స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49)
ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని విజ్ఞులే అర్ధం చేసుకోగలరు. విశ్వాసులు తిరస్కారులను చూసి అల్లాప్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.  అల్లాప్‌ా తమకు రుజుమార్గం చూపాడు. విశ్వాస సౌభాగ్యంతో సుసంపన్నం చేశాడు. కాని అవిశ్వాసుల పరిస్థితి అలా కాదు.  వారు అల్లాప్‌ా పట్ల తిర స్కార వైఖరినవలంభిస్తారు.  అల్లాప్‌ా గుణాలను తిరస్క రిస్తారు. ఉపాధి ప్రదాత, సర్వసృష్టికర్త అయిన అల్లాప్‌ాతో పోట్లాటకు దిగుతారు.  ఆయన  ప్రవక్తలు, గ్రంథాలను తిరస్కరిస్తారు. ఆయన ఆదేశాలకు విముఖులవుతారు. కాని ముస్లిముల పరిస్థితి అలా కాదు. వారు అల్లాప్‌ాను విశ్వసి స్తారు. ఆయన ప్రవక్తలు, గ్రంథాలు, పరలోకాన్ని విశ్వసిస్తారు. వారికి విధించిన విధులను నిర్వర్తిస్తారు. ఇది వారికి ప్రసాదిం చబడిన అమూల్యమైన వరం. దీన్ని ఏ వస్తువుతోనూ కొనలేము. అమ్మలేము. భౌతిక వస్తువులతో దీన్ని పోల్చనూ లేము.  విశ్వాసి  అవిశ్వాసి సరిసమానం కాగలరా? లేదు. ఎన్నటికీ వారు సమానులు కాలేరు.

geeturai_weekly_magazine_19_1

‘లాఇలాహ ఇల్లల్లాప్‌ా’ అంటే అల్లాప్‌ా తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు. ఆయన తన గుణగణాలలో ఒంటరివాడు. దేవుడు ఒక్కడే. ప్రేమ, గౌరవం, భయం, వినయం అన్నీ ఆయన కొరకే ప్రత్యేకం చేయాలి. ఆయన్ను తప్ప ఎవ్వరినీ ప్రేమించరాదు. కేవలం ఆయన్నే మనస్పూర్తిగా ప్రేమించాలి. అతనికే భయపడాలి. ఎవ్వరికీ భయపడకూడదు. అతన్నే నమ్ముకోవాలి. అతని వైపుకే మళ్ళాలి. అతని పేరు మీదనే ప్రమాణం చేయాలి. అతన్నే మొక్కుకోవాలి. అతని చెంతనే పశ్చాత్తాపం చెందాలి. అతని ఆదేశాన్ని పాటించాలి. పుణ్యం ప్రసాదించేది అతనేనని విశ్వసించాలి. కష్టాల సమయంలో అతన్నే వేడుకోవాలి. అతన్నే శరణు కోరాలి. అతని ముందే సాష్టాంగపడాలి. అతని పేరు మీదనే జిబప్‌ా చేయాలి. దీనం తటికి మూలం ఏమిటంటే  మనం  చేసే ప్రతి ఆరాధన, పని అతని కోరకే చేయాలి.

ఆపదలతో మీ గొప్పతనం తరగదు
ఉక్కాజ్‌ అనే పత్రికలో ఒక అంధుని ఇంటర్వ్యూ ప్రచురిం చబడిరది. అతని పేరు మప్‌ామూద్‌ బిన్‌ ముహమ్మద్‌ అల్‌ మదనీ. ఆయన, సాహిత్య పుస్తకాలను వేరే వారు చదువు తుండగా వినేవారు. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే వరకు అలా వింటూ ఉండేవారు. అనతి కాలంలోనే ఆయన గొప్ప పండితులయ్యారు. అంధులైనప్పటికీ అన్ని రంగాల్లో గొప్ప నైపుణ్యాన్ని సాధించారు.

ముస్తఫా అమీన్‌ అష్షర్‌ఖుల్‌ అవ్‌సత్‌ అనే పత్రికాలో ‘‘ఫిక్రతు’’ అనే వ్యాసంలో ఇలా రాశారు: దౌర్జన్యపరుల దౌర్జన్యాలకు, కుట్ర దారుల కుట్రలకు, అక్రమార్కుల అక్రమాలకు గాను కొద్ది పాటి సహనం వహించండి. వారి దౌర్జన్యాలు తుత్తునియ లవుతాయి.  కుట్రలు  వీగిపోతాయి. అక్రమాలు తొలగి పోతాయి. చీకట్లు తొలగిపోతాయి. మీరు కేవలం సహనం వహించండి. ఒక ప్రముఖ కవి ఇలా అన్నాడు: మనిషికి ఎన్నో ఆపదలు వస్తాయి. అతను అందులో కూరుకుపోయి కుంచిం చుకుపోతాడు. కాని అల్లాప్‌ా అతన్ని వాటి నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు.

కమ్యూనిష్టులు  అల్‌బానియా  దేశానికి చెందిన ఒక ప్రముఖ ముఫ్తీని నిర్బంధించారు. 20 ఏళ్ళ వరకు ఆయన్ను అత్యంత పాశవికంగా  హింసించారు.  రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు.  అన్నపానీయాలు  కూడా  ముట్టనివ్వలేదు. అయి నప్పటికీ  ఆయన  ఐదుపూటల  నమాజ్‌ చేసేవారు.  వారు ఎంతగా   హింసించినా  ఆయన   సహనం  వహించారు. అల్లాప్‌ాను విశ్వసించారు. చివరికి ఆయనకు విముక్తి లభిం చింది. ఆయన అక్కడి నుంచి విడుదల అయ్యారు. ఆయన అల్లాప్‌ాపై ఉంచిన విశ్వాసం నెరవేరింది.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన నెల్సన్‌ మండేలా ఉదాహరణ కూడా అలాంటిది. తన జాతికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇప్పించడానికి ఉద్యమించారు. ఫలితంగా జాతీయ వాదులు ఆయన్ను 27 ఏళ్ళు నిర్బంధించి ఉంచారు. ఆయన నిర్బంధంలో ఉంటూనే చిత్తశుద్ధితో, నిలకడతో ఉద్యమాన్ని నడిపించారు. బానిస సంకెళ్ళ నుంచి తన జాతికి విముక్తిని ప్రసాదించడానికి ఆయన చేపట్టిన ఉద్యమం ఫలించింది. జాతికి ముక్తి లభించింది. ప్రపంచంలో ఆయన గొప్ప పేరు ప్రఖాతులు సంపాదించారు. అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:
‘‘మేము ఇక్కడే వారి ఆచరణలకు పూర్తి ప్రతిఫలాన్ని ప్రసా దిస్తాము’. (15:11) మరో చోట ఇలా ఉంది: ‘‘ఒక వేళ మీరు బాధ పడుతూ ఉంటే మీ మాదిరిగానే వారు కూడా బాధపడు తున్నారు. పైగా అల్లాప్‌ా నుండి వారు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు.’’(4:104).  మరోచోట  ఇలా  ఉంది: ‘‘క్రుంగి పోకండి. దు:ఖ పడకండి, మీరే ప్రాబల్యం పొందుతారు. మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు. నిజమే. ఇదివరకు మీ ప్రత్యర్ధి కూడా ఇటువంటి దెబ్బతిన్నారు.
(3:140)

Check Also

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *