ప్రత్యేక కథనం

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా భావించబడుతుంది. వారిని స్వాగతించడానికి అనేక గొప్ప ఏర్పాట్లు చేయబడతాయి. ఇక్కడ పవిత్ర రమజాన్‌ మాసం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దాని రాక కేవలం ఒక ముస్లింకే కాక, ముస్లిం జాతి మొత్తం ప్రపంచంలోకి ప్రతి వ్యక్తికి విశ్వవ్యాప్తంగా శుభప్రదమైన, లాభదాయకమైన, సందేశం ఇస్తుంది. రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, …

Read More »

ప్రత్యేక కథనం: ఆత్మహత్య ఘోరపాపం

ఎవరైనా తమ ప్రాణాలను తాము బలవంతంగా తీసుకోవడాన్నే ‘ఆత్మహత్య’ అంటారు. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసు కోవడం   ఒక  అంటువ్యాధిలా  ప్రబలి పోతోంది. ఏ పేపర్‌ తిరగేసినా, టీవిలో ఏ ఛానెల్‌ చూసినా ఆత్మహత్యలు ప్రధా నంగా ఉంటున్నాయి. జీవితం రంగుల మయం,  కష్టసుశాల  మిశ్రమం. సుఖ దుఃఖాలు లాభనష్టాలు  సహజం. ఈ జీవితం దేవుడిచ్చిన వరం.  సమస్యలకు భయపడి ఆందోళనతో ఆత్మహత్య కోరితే సమస్యలు పరిష్కారం కావు. చీకటి లేకుండా ఉదయం రాదు. ఓటమి లేనిదే విజయం లేదు. దైవం ప్రసాదించిన ఈ …

Read More »

‘బహు’ చెడ్డ మార్గం తరువాయి భాగం

( గత సంచిక తరువాయి ) ఒకే దేవుని పట్ల భయం, పాపాలలో కూరుకుపోయిన సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దింది. దైవత్వంలో ఇతరులను చేర్చే వారిలో దైవభీతి నశించి పోతుంది. దైవత్వంలో ఇతరు లను చేర్చే వారి నమ్మకం ఎలా ఉంటుందంటే వారు ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు నరకశిక్ష నుండి వీరిని తప్పకుండా కాపాడుతారు అని నమ్ముతారు. వారు ఎంత పాపాత్ములైనాసరే. దైవత్వంలో  ఇతరులను  చేర్చడం వలన మనిషిపై  పడే  చెడు  ప్రభావాలు: పాపా లలో పీకల్లోతు కూరుకుపోతాడు. అతనిలో మంచి  వ్యక్తిత్వం  …

Read More »

మంచి మనుషులు – స్పెషల్ స్టోరీ

1)     దైవాన్ని స్మరించేవారు,  స్మరించని వారి పోలిక ప్రాణమున్న జీవులు, ప్రాణం  లేని  మృతుల్లాంటిది. (బుఖారి` హజ్రత్‌ అబూమూసా అష్‌అరీ(ర) 2)     దేవుడు  ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త(స) అన్నారు:‘నేను నా దాసుడు తలచేవిధంగా అతని తలంపుకు దగ్గరిగా ఉంటాను. దాసుడు నన్ను జ్ఞాపకం  చేసుకున్నప్పుడు నేనతని వెంట ఉంటాను. అతను నన్ను తన మనసులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనతణ్ణి నా మదిలో గుర్తుచేసుకుం టాను. అతను  గనక  నన్ను సమా వేశంలోగుర్తుచేసుకుంటే నేనతన్ని దానికన్నా శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తు చేసుకుంటాను. …

Read More »

గతమెంతో ఘనకీర్తి – స్పెయిన్

యూరొపియన్‌ దేశాల్లో స్పెయిన్‌ ఒకటి. నేడు దానికి ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కనీసం ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌ దేశాల్లాంటి గుర్తింపు కూడా దానికి లేదు. యూరప్‌లోని ఇతర అనేక చిన్నాచితక దేశాల్లాగే అదో దేశం. కాని దాని గత చరిత్ర ఎంతో ఘనమైనది. విశిష్టత కలిగింది. క్రీ.శ. 9,10 శతాబ్దంలో అది యూరొప్‌ అంతటిలో ప్రఖ్యాతి గాంచింది. తలమానికంగా నిలిచింది. సభ్యతా సంస్కృతు ల్లోనైతేనేమి, కట్టడాల్లో శిల్పకళా ఖండాల్లోనైతేనేమి, విద్యా విజ్ఞానాల రీత్యా చూసిన, సుస్థిరత సుపరి పాలనరీత్యా చూసినా, …

Read More »

సదాచరణ

geeturai_weekly_magazine_18_1

మనం మంచిగా ఎలా వ్యవహరించాలి? సేవలకు అర్హులైనవారెవరు? అనే విషయాలు ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేసింది. మనిషికి తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, సమీప బంధువులు అనగానే సహజసిద్ధంగానే ప్రేమాభిమానాలుంటాయి. వారితో ఒక ప్రత్యేకమైన హార్థిక సంబంధాన్ని కలిగివుంటాడు. అందుకే వారి సేవ చేయడం తన నైతిక కర్తవ్యంగా భావిస్తాడు. ఇలాంటి భావాత్మకమైన సంబంధం సమాజంలోని ఇతరులతో (సాధారణంగా) ఉండదు. వారితో అతని వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మానవ సంబంధాల ప్రకారం వారి పదవులు, హోదా శ్రేణులను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని వారి వారి …

Read More »

ముళ్ళ గులాబి

సమ్రీన్‌ పదహారేళ్ళ చలాకీ, తెలివిగల అమ్మాయి.  ఎప్పుడూ చిన్న పిల్లలతో ఆడుతూ, వారి నవ్వుల కేరింతల మధ్య తను  ఆనందంగా  ఉండేది.  తను నేర్చు కున్న విద్యను ఆ పేద పిల్లలకు పంచుతూ అందరికీ  ఆదర్శంగా  నిలిచేది. సమ్రీన్‌ మంచి గుణగణాలను చూసి ఆమె కోసం ఎన్నో పెళ్ళి సంబంధాలు వచ్చాయి. కానీ సమ్రీన్‌ తల్లిదండ్రులకు, అప్పుడే పెద్ద కూతురైన  అమ్రీన్‌  వివాహం  చేసి వుండటం వల్ల మళ్ళీ వెంటనే సమ్రీన్‌ వివాహం చేయలేక  ఆ వచ్చిన సంబం ధాలను నిరాకరించారు. మంచి గుణ …

Read More »

ఉన్మాద చర్య

మహారాష్ట్రలోని పూణె  నగరానికి  ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు…  వివిధ దేశాల నుంచి  సైతం వేల సంఖ్యలో యువతీ యువకులు ఏటా మంచి చదువుల కోసం, ఉపాధి కోసం అక్కడికి వస్తుంటారు. ఆ నగరాన్ని  ఆలంబనగా  చేసుకుని నిలదొక్కుకోవడానికి,  మెరుగైన జీవితం పొందడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఆ రకంగా అది అవకాశాల నగరం. ఆశావహుల నగరం. భిన్న భావా లకూ,  సంస్కృతులకు వేదిక. అలాంటి చోట  ఒక  యువ ఐటీ రంగ నిపుణుడు మొహిసిన్‌ …

Read More »

విశ్వాసమే సౌభాగ్యం

ఇస్లామ్‌  ధర్మాన్ని   తెలుసుకోని వారు ఎంత దురదృష్ట వంతులు?  వారు  మార్గదర్శకాన్ని పొందలేరు. ఇస్లామ్‌ ధర్మావలంభీకులు ఇస్లామ్‌ పరివ్యాప్తి కోసం ఒక దీటైన ఉద్యమాన్ని లేవనెత్తాలి. ఇదొక బృహత్తర కార్యం. దీని ప్రచారం కట్టుదిట్టంగా, ఉన్నతంగా, ఘనంగా జరగాలి. ఎందుకంటే ధర్మసందేశావలంభనలోనే మానవ సాఫల్యం దాగి ఉంది. అల్లాప్‌ా దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ఎవడయినా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లామ్‌ను) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదిం చబడదు. (3:85) ఒక ప్రముఖ ముస్లిమ్‌ ధర్మప్రచార కర్త జర్మనీలోని …

Read More »

కొత్త ప్రభుత్వం పాత సమస్యలు

సాధారణ ఎన్నికలు ముగిశాయి. దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గ సహచరులెవరుండాలో కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించింది. మీడియా ద్వారా ప్రధాని తాను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా పనిచేయాలనుకుంటున్నారో ప్రజలకు  వివరించారు. కాని ప్రధాని ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక, చేయదలచిన పనులపై చాలా మంది నిపుణులు విభిన్న విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు భయాలు బయటపెడుతున్నారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించవలసి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను రాజ్యాంగ నిబంధనల నేపధ్యంలో కూడా …

Read More »