స్ఫూర్తి

గురువే మార్గదర్శి

ఈనాడు  స్వలాభం వల్ల,  స్వార్థం వల్ల ఉపాధ్యాయులు   విద్యార్థుల  మధ్య ఉండవలసిన సంబంధాల ప్రాముఖ్యత, దాని ఔన్నత్యం క్షీణిస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ  విషయంలో ఉపా ధ్యాయులు గౌరవప్రదమైన తమ స్థానాన్ని, తమ  బాధ్యతలను  అవగాహన చేసు కోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.  మరొకవైపు విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల ఔన్న త్యాన్ని,  వారి   స్థానాన్ని,  వారి  గౌరవాన్ని గ్రహించటంలేదు. దాని కారణంగా విద్యా ర్థులు, ఉపాధ్యాయులను అగౌరవపరిచే వారిని హేళన చేసే వార్తలు తరచూ మన దృష్టికి వస్తున్నాయి.  ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు …

Read More »

షాబాన్ నెల ప్రాముఖ్యత

ఇస్లామీయ నెలల్లో 8వ నెల షాబాన్‌. పన్నెండు నెలల్లో షాబాన్‌ నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే షాబాన్‌ నెలని మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు తన నెలగా పేర్కొన్నారు. హజ్రత్‌ అబూ హురైరా(రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఒక సందర్భంలో ఇలా ఉపదేశించారు : షాబాన్‌ నా నెల. రజబ్‌ అల్లాప్‌ా నెల, రమజాన్‌ నా జాతి నెల. షాబాన్‌ నెల మానవులను పాపాల నుండి దూరం చేస్తుంది, రమజాన్‌ నెల పరిశుభ్రం చేస్తుంది. షాబాన్‌ నెల గురించి మహాప్రవక్త(స) గారు …

Read More »

జ్ఞానార్జన ప్రాముఖ్యత

మానవులను అల్లాప్‌ా తన దాస్యం కొరకే పుట్టించాడు. ‘నేను జిన్నుల్ని, మానవుల్ని నా ఆరాధన చేయడానికి  తప్ప మరే ఉద్దేశ్యంతో సృజించలేదు.’ (దివ్య ఖుర్‌ఆన్‌) దాస్యం (ఆరాధన) చేస్తే పుణ్యం లభిస్తుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని జ్ఞానం (ఇల్మ్‌) ఆర్జించడం ఇంకా పుణ్య కార్యం. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘జ్ఞాన ప్రాముఖ్యత, ఆరాధనల ప్రాము ఖ్యత కంటే అధికం.’ (వజ్జార్‌) ఇక్కడ ఆరా ధనలు అంటే తప్పనిసరిగా చేయవలసినవి (ఫర్జ్‌) కావు. అదనపు (నఫిల్‌) ఆరాధనలు అని అర్థం చేసుకోవాలి. అజ్ఞానంతో …

Read More »

వేసవి ఫలాలు

సల్మాన్‌ హైదర్‌ వేసవి వచ్చేసింది. భానుడు తన వేడిమి తీవ్రతను చూపించడం ప్రారంభించాడు. సీజన్‌లో వచ్చే ఫలాలని, వాటి రసాలని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. పళ్ళల్లో అనేక విటమిన్లు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉండటమేకాకుండా పిండిపదార్థాలు 5నుంచి 20శాతం వరకు ఉంటాయి. పైగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌లు సమపాళ్ళలో ఉండటం, ఆర్గానిక్‌ ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల వేసవి తాపం కారణంగా శక్తి నశించిన వారికి వెంటనే చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి. రక్తంలో పేరుకుపోయే కొవ్వుని తగ్గించడమే కాకుండా గుండెపోటుని తగ్గించే …

Read More »

సహనమే శ్రేయోగుణం

‘సామర్ధ్యాలను  పెంపొందించుకునేం దుకు  ప్రయత్నించండి.  అసూయా పరుల  విమర్శలను పట్టించుకోకండి. తెలుసుకోండిÑ బ్రతికున్నంతకాలమే దైవదాస్యం చేయడానికి వీలుంటుంది. మరణించిన  తరువాత  అసూయా ద్వేషాలు  కూడా అంతమవుతాయి.’ అన్నాడు  ఒక  మేధావి. ఈజిప్టుకు చెందిన ఒక  ధార్మికవేత్త ఇలా అంటు న్నారు: విమర్శలకు బాధ పడే స్వభావం కలవారు సహనాన్ని అలవరచుకోవాలి. తద్వారా ఎంత కఠినమైన విమర్శలనైనా సహనంతో ఎదుర్కోవచ్చు. అల్లాప్‌ా అసూయ పరుల వ్యవహారంలో చాలా చక్కని  నిర్ణయం  తీసుకున్నాడు. అసూయ మొదట మనిషిని కాల్చడం ప్రారంభిస్తుంది.  చివరికి  అది అతన్ని అంతం చేస్తుంది.  …

Read More »