సదాచరణ

మనం మంచిగా ఎలా వ్యవహరించాలి? సేవలకు అర్హులైనవారెవరు? అనే విషయాలు ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేసింది. మనిషికి తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, సమీప బంధువులు అనగానే సహజసిద్ధంగానే ప్రేమాభిమానాలుంటాయి. వారితో ఒక ప్రత్యేకమైన హార్థిక సంబంధాన్ని కలిగివుంటాడు. అందుకే వారి సేవ చేయడం తన నైతిక కర్తవ్యంగా భావిస్తాడు. ఇలాంటి భావాత్మకమైన సంబంధం సమాజంలోని ఇతరులతో (సాధారణంగా) ఉండదు. వారితో అతని వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మానవ సంబంధాల ప్రకారం వారి పదవులు, హోదా శ్రేణులను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని వారి వారి అధికారాలను నిర్ధారించడం చేసింది.

ఇస్లాం రక్త సంబంధం కలిగిన వారికి సేవ చేయడమే  కర్తవ్యంగా  భావించకుండా ఎలాంటి సంబంధ,  బాంధవ్యాలు లేని వారితో  కూడా  మంచిగా  ఎలా వ్యవహ రించాలో  శిక్షణనిస్తుంది.  తాను సేవ చేయాల్సిన,   మంచిగా  వ్యవహరించ వలసిన క్షేత్రపరిధి తన గృహం, కుటుం బంకే పరిమితం  చేయకుండా ఇంకా ముందుకేగి పూర్తి సమాజం వరకు విస్తరిం పజేసింది. దీనివల్ల సంపూర్ణ మానవ జాతిని తన కుటుంబంగా  భావించి విశ్వజనీన సోదర భావాన్ని పెంపొందించి, దాని సేవ చేసేందుకు సిద్ధపడేలా తయారు అవు తాడు. దివ్యఖుర్‌ఆన్‌లోని సూరె నిసాలోని ఒక ఆయత్‌(వాక్యం)  చాలా  స్పష్టంగా సేవకు  అర్హులు  ఎవరు?  ఎవరెవరితో మంచిగా వ్యవహరించాలి? అనేది తెలుపు తుంది.
‘‘మీరంతా అల్లాప్‌ాకు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు  భాగస్వాములుగా చేయవద్దు.  తల్లిదండ్రుల  ఎడల సద్భా వంతో మెలగండి. బంధువులు, అనా ధులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహ రించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం  పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్ను కాననివారు,  తమ గొప్పతనం గురించి విర్రవీగే వారు అంటే అల్లాప్‌ా ఇష్ట పడడు అని గట్టిగా నమ్మండి.’
(అన్‌నిసా : 36)

geeturai_weekly_magazine_18_1

ఈ  వాక్యంలో  ఖుర్‌ఆన్‌ నందు తెలుప బడిన సమాజంలోని  పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటి ఉల్లేఖనం అయితే లేదు కాని సేవకు  అర్హులైన  వారి పట్ల సానుభూతితో,ప్రేమతో  ఎలా  వ్యవహరిం చాలో అర్థం చేసుకునేందుకు  ఇది ఉప యోగపడుతుంది. దీనికి సంక్షిప్తంగా వివరణ  ఇవ్వడం  జరుగుతుంది. దాని కంటే ముందు ఇక్కడ ‘సేవ’ అనే దానికి ఖుర్‌ఆన్‌లో ‘ఎప్‌ాసాన్‌’ అనే పదప్రయోగం చేయబడిరదని గమనించాలి.

ఇది  చాలా  విస్తృతమైన భావం కలిగిన పదం. సేవకు సంబంధించిన అన్ని భావా లను తనలో ఇముడుచుకున్న పదమిది. ఇందులో ధైర్యం చెప్పడం,  సానుభూతి చూపడం,  ప్రేమను  వ్యక్తపరచడం, ఆవశ్యకమైనవన్ని పూర్తి చేయడం, అంత ేకాకుండా ఎవరికైన ఇవ్వవలసినదానికంటే అధికంగా ఇవ్వడం మొదలైనవన్ని ఇందులోవస్తాయి.
తల్లిదండ్రుల పట్ల సదాచరణ

ఖుర్‌ఆన్‌లో ఒక్కడే అయిన దైవం అల్లాప్‌ా ఆరాధనకు  సంబంధించిన  ఆజ్ఞతోపాటు మానవులతో మంచిగా వ్యవహరించాలనీ హితబోధ చేయడం జరిగింది.
‘తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెల గండి.’                 (ఖుర్‌ఆన్‌ 4: 36)

తల్లిదండ్రుల  సేవ  చేయమని అన్ని ధర్మాలు చెబుతున్నాయి.  ఖుర్‌ఆన్‌లో ఒకటి రెండుచోట్ల  కాదు  అనేకచోట్ల అల్లాప్‌ాను ఆరాధించండి అని చెప్పిన వెంటనే  తల్లిదండ్రుల పట్ల మంచిగా వ్యవహరించండి  అని  ఆదేశించడం జరిగింది. దీనిలో మనిషికి అల్లాప్‌ా చేసిన మేళ్ళు అధికం, అనేకం అనే సూచన లభి స్తుంది. ఆ తరువాత అతని తల్లిదండ్రుల స్థానం.  మనిషి  అస్తిత్వం అతని పుట్టుక, పోషణ, శిక్షణ,  దిశా నిర్దేశం, ఆర్థిక, నైతిక వికాసం  మొదలైన  వాటన్నింటిలో తల్లి దండ్రుల పాత్ర అధికం,  అమోఘం. ఒకవేళ  వారు  అతనిపై శ్రద్ధ చూపకపోతే అతను ఎదగలేకపోవడమేకాదు అతని అస్థిత్వమే ప్రమాదంలో పడిపోయేది. కటిక దారిద్య్రం  అనుభవించే  నిరుపేద తల్లి దండ్రులు కూడా తమ  సంతానం కోసం అనేక త్యాగాలు చేస్తారు. మానవ చరిత్ర లో తల్లిదండ్రుల త్యాగాలకు మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. వారు చేసే ఉపకారాలు, మేళ్ళు అల్లాప్‌ా ఉపకారాలు, మేళ్ళకు ప్రతిరూపం అనవచ్చు.

అల్లాప్‌ాను ఆరాధించడం ఆయన చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా చెప్పవచ్చు.  ఎంత చేసినా  తల్లిదండ్రుల  స్థానం, అల్లాప్‌ా స్థానంకు సమానం ఎంత మాత్రం కాదని గ్రహించాలి.  వారి  ఆరాధనైతే చేయ కూడదు కాని, వారితో మంచిగా వ్యవహ రించడం,   వినమ్రతతో,    మర్యాదగా మసలుకోవడం తప్పనిసరి.   ఇదే వారి               ఉపకారాలకు  కృతజ్ఞతాపూర్వక సేవ. ఖుర్‌ఆన్‌లో  అల్లాప్‌ా పట్ల  కృతజ్ఞతగా             ఉండాలని ఆదేశించడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత చూపాలని తాకీదు చేయబడిరది.
‘నాకు  కృతజ్ఞుడవై  ఉండు,   నీ  తల్లి దండ్రులకు కృతజ్ఞతలు తెలుపు.  నా వైపు నకే నీవు మరలి రావలసి ఉన్నది.’

(ఖుర్‌ఆన్‌ 31: 14)
నేటి  నాగరికత  కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఈ వ్యవస్థతో నైతిక విలువలు నాశనం అవుతున్నాయి. దీని చెడు ప్రభావం ముసలి తల్లిదండ్రులపై పడుతుంది. అరవై సంవత్సరాల పైబడిన వృద్ధ తల్లిదండ్రులు అనాధలైపోతున్నారు. వీరిని ఏం  చేయాలి అని ఆలోచించడం జరుగుతుంది.
‘‘తల్లిదండ్రులతో  మంచితనంతో వ్యవహ రించండి. ఒకవేళ  మీ వద్ద వారిలో ఒకరు గానీ, ఇద్దరుగాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వ కండి. వారితో  మర్యాదగా  మాట్లాడండి. మృదుత్వమూ,  దయాభావం కలిగి వారి ముందు  వినమ్రులై  ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి:  ‘ప్రభూ! వారిపై కరుణజూపు,  బాల్యంలో  వారు  నన్ను కారుణ్యంతో,  వాత్సల్యంతో  పోషించి నట్లు.’’ (దివ్యఖుర్‌ఆన్‌ 17: 23, 24)
బంధువుల పట్ల సదాచరణ
ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవియ్యబడిరది: ‘బంధువులతో మంచిగా వ్యవహరించండి.’
ఖుర్‌ఆన్‌లో తల్లిదండ్రులతోపాటు బంధు వుల ప్రస్తావన ఇక్కడ, అనేక చోట్ల చేయ బడిరది.  ఈ  వాక్యాలన్నింటిలోను తల్లి దండ్రుల తరువాత హక్కు బంధువులదే అని తెలుపబడిరది.   బంధుత్వానికి ఆధారం   తల్లిదండ్రులే  కదా!  తల్లి దండ్రులతో  వారి  సంబంధం ఎంత దృఢంగా ఉంటే  వారి  హక్కు అంతగా పెరిగిపోతుంది.  బంధువులతో మంచిగా వ్యవహరించడం  ‘సిలారహమీ’ (రక్త సంబంధాలను  కొనసాగించడం, వారితో ప్రేమగా వ్యవహరించడం)  అనబడు తుంది. ఖుర్‌ఆన్‌ దీని గురించి గట్టిగా తాకీదు చేసింది.
బంధువులతో  చక్కగా వ్యవహరించడం వల్ల సామాజిక జీవనం పూర్తిగా  ఆనంద దాయకం అవుతుంది.  ఎక్కడైతే  ఇలా               ఉండదో ఆ సమాజంలో చెడు ప్రబలు తుంది. కనుక   బంధువులతో మంచిగా  వ్యవహరిం చడం  గొప్ప  కార్యంగా చెప్ప బడిరది.
హజ్రత్‌ సులైమాన్‌ బిన్‌ ఆమీర్‌  (రజి)   దైవ ప్రవక్త(స) ఇలా సెల విచ్చారని  ఉల్లేఖిం చారుÑ ‘అవసరార్ధి అయిన (బంధుత్వం లేని) వ్యక్తికి సదఖా (దానం)  ఇవ్వడం కేవలం  సదఖానే,   కాని  అదే  సదఖా బంధువులకు చెందిన వ్యక్తికి చేస్తే సదఖానే కాదు అది సిలారహమీ కూడా’ (తిర్మిజి, నసాయి)
బంధువుల  కోసం  ఖర్చు చేయడం అనేది రెట్టింపు పుణ్యం లభించేందుకు కారణం అవుతుంది. ఒకరకంగా చూస్తే ఇది ఇతర దానాల వంటి సామాన్య దానమే. ఇంకో రకంగా  చూస్తే  ఇది  బంధువులతో మంచిగా  వ్యవహరించటంతోపాటు సిలారహమీ కూడా.
వాస్తవంగా  మనిషి,  తన బంధువులతో సహజంగానే  దగ్గరితనపు  అనుభూతిని పొందుతాడు. అందుచేతనే  బంధుత్వా లలో కూడా కొన్ని  బంధుత్వాలు చాలా సున్నితమైనవి ఉంటాయి.  చిన్న చిన్న ఘటనల వల్ల కూడా బంధుత్వ సంబం ధాలు  చెడిపోయే  ప్రమాదం ఉంది. ‘బంధుత్వాలను  త్రుంచకండి, వాటిని కలిపే ప్రయత్నాలు చేయండి’ అని ఒక హదీసులో తెలుపబడిరది. సదాచారణకు ఇదొక పద్ధతి.
హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌(రజి) దైవ ప్రవక్త(స)  ఇలా  ప్రవచించారని ఉల్లేఖిం చారు: ‘బంధుత్వం తెగిపోయినప్పుడు దానిని కలిపేవాడే నిజంగా బంధుత్వాలను కలిపేవాడు  (సిలారహమీ చేసేవాడు), బంధుత్వం ఉండి  వారు తనతో మంచిగా వ్యవహరించేటప్పుడు బంధుప్రీతి చూపే వాడు కాదు.’   (బుఖారి, అబూదావూద్‌)
హజ్రత్‌ అబూ హురైరా(రజి) ఇలా  ఉల్లే ఖించారు : ఒకవ్యక్తి దైవప్రవక్త(స)తో ఇలా అన్నాడు:  ‘నాకు  కొందరు బంధువు లున్నారు. నేను వారితో బంధుత్వం కలుపు తాను, వారు నాతో బంధుత్వం తుంచు తారు. నేను వారితో మంచిగా వ్యవహరిస్తాను,  వారు  నాతో మంచిగా వ్యవహ రించరు.  నేను  వారితో మన్నింపువైఖరిని అవలం భిస్తాను.  వారు నాతో దురుసుగా ప్రవర్తి స్తారు. ఇది విన్న తరువాత ప్రవక్త(స) ‘నీ ప్రవర్తన పైన తెలిపిన విధంగాఉన్నట్ల యితే నీవు  వారినోట్లో బూడిద నింపినట్లే. నీ ఈవైఖరి ఇలాగే ఉన్నంత కాలం అల్లాప్‌ా తరఫు నుంచి నీకు ఒక సహాయ కుడు ఉంటాడు.’ అని సెలవిచ్చారు. (ముస్లిం)

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *