సహనమే శ్రేయోగుణం

‘సామర్ధ్యాలను  పెంపొందించుకునేం దుకు  ప్రయత్నించండి.  అసూయా పరుల  విమర్శలను పట్టించుకోకండి. తెలుసుకోండిÑ బ్రతికున్నంతకాలమే దైవదాస్యం చేయడానికి వీలుంటుంది. మరణించిన  తరువాత  అసూయా ద్వేషాలు  కూడా అంతమవుతాయి.’ అన్నాడు  ఒక  మేధావి. ఈజిప్టుకు చెందిన ఒక  ధార్మికవేత్త ఇలా అంటు న్నారు: విమర్శలకు బాధ పడే స్వభావం కలవారు సహనాన్ని అలవరచుకోవాలి. తద్వారా ఎంత కఠినమైన విమర్శలనైనా సహనంతో ఎదుర్కోవచ్చు. అల్లాప్‌ా అసూయ పరుల వ్యవహారంలో చాలా చక్కని  నిర్ణయం  తీసుకున్నాడు. అసూయ మొదట మనిషిని కాల్చడం ప్రారంభిస్తుంది.  చివరికి  అది అతన్ని అంతం చేస్తుంది.  ముతనిబ్బి అనే మేధావి ఇలాపేర్కొంటున్నాడు: ప్రశంస మనిషికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. హజ్రత్‌ అలీ(రజి) ఇలా అన్నారు: మృత్యువు  శక్తివంతమైన  డాలు లాంటిది.  ఒక   వైద్యుడు  ఇలా అంటాడు:  పిరికివాడు  అనేక  సార్లు చస్తాడు. ధైర్యవంతుడు  ఒకే  సారి చస్తాడు.

ఆపదలో  ఉన్నప్పుడు  అల్లాప్‌ా తన దాసునికి  ప్రశాంతతను ప్రసాదించా లనుకుంటే  ఆ  దాసునిపై  కమ్మటి కునుకు ఆవహిస్తుంది.  ఈ   విషయం ఉహుద్‌ మైదానంలో హజ్రత్‌ తల్హా (రజి)పై ఆవహించిన  కునుకు  ద్వారా విదితమవుతుంది.   దాంతో  ఆయన చేతుల నుంచి అనేక సార్లు ఖడ్గం జారి పోయింది.

అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవి స్తున్నాడు:  ‘వారితో  ఇలా  అనండిÑ ‘‘మీరు మా విషయంలో దేని కొరకు నిరీక్షిస్తున్నారో అది, రెండు మేళ్లలో ఒకటి తప్ప మరొకటేముంది? ఒక మీ విషయంలో  మేము  నిరీక్షిస్తున్నది ఏమిటంటే, అల్లాప్‌ా  స్వయంగా  మీకు శిక్ష ఇస్తాడా లేక మా చేతుల ద్వారా ఇప్పిస్తాడా అనేది. మంచిది,  అయితే  ఇక  మీరు కూడా నిరీక్షించండి. మేము కూడా మీతోపాటే నిరీక్షిస్తాము’’. (9:52)

మరొక చోట ఇలా సెలవిచ్చాడు: ఏ వ్యక్తీ అల్లాప్‌ా  నిర్ణయించిన  దానికి విరుద్ధంగా మరణించడు.  ఎవరయితే  ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నారో మేము వారికి  ప్రపంచాన్ని  ప్రసాదిస్తాము. ఎవ రయితే   పరలోక  పుణ్యాన్ని కోరుకుంటు న్నారో మేము వారికి పరలోకాన్ని ప్రసాది స్తాము. కృతజ్ఞులకు మేము అతి త్వరలోనే బహుమానాన్ని ప్రసాదిస్తాము. (3:145)

హజ్రత్‌  అబూబకర్‌  (రజి)  ఇలా పేర్కొ న్నారు: (అల్లాప్‌ా మార్గంలో) మృత్యువును కోరుకోండి. మీకు జీవితం ప్రసాదించబడు తుంది.

బాధ పడాల్సిన అవసరం లేదు. అల్లాప్‌ా మిమ్మల్ని సంరక్షిస్తాడు. దైవదూతలు మీ కోసం వేడుకుంటారు. విశ్వాసులు ప్రతి రోజూ నమాజ్‌లో మీ వెంటే ఉంటారు. ప్రవక్త (సఅసం) మీ  కోసం  సిఫారసు చేస్తారు.   దివ్యఖుర్‌ఆన్‌లో  మంచి వాగ్దానం చేయబడిరది. వీటన్నింటిపై ఆ కరుణామయుడి కారుణ్యం ఉండనే               ఉంది.

విచారించకండి.  ఒక్క  పుణ్యానికిగాను పది నుంచి ఏడొందల  రెట్లు  అధికంగా పుణ్యం ప్రసాదించబడుతుంది. ఎంత చెడు చేస్తే అంతే పాపం దక్కుతుంది. కాని  దాన్ని  కూడా  అల్లాప్‌ా  క్షమించే అవకాశం   ఉంది.   అల్లాప్‌ా  కరుణ అనంతం.    మీరు  భయపడవలసిన అవసరం లేదు. మీకు విశ్వాస భాగ్యం ప్రాప్తమయింది. మీరు అల్లాప్‌ాను, అల్లాప్‌ా ప్రవక్తను విశ్వసిస్తారు. వారిని ప్రేమిస్తారు. పుణ్యం చేస్తే సంతోషం, పాపం  చేస్తే  బాధ  కలుగుతున్న ట్లయితే మీకు మేలే  జరుగుతుంది.

విశ్వాసి వ్యవహారం  చాలా విచిత్రంగా ఉంటుంది.  అతని  వ్యవహారం మొత్తం   మేలుతోనే  కూడుకుని             ఉంటుంది.  ఇది  కేవలం విశ్వాసి కొరకే ప్రత్యేకం. కష్టం కలిగితే సహనం వహిస్తాడు.  కనుక  అతనికి  మేలు జరుగుతుంది. సంతోషం   కలిగితే అల్లాప్‌ాకు  కృతజ్ఞతలు  తెలుపుకుం టాడు అప్పుడు కూడా అతనికి మేలే జరుగుతుంది. (హదీస్‌)

కష్టాలు  వచ్చినప్పుడు  వాటి  నుంచి బయట పడే ఉత్తమ మార్గం సహనం. కష్టాల్లో సహనం వహించాలి. దాంతో అల్లాప్‌ా సహాయం తోడవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు విశ్వాసులు మూడు మార్గాలను అవలంభిస్తారు. 1.సహనం 2.దుఆ 3.కష్టం తొలగి పోయే వరకు నిరీక్షణ. ఒక కవి ఇలా అంటున్నాడు: ఉన్నత ఆశయాలు సాధించడానికి  నువ్వు  ఇంత నిదా నంగా వెళ్తున్నావు. ప్రజలు వాటి కోసం ఎంతో  శ్రమిస్తున్నారు.  కొందరు విసిగిపోతారు కూడా.  కాని సహనం, దృఢసంకల్పంతో ముందుకు సాగితేనే ఉన్నత ఆశయాలను సాధించవచ్చు.  గొప్పవాళ్లుగా  ఎదగాలంటే  ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.  కోరికలు, ఆకాంక్షలతో గొప్ప వాళ్లు అయిపోరు. దాని కోసం అహర్నిశలు ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. దాని కోసం ఎన్నో ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. వాటిని   పగడ్బందీగా  అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే గొప్ప స్థానానికి చేరుకుంటాం.

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *