షాబాన్ నెల ప్రాముఖ్యత

ఇస్లామీయ నెలల్లో 8వ నెల షాబాన్‌. పన్నెండు నెలల్లో షాబాన్‌ నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే షాబాన్‌ నెలని మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు తన నెలగా పేర్కొన్నారు. హజ్రత్‌ అబూ హురైరా(రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఒక సందర్భంలో ఇలా ఉపదేశించారు : షాబాన్‌ నా నెల. రజబ్‌ అల్లాప్‌ా నెల, రమజాన్‌ నా జాతి నెల. షాబాన్‌ నెల మానవులను పాపాల నుండి దూరం చేస్తుంది, రమజాన్‌ నెల పరిశుభ్రం చేస్తుంది.

షాబాన్‌ నెల గురించి మహాప్రవక్త(స) గారు ఒక నెల ముందు నుంచే ప్రార్థించేవారు. ‘ఓ అల్లాప్‌ా! మాకు రజబ్‌, షాబాన్‌ నెలలో సమృద్ధిని,  శుభాలను  ప్రసాదించు. రమ జాన్‌ నెల వరకు చేర్పించు’ అని వేడుకునే వారు.  మరో  హదీసులో ఈ విధంగా ప్రస్తావించబడిరది: రజబ్‌, రమజాన్‌ మధ్య గల నెల షాబాన్‌ నెల. ప్రజలు దీని ప్రాము    ఖ్యత నుండి అలక్ష్యంలో ఉన్నారు. ఈ నెలలో దాసుల కృత్యాలు అల్లాప్‌ా వద్దకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నా కర్మఫలాలు దేవుని వద్దకు తీసుకుని వెళ్ళే సమయంలో నేను ఉపవాస దీక్షలో ఉండటాన్ని ఇష్టపడతాను అని మహా ప్రవక్త(స) గారు సెలవిచ్చారు.geeturai_weekly_8

మహాప్రవక్త(స)గారు షాబాన్‌ మాసంలో ప్రత్యేక ఉపవాసాలను పాటించేవారు. హజ్రత్‌ ఆయిషా(రజి) గారు  ఇలా  సెల విచ్చారు. నేను మహాప్రవక్త(స) గారిని రమజాన్‌ నెల తప్ప మరే నెలలో మొత్తం నెల ఉపవాసాలుండటాన్ని ఎప్పుడు చూడ లేదు. షాబాన్‌ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించడం మరే నెలలో చూడలేదు. (బుఖారి, ముస్లిం)
హజ్రత్‌ అబూ హురైరా  (రజి)  ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఈ విధంగా సెలవిచ్చారు:  షాబాన్‌  నెల సగ భాగం తర్వాత  ఉపవాసాలు  పాటించకండి. అంటే షాబాన్‌ నెల  చివరి  పదిహేను రోజులు ఉపవాసాలు  పాటించకూడదు. ఎందుకంటే ముస్లింలు ప్రతి విషయంలో మహాప్రవక్త(స)ని అనుసరిస్తారు. అదే విధంగా షాబాన్‌ ఉపవాసాల విషయంలో కూడా నన్నే అనుసరించి ఎక్కువ  ఉప వాసాలు పాటిస్తే శారీరక బలహీనత ఏర్పడి రాబోయే రమజాన్‌ నెల ఉపవాసాలకు కావలసిన శక్తి లోపిస్తుంది. రమజాన్‌ నెల ఉపవాసాలు   విధిగా  పాటించాల్సి వుంటుంది. కాబట్టి తన జాతి గురించి ఎల్ల ప్పుడు, ప్రతిక్షణం తపించే విశ్వకారుణ్య మూర్తి మహాప్రవక్త(స) గారు షాబాన్‌ నెల ఉపవాసాల  ద్వారా  రమజాన్‌ నెల ఉప వాసాల్లో ఎలాంటి ఆటంకం జరగకూడదనే ఉద్దేశ్యంతో  చాలా స్పష్టంగా ఇలా సెల విచ్చారు.  ‘ఇజన్‌తసఫ షాబాను ఫలా తసూమూ’ (బులూగుల్‌ మరామ్‌ 139` తిర్మిజి 155/1)

షాబాను మాసం  సగభాగం  తర్వాత ఉప వాసాలు పాటించకండి. అంటే షాబాన్‌ నెల  మొదటి  పదిహేను రోజులు ఉప వాసాలు   పాటించి  చివరి పదిహేను రోజులు ఉపవాసాలు విరమించాలి.

హజ్రత్‌ ఆయిషా(రజి) ఉల్లేఖనం ప్రకారం తన వద్ద ఒక స్త్రీ రజబ్‌ నెల ఉపవాసాల గురించి ప్రస్తావన చేయగా ఆమె (రజి) గారు ఇలా సెలవిచ్చారు:  ఒకవేళ నీకు రమజాన్‌  నెల  ఉపవాసాల తర్వాత వేరే నెలలో ఉపవాసాలను పాటించాలనే ఆసక్తి వుంటే షాబాన్‌ నెలలో ఉపవాసా లను  పాటించు.  ఎందుకంటే ఈనెల గురించి  అనేక  శుభాలు ప్రస్తావించ బడ్డాయి. (కంజుల్‌ ఆమాల్‌ 341/4)
దీని సారాంశం ఏమిటంటే షాబాన్‌ నెలలో ఉపవాసాలను పాటించవచ్చు,  పూర్తిగా నిషేధించబడలేదు. ఇంకా ఇది మహా గొప్పకార్యం కూడాను.  షాబాన్‌  నెల ప్రాముఖ్యత గురించి  హజ్రత్‌  అబ్దుల్‌ ఖాదిర్‌ జిలాని(రహ్మ)గారి వాక్యాలను ఇక్కడ ప్రస్తావించడం చాలా అవసరం. ఆయన ఇలా సెలవిచ్చారు:  ఈ నెలలో శుభాలు సమృద్ధిగా ప్రసాదించబడతాయి. పుణ్యాలు ప్రసాదించబడతాయి. పాపాలు దూరం చేయబడతాయి. కాబట్టి ప్రతి తెలివి గల విశ్వాసి  ఈ  నెలలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. అశ్రద్ధ వహించ కూడదు. ఇంకా రమజాన్‌ నెలను స్వాగ తించే విధంగా తనకు తాను సంసిద్ధులుగా చేసుకోవాలి.   అల్లాప్‌ాతో  విన్నవించు కోవాలి,  పశ్చాత్తాపపడాలి.  ఈ  నెలలో ఎక్కువ ప్రార్థనలు చేసి దైవ సామీప్యాన్ని పొందాలి.

షబే బరాత్‌ వాస్తవికత
షబె బరాత్‌కి అనేక పేర్లున్నాయి. లైలతుల్‌ బరఅతున్‌  అంటే నరకం నుంచి విముక్తి పొందే రేయి,  లైలతుల్‌ ముబారక అంటే శుభాల రేయి. లైలతుస్సక్‌ అంటే దస్తా వేజుల రేయి.  అనగా  ఒక సంవత్సర కాలంలో  ప్రతి  మనిషికి సంబంధించిన అనేక విషయాలు  స్పష్టంగా లిఖించబడ తాయి. కాని  ఈ రేయి షబె బరాత్‌ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఇది అరబీ, ఫార్సీ భాషా పదాల సంగ్రహం. షబ్‌ అంటే ఫార్సీ భాషలో రాత్రి అని, బరాత్‌ అంటే అరబీలో విముక్తి పొందటం, మోక్షం పొందటం అని అర్థాలు వస్తాయి.
షబే బరాత్‌ గురించి  హజ్రత్‌  ఆయిషా (రజి)గారి నుండి ప్రసిద్ధి చెందిన ఉల్లేఖనం వుంది. దీనిని ఇమామ్‌ తిర్మిజీ(రహ) తన గ్రంథంలో పొందుపరిచారు.

అల్లాప్‌ా షాబాను మాసంలోని 15వ రాత్రి ఆకాశం నుండి భువిపైకి అవతరిస్తాడు. బనూ కల్బ్‌ మేకల వెంట్రుకల మందం ప్రజల పాపాలను క్షమిస్తాడు. (మిష్కాత్‌ 115)
హజ్రత్‌  ముఆజ్‌  బిన్‌  జబల్‌(రజి) ఉల్లేఖించారు  మహాప్రవక్త(స)  ఇలా సెల విచ్చారు. షాబాన్‌ నెల 15వ రాత్రి అల్లాప్‌ా తన సృష్టి భూతములపై ప్రత్యేక అనుగ్ర హాలను ప్రసాదిస్తాడు మరియు అందరి పాపాలను క్షమిస్తాడు. బహు దైవారాధ కుని, ద్వేషాన్ని కలిగివున్న వ్యక్తి తప్ప అని వివరించారు.

ఈరోజు రాత్రి శ్మశానవాటిక (సమాధుల) వద్దకు వెళ్ళడం ఈ రాత్రి మహాప్రవక్త(స)  ద్వారా  మదీన నగరంలోని  జన్నతుల్‌  బఖీ  (శ్మశాన వాటిక)కి వెళ్ళినట్టు ఒక ఉల్లేఖనంఉంది. మహాప్రవక్త(స) గారు తన జీవిత కాలంలో కేవలం ఒకే ఒకసారి అంటే జాగారం రాత్రి షాబాను  15వ రాత్రి జన్నతుల్‌ బఖీకి వెళ్ళారు.  కాబట్టి  ఏ విషయమైనా మహా ప్రవక్త(స)  ద్వారా  ఏ స్థాయిలో రుజువైతే దానిని అదే స్థాయిలో ఉంచాలి. దానిని ముందుకు  గాని  వెనుకకు గాని జరప కూడదు.  కాని  నేడుముస్లింలు ప్రతి జాగారం  రాత్రి  శ్మశానవాటికకు వెళ్ళడం జరుగుతుంది.  దీనిని  విధిగా చేసు కుంటారు. షబె బరాత్‌ అంతర్భాగంగా భావిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. జీవి తంలో ఎప్పుడైనా  ఒకసారి  మాత్రమే శ్మశానవాటికకు వెళ్ళాలి.  ఇదే  సున్నత్‌ మరియు ఇత్తెబా అవుతుంది.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *