సంపాదకీయం

ఫలితాలు

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొందరికి సంతోషాన్నిచ్చాయి. కొందరికి విషాదంగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఊహించనివారిలో సహజంగానే నిరాశ కమ్ముకుంటుంది. కాని ఇది వాస్తవం, కాబట్టి వాస్తవంగానే స్వీకరించాలి. వివిధ రాజకీయపార్టీలు, ఈ ఎన్నికల్లో దారుణపరాభవానికి గురైన పార్టీలు ఓటమికి కారణాలను సమీక్షించుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి సమీక్షలు పార్టీలకు అవసరమే. వివిధ సామాజిక వర్గాల్లోను ఈ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి. అలాంటి సామాజిక వర్గాలు కూడా కారణాలను సమీక్షించుకోవాలి.  వివిధ రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాయి. తమ …

Read More »

కొన్ని ప్రశ్నలు

మీడియా ఇటీవల ఒక కొత్త ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనితీరును కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చి చూడడం. కాని ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, సాధించిన విజయాలను, వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పోల్చి చూడడం కుదరదన్న కనీస అవగాహన మన బడా బడా మేధావి పాత్రికేయులకు లేదా? గుజరాత్‌ ప్రభుత్వం పనితీరును మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ వంటి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుతో పోల్చగలమే కాని కేంద్ర ప్రభుత్వ పనితీరుతో ఎలా పోల్చగలం. ఎందుకంటే మన రాజ్యాంగం …

Read More »

శాంతి చర్చలు

ఇస్రాయీల్‌ పలస్తీనాల మధ్య శాంతి చర్చల్లో మరోసారి ఇస్రాయీల్‌ పట్ల పక్షపాతం కనబడుతోంది. పలస్తీనాపై ఒత్తిళ్ళు పెంచుతున్నారు. నిజానికి ఇంతకాలం శాంతి చర్చలు స్తంభించడానికి కారణం ఇస్రాయీల్‌ మూర్ఖపు వైఖరే అని అందరూ అంగీక రించారు. కాని ఇప్పుడు మాత్రం పలస్తీనాపై ఒత్తిడి పెంచి ఇస్రాయీల్‌ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నాలు పెద్ద  ఎత్తున జరుగుతున్నాయి.  ఇప్పుడు మాటలు కూడా మారిపోయాయి. ఇస్రాయీల్‌ శాంతి చర్చలకు  సిద్ధంగా ఉన్నప్పటికీ పలస్తీనా వైఖరి వల్లనే ఆలస్యమైందని ఇప్పుడు అంటున్నారు.  పలస్తీనా అనవసరపు షరతులతో చర్చలకు అడ్డంకులు సృష్టిస్తుందని …

Read More »