకా సోదర భావం, సద్భావ ఉత్సహం పెరుగుతుంది. ఈ మూడు సంఘటనలు కూడా రమజాన్‌ నెలను స్వాగతం పలికేందుకు, మనలో అంతరంగ, బాహ్యపరంగా ప్రేరణను కల్పిస్తున్నాయి. వాటిని ఆచరించడం ద్వారా తప్పక సాఫల్యం లభిస్తుంది. ఇన్షాఅల్లాప్‌ా దైవ సామీప్యం కోసం స్థిరంగా ఉండాలి.

రమజాన్‌ స్వాగతం
రమజాన్‌ నెలను స్వాగతించాలి. మన సంభాషణ ద్వారా, మన కార్యాచరణ ద్వారా, ఇస్లాం జీవనవిధానాలను వ్యాపింపజేసి వాటి విధివిధానాలను స్వీకరించడం ద్వారా రమజాన్‌ నెలకు స్వాగతించాలి. రమజాన్‌ నెలను స్వాగతించాలి. ఏవిధంగానంటే అది మొత్తం ముస్లిం జాతి అభివృద్ధికి తోడ్పడాలి. ఎందుకంటే మహాప్రవక్త(స) ఇలా అన్నారు : మీరు నా సందేశాన్ని స్వీకరించినట్లయితే అరబ్బు, అరబ్బేతరులకు యజమానులవుతారు. మరియు రమజాన్‌ నెలను స్వాగతించాలి. ప్రతి ఒక్క ప్రార్థనలపై అమలు పరిచి దేనిద్వారానైతే మనం అల్లాప్‌ా ప్రేమను, సామీప్యాన్ని పొందగలమో. సల్మాన్‌ ఫార్సీ (రజి)గారి ఉల్లేఖనం ప్రకారం ఆయన ఇలా ప్రబోధించారు : షాబాన్‌ చివరి తేదీలో మహాప్రవక్త(స) గారు ప్రసంగించారు : అందులో ఇలా అన్నారు. ఓ ప్రజలారా! ఒక గొప్ప శుభకరమైన, ఘనమైన నెల దగ్గర వచ్చేసింది. ఆ నెలలోని ఒక రేయి, వేయి నెలలకంటే శ్రేష్టమైనది. అల్లాప్‌ా ఈనెలలో ఉపవాసాలను పాటించడం విధిగా చేశాడు.

ఈ నెలలోని రాత్రుల్లో తరావీప్‌ా నమాజును చదవడం నఫిల్‌గా భావించాలి. ఎవరైనా ఈ నెలలో ఒక గొప్ప పుణ్యకార్యం చేస్తే అది రమజానేతర నెలలో ఫరజ్‌ చేసినంత పుణ్యంగా భావించబడిరది. ఈ నెలలో ఎవరైనా ఒక ఫర్జ్‌ కార్యాన్ని నిర్వహిస్తే రమజానేతర నెలలో డెబ్బై ఫర్జ్‌ కార్యాలను నిర్వహించినంత పుణ్యం లభిస్తుంది. ఈనెల సహనం, ఓపిక గల నెల. సహనం ప్రతిఫలం స్వర్గం, ఈనెల సమాజంలోని పేద, అవసరాలు గల వారికి ఆర్థికంగా ఆదుకొనే నెల. ఈ ప్రార్థనలన్నిటినీ ప్రతి ముస్లిం విధిగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రార్థనల ద్వారా మనలో అంతఃపరమైన, బాహ్యపరమైన ప్రవర్తనలో మార్పురావాలి. దీనికోసమే మన ఆలోచనల, హృదయాలను సంసిద్ధులుగా చేసుకోవాలి. ఇదే రమజాన్‌ నెలకు సరైన స్వాగతం పలకడం.

Check Also

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *